Asia Cup 2025: స్పాన్సర్ లేకుండానే ఆసియా కప్ 2025లో బరిలోకి భారత జట్టు.. కారణం ఏంటంటే?

Indian Cricket Team Sponsorship: భారత ప్రభుత్వం ఇటీవల డబ్బు ఆధారిత ఆటలను అరికట్టడానికి ఒక బిల్లును ఆమోదించింది. దీంతో Dream11 తో పాటు, PokerBaazi, MPL వంటి అనేక ఆన్‌లైన్ గేమింగ్ ప్లాట్‌ఫారమ్‌లు ఇబ్బందులు పడుతున్నాయి. ఈ రూల్‌తో బీసీసీఐ కూడా కష్టాలు ఎదుర్కొవల్సి వస్తోంది.

Asia Cup 2025: స్పాన్సర్ లేకుండానే ఆసియా కప్ 2025లో బరిలోకి భారత జట్టు.. కారణం ఏంటంటే?
Team India Asia Cup

Updated on: Aug 24, 2025 | 6:40 AM

Indian Cricket Team Sponsor: ఆగస్టు 22న పార్లమెంటు ఆన్‌లైన్ గేమింగ్ ప్రమోషన్ అండ్ రెగ్యులేషన్ బిల్లును ఆమోదించింది. ఇది భారతదేశంలో డబ్బు ఆధారిత గేమింగ్ కంపెనీలకు చెక్ పెట్టింది. ఈ నిర్ణయం కారణంగా, భారత క్రికెట్ జట్టు స్పాన్సర్ డ్రీమ్ 11 ఉనికి ప్రమాదంలో పడింది. ఈ కంపెనీ టీమ్ ఇండియా స్పాన్సర్‌షిప్ నుంచి వెనక్కి తగ్గే అవకాశం ఉందని భావిస్తున్నారు. అయితే, భారత క్రికెట్ నియంత్రణ బోర్డు, డ్రీమ్ 11 నుంచి ఎటువంటి ప్రకటన రాలేదు. భారత పురుషుల జట్టు తదుపరి ఆసియా కప్ 2025లో ఆడాల్సి ఉంది. ఈ టోర్నమెంట్ సెప్టెంబర్ 9 నుంచి ప్రారంభమవుతుంది. అదే సమయంలో, మహిళల జట్టు సెప్టెంబర్‌లో ఆస్ట్రేలియాతో వన్డేలు ఆడాల్సి ఉంది. ఆపై 2025 ప్రపంచ కప్‌లో పాల్గొనాలి.

BCCI, Dream11 భవిష్యత్తు గురించి, బీసీసీఐ కార్యదర్శి దేవ్‌జిత్ సైకియా ఆగస్టు 22న వార్తా సంస్థ AFPతో మాట్లాడుతూ, “దీనిని అనుమతించకపోతే, మేం ఇలాంటివి ప్రోత్సహించం. కేంద్ర ప్రభుత్వం చేసిన దేశంలోని ప్రతి విధానాన్ని బీసీసీఐ అనుసరిస్తుంది.” మరోవైపు, Dream11 దీని గురించి ఇంకా ఏమీ చెప్పలేదు. ఆగస్టు 22న దాని డబ్బు ఆధారిత ఆటలను ఆపివేస్తామని చెప్పింది. మేం త్వరలో రెండవ ఇన్నింగ్స్‌లో మొదలెడతాం. పార్లమెంటులో బిల్లు ఆమోదించబడిన తర్వాత, Dream11 ఆగస్టు 22 ఉదయం నుంచి అన్ని చెల్లింపు పోటీలను నిలిపివేసిందని చెప్పింది. ఇప్పుడు ఉచితంగా ఆడగల ఆటలు మాత్రమే కొనసాగుతున్నాయి. కంపెనీ దేశ చట్టాలను అనుసరిస్తుంది అంటూ చెప్పుకొచ్చాడు.

BCCI, Dream11 మధ్య ఎన్ని కోట్ల ఒప్పందం జరిగింది?

భారత జట్టుకు ప్రధాన స్పాన్సర్‌గా వ్యవహరించడానికి డ్రీమ్11 జులై 2023లో మూడు సంవత్సరాల పాటు ఒప్పందంపై సంతకం చేసింది. ఇది బైజు స్థానాన్ని భర్తీ చేసింది. డ్రీమ్11 రూ.358 కోట్లకు ఒప్పందం కుదుర్చుకుందని చెబుతున్నారు. దీనికి ఇంకా ఒక సంవత్సరం మిగిలి ఉంది. ఇది జులై 2026లో పూర్తి కావాలి. డ్రీమ్11 ఇప్పుడు వైదొలగాలని నిర్ణయించుకుంటే, టీమ్ ఇండియా స్పాన్సర్ లేకుండా ఆడాల్సి ఉంటుంది. అలాగే, బీసీసీఐ కొత్త స్పాన్సర్‌ను కనుగొనవలసి ఉంటుంది.

ఇవి కూడా చదవండి

భారత క్రికెట్ జట్టును స్పాన్సర్ చేసే కంపెనీల చరిత్ర అంత బాగా లేదు. సహారా ఇండియా నుంచి స్టార్ ఇండియా, ఒప్పో, బైజూస్ వరకు అన్నీ ఇబ్బందులను ఎదుర్కోవలసి వచ్చింది.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..