Mohammed Shami: మహ్మద్ షమీ ఛీటింగ్ చేశాడా? టీమిండియా స్టార్ పేసర్‌పై సంచలన ఆరోపణలు.. రుజువైతే నిషేధం?

|

Nov 17, 2024 | 5:55 PM

టీమిండియా స్టార్ పేసర్ మహమ్మద్ షమీ మళ్లీ క్రికెట్ మైదానంలోకి వచ్చాడు, 2023 వన్డే ప్రపంచకప్ తర్వాత పాదాలకు శస్త్రచికిత్స చేయించుకున్న షమీ ఇప్పుడు రంజీ టోర్నీతో పునరాగమనం చేశాడు. అయితే ఇంతలోనే ఈ స్టార్ పేసర్ పై సంచలన ఆరోపణలు వచ్చాయి.

Mohammed Shami: మహ్మద్ షమీ ఛీటింగ్ చేశాడా? టీమిండియా స్టార్ పేసర్‌పై సంచలన ఆరోపణలు.. రుజువైతే నిషేధం?
Mohammed Shami
Follow us on

టీమిండియా పేసర్ మహ్మద్ షమీపై సంచలన ఆరోపణులు వినిపిస్తున్నాయి. ఈ స్టార్ క్రికెటర్ తన వయసు విషయంలో అబద్ధాలు చెబుతున్నాడంటూ సోషల్ మీడియా వేదికగా ఒక నెటిజన్ సంచలన ఆరోపణలు చేశాడు. ఇందుకు సాక్ష్యంగా షమీ డ్రైవింగ్ లైసెన్స్ ఫొటోను కూడా షేర్ చేశాడు. ఈ డ్రైవింగ్ లైసెన్స్ ప్రకారం మహ్మద్ షమీ వయసు 42. అయితే అధికారికంగా అతను పేర్కొన్న వయసు 34 ఏళ్లు. అంటే మహ్మద్ షమీ సుమారు 8 ఏళ్లు వయసును దాచి పెట్టాడని మోహన్ కృష్ణ అనే నెటిజన్ ఆరోపిస్తున్నాడు. బీసీసీఐ నిబంధనల ప్రకారం వయస్సును దాచడం తీవ్రమైన నేరం. సాధారణంగా అండర్-19 జట్టులో చోటు దక్కించుకోవడానికి ఆటగాళ్లు తమ వయస్సు ఒకటి లేదా రెండేళ్లు తక్కువగా ఉన్నట్లు చెబుతుంటారు. ఇలా వయస్సు మార్పు కారణంగా గతంలో చాలా మంది ఆటగాళ్లు పట్టుబడ్డారు. అలాంటి ఆటగాళ్లపై బీసీసీఐ సస్పెన్షన్‌ విధించడం తదితర కఠిన చర్యలు తీసుకుంది.

ఇప్పుడు, టీం ఇండియా పేసర్ మహ్మద్ షమీపై కూడా వయస్సు విషయంలో సంచలన ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ విషయంపై దర్యాప్తు చేయాలని కృష్ణ మోహన్ బీసీసీఐని అభ్యర్థించాడు. ఒకవేళ బీసీసీఐ ఈ అభ్యర్థనను పరిగణనలోకి తీసుకుని షమీపై విచారణ జరిపి నిజమని తేలితే మాత్రం ఈ టీమిండియా స్టార్ కు చిక్కులు తప్పవు. నిషేధం కూడా విధించే అవకాశం ఉంది.

ఇవి కూడా చదవండి

గత ఏడాది కాలంగా భారత జట్టుకు దూరమైన మహ్మద్ షమీ ఇప్పుడు గాయం నుంచి కోలుకుని రంజీ టోర్నీలో ఆడుతున్నాడు. అలాగే తొలి మ్యాచ్ లోనే 7 వికెట్లు పడగొట్టి బెంగాల్ జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. దీంతో బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ కోసం అతనిని ఆస్ట్రేలియా పంపేందుకు కూడా బీసీసీఐ సిద్ధమైనట్లు ప్రచారం జరుగుతోంది. అయితే ఇంతలోనే ఈ స్టార్ పేసర్ పై సంచలన ఆరోపణలు రావడం గమనార్హం.

Mohammed Shami Driving License

 

మరిన్ని క్రీడా వార్తల కోసం క్లిక్‌ చేయండి.