Virat Kohli-Rohit Sharma: మొత్తం మూడు ఫార్మాట్ల క్రికెట్‌కు ఇద్దరు కెప్టెన్లను టీమ్ ఇండియా నియమించింది. ఈ మేరకు బీసీసీఐ మంగళవారం ప్రకటించిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం విరాట్ కోహ్లీ టెస్టుల్లో జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు. అదే సమయంలో వన్డేలు, టీ20ల్లో రోహిత్ శర్మ కెప్టెన్‌గా ఎంపికయ్యాడు. 12 టెస్ట్ ఆడే దేశాల్లో వైట్ బాల్ క్రికెట్‌లో ఏయే దేశాలు వేర్వేరు కెప్టెన్‌లను నియమించాయో అలాగే పాత పద్ధతిని అనుసరించి ఒకే కెప్టెన్‌తో ఎన్ని దేశాలు బరిలోకి దిగనున్నాయో తెలుసుకుందాం.
పాకిస్థాన్, న్యూజిలాండ్, ఐర్లాండ్, జింబాబ్వే..
మూడు ఫార్మాట్లలో కేన్ విలియమ్సన్ కెప్టెన్సీలో న్యూజిలాండ్ టీం బరిలోకి దిగుతోంది. ఇద్దరు కెప్టెన్ల విధానాన్ని కివీస్ టీం పాటించలేదు. అదే సమయంలో, పాకిస్థాన్‌కు కూడా మూడు ఫార్మాట్లలో ఒకే కెప్టెన్ ఉన్నాడు. బాబర్ ఆజం కెప్టెన్సీలో పాక్ జట్టు బరిలోకి దిగుతుంది.
ఐర్లాండ్ కూడా మూడు ఫార్మాట్లలో ఒకే కెప్టెన్‌తో ఆడుతుంది. ఆండ్రూ బల్బిర్నీ టెస్టులు, వన్డేలు, టీ20లకు ఐర్లాండ్‌కు కెప్టెన్‌గా వ్యవహరిస్తున్నాడు. అదే సమయంలో, ప్రస్తుతం జింబాబ్వే కెప్టెన్ క్రెయిగ్ ఎర్విన్ కూడా మూడు ఫార్మాట్‌లకు కూడా కెప్టెన్‌గా కొనసాగుతున్నాడు.
బంగ్లాదేశ్‌కు మూడు ఫార్మాట్లలో వేర్వేరు కెప్టెన్లు..
బంగ్లాదేశ్ జట్టు మూడు ఫార్మాట్లలో వేర్వేరు కెప్టెన్లను కలిగి ఉంది. మొమినుల్ హక్ టెస్టుల్లో జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరిస్తున్నాడు. అదే సమయంలో, తమీమ్ ఇక్బాల్ వన్డే జట్టును నడిపిస్తున్నాడు. మహ్మదుల్లా టీ20 క్రికెట్‌లో బంగ్లాదేశ్‌కు కెప్టెన్‌గా ఉన్నాడు.
ఆఫ్గనిస్తాన్ టీంలో మహమ్మద్ నబీ టీ20 జట్టుకు సారథిగా వ్యవహరిస్తున్నాడు. అదే సమయంలో, ఆఫ్ఘనిస్తాన్ ఆడిన చివరి టెస్ట్ మ్యాచ్‌లో అస్గర్ ఆఫ్ఘన్ కెప్టెన్‌గా ఉన్నాడు. చివరి వన్డేలోనూ అస్గర్ ఆఫ్ఘనిస్థాన్ కెప్టెన్‌గా ఉన్నాడు. అయితే, అఫ్గాన్ ఇప్పుడు క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించాడు. కొత్త కెప్టెన్‌గా ఎవరిని ఎన్నుకుంటారో చూడాలి మరి. కొద్ది రోజుల క్రితం, అఫ్గానిస్థాన్ మూడు ఫార్మాట్లకు రషీద్ ఖాన్‌ను కెప్టెన్‌గా చేసింది. అయితే రషీద్ ఆ నిర్ణయాన్ని నిరాకరించాడు.
ఆస్ట్రేలియా, ఇంగ్లండ్..
కొత్త కెప్టెన్‌లను తయారు చేసి ప్రపంచ కప్‌ను గెలుచుకున్న జాబితాలో ఆస్ట్రేలియా, ఇంగ్లండ్ టీంలు ఉన్నాయి. వేర్వేరు కెప్టెన్‌లుగా చేసిన తర్వాతే ఈ రెండు జట్టు ప్రపంచ కప్‌ను గెలుచుకున్నాయి. ఈ ఏడాది టీ20 ప్రపంచకప్‌ను ఆస్ట్రేలియా గెలుచుకుంది. అదే సమయంలో, 2019 వన్డే ప్రపంచకప్‌ను ఇంగ్లండ్ జట్టు గెలుచుకుంది.