India vs Bangladesh, 1st T20I: బంగ్లాదేశ్‌తో జరిగిన తొలి టీ20లో భారత్ 7 వికెట్ల తేడాతో విజయం సాధించింది. గ్వాలియర్‌లోని మాధవరావ్ సింధియా స్టేడియంలో భారత్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. బంగ్లాదేశ్ 19.5 ఓవర్లలో 127 పరుగులు చేసింది. లక్ష్యాన్ని భారత్ 11.5 ఓవర్లలో 3 వికెట్లు మాత్రమే కోల్పోయి సాధించింది.
భారత్ తరపున అర్ష్‌దీప్ సింగ్, వరుణ్ చక్రవర్తి చెరో 3 వికెట్లు తీశారు. సంజూ శాంసన్, సూర్యకుమార్ యాదవ్ తలో 29 పరుగులు చేశారు. హార్దిక్ పాండ్యా 39 పరుగులు చేసి మ్యాచ్ ముగించాడు. తొలి టీ20లో విజయం సాధించి సిరీస్‌లో భారత్ 1-0 ఆధిక్యంలో నిలిచింది. రెండో మ్యాచ్ అక్టోబర్ 9న ఢిల్లీలో జరగనుంది.
టీమ్ ఇండియా స్టార్ ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యా తుఫాన్ ఇన్నింగ్స్ ఆడి అద్భుత సిక్సర్ కొట్టి జట్టును విజయతీరాలకు చేర్చాడు. అరంగేట్రం మ్యాచ్‌లో మయాంక్ యాదవ్, నితీష్ కుమార్ రెడ్డి ఆకట్టుకోగా, 3 ఏళ్ల తర్వాత జట్టులోకి వచ్చిన స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి కూడా విధ్వంసం సృష్టించడంతో భారత్ కేవలం 49 బంతులు మిగిలి ఉండగానే విజయం సాధించింది.
రెండు జట్ల ప్లేయింగ్-11..
1ST T20I. India Won by 7 Wicket(s) https://t.co/NGydh3Sqlr #INDvBAN @IDFCFIRSTBank
— BCCI (@BCCI) October 6, 2024
భారత్: సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), అభిషేక్ శర్మ, సంజు శాంసన్ (వికెట్ కీపర్), రియాన్ పరాగ్, నితీష్ కుమార్ రెడ్డి, హార్దిక్ పాండ్యా, రింకూ సింగ్, వాషింగ్టన్ సుందర్, వరుణ్ చక్రవర్తి, అర్ష్‌దీప్ సింగ్, మయాంక్ యాదవ్.
బంగ్లాదేశ్: నజ్ముల్ హొస్సేన్ శాంటో (కెప్టెన్), పర్వేజ్ హసన్ ఎమోన్, లిటన్ దాస్ (వికెట్ కీపర్), జాకర్ అలీ, తౌహిద్ హృదయ్, మహ్మదుల్లా, మెహదీ హసన్ మిరాజ్, రిషద్ హొస్సేన్, మస్తాఫిజుర్ రెహమాన్, తస్కిన్ అహ్మద్, షోరీఫుల్ ఇస్లాం.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..