Video: ‘సూపర్ మ్యాన్’ పాండ్య.. కళ్లు చెదిరే క్యాచ్‌.. వీడియో చూస్తే వావ్ అనాల్సిందే..

Hardik Pandya Stunning Catch: గువహటిలోని బర్సపరా క్రికెట్ స్టేడియంలో ఆదివారం న్యూజిలాండ్‌తో జరిగిన మూడో టీ20 మ్యాచ్‌లో ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యా అద్భుతమైన క్యాచ్‌తో అందరినీ ఆకట్టుకున్నాడు. గాల్లోకి ఎగిరి క్యాచ్ పట్టేశాడు. ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ సందడి చేస్తోంది.

Video: సూపర్ మ్యాన్ పాండ్య.. కళ్లు చెదిరే క్యాచ్‌.. వీడియో చూస్తే వావ్ అనాల్సిందే..
Hardik Pandya Stunning Catch

Updated on: Jan 25, 2026 | 9:00 PM

Hardik Pandya Stunning Catch: మూడో టీ20ఐలో భారత కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ టాస్ గెలిచి ముందుగా బౌలింగ్ ఎంచుకున్నాడు. దీంతో న్యూజిలాండ్ జట్టు 9 వికెట్లు కోల్పోయి 153 పరుగుల మాత్రమే చేయగలిగింది. భారత జట్టు అన్ని విభాగాల్లో అద్భుతంగా రాణించింది. బౌలింగ్‌తోపాటు ఫీల్డింగ్‌లోనూ ఆకట్టుకున్నారు. అయితే, బౌలింగ్ ప్రారంభించిన హర్షిత్ రాణా, తొలి ఓవర్ మూడో బంతికే వికెట్ పడగొట్టాడు. మిడ్-ఆఫ్ వద్ద హార్దిక్ చూపిన అసాధారణ నైపుణ్యం కచ్చితంగా చూడాల్సిందే. కివీస్ ఓపెనర్ డెవాన్ కాన్వే క్రీజు వెలుపలికి వచ్చి హార్దిక్ తల మీదుగా బంతిని కొట్టడానికి ప్రయత్నించాడు. అయితే కాన్వే బంతిని సరిగ్గా కనెక్ట్ చేయలేకపోయాడు.

ఆ క్షణంలో బంతి హార్దిక్ మీదుగా వెళ్తుందనిపించింది. కానీ, అతను సరైన సమయంలో గాలిలోకి ఎగిరి అద్భుతమైన క్యాచ్‌ను అందుకున్నాడు. తన ఎడమ వైపునకు రెండు అడుగులు వేసి, అద్భుతమైన జంప్‌తో క్యాచ్‌ను పూర్తి చేశాడు.

టాస్ సమయంలో సూర్యకుమార్ యాదవ్ ఏమన్నాడంటే..

“మేం ముందుగా బౌలింగ్ చేయాలనుకుంటున్నాం. వికెట్ బాగుంది, తర్వాత మంచు ప్రభావం ఉండే అవకాశం ఉంది. అందుకే ఈ రాత్రి లక్ష్యాన్ని ఛేదించాలని అనుకుంటున్నాం” అని తెలిపాడు.

ఈ మ్యాచ్ కోసం భారత్ అర్ష్‌దీప్ సింగ్, వరుణ్ చక్రవర్తిలకు విశ్రాంతినిచ్చి, వారి స్థానంలో జస్‌ప్రీత్ బుమ్రా, రవి బిష్ణోయ్లను తుది జట్టులోకి తీసుకుంది.

తుది జట్లు (Playing XIs):

భారత్: సంజు శాంసన్ (కీపర్), అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్, సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), శివం దూబే, హార్దిక్ పాండ్యా, రింకూ సింగ్, హర్షిత్ రాణా, రవి బిష్ణోయ్, కుల్దీప్ యాదవ్, జస్‌ప్రీత్ బుమ్రా.

న్యూజిలాండ్: డెవాన్ కాన్వే, టిమ్ సీఫెర్ట్ (కీపర్), రచిన్ రవీంద్ర, గ్లెన్ ఫిలిప్స్, మార్క్ చాప్‌మన్, డారిల్ మిచెల్, మిచెల్ సాంట్నర్ (కెప్టెన్), కైల్ జెమీసన్, మాట్ హెన్రీ, ఇష్ సోధి, జాకబ్ డఫీ.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..