టీ20 ప్రపంచకప్‌లో భాగంగా జరిగిన తొలి వార్మప్ మ్యాచ్‌లో టీమిండియా 6 పరుగుల తేడాతో ఆస్ట్రేలియాను ఓడించింది. చివరి ఓవర్‌లో విజయానికి 11 పరుగులు అవసరం కాగా, మహమ్మద్ షమీ 3 వికెట్లు తీసి భారత్‌కు విజయాన్ని అందించాడు. మొత్తంగా చివరి ఓవర్లో జరిగిన హైడ్రామాలో ఆస్ట్రేలియా టీం వరుసగా నాలుగు వికెట్లు కోల్పోయి చతికిల పడింది. టీమిండియా అటు బౌలింగ్, ఇటు బ్యాటింగ్ లోనూ రాణించి, తొలి వార్మప్ మ్యాచ్ ను చక్కగా వినియోగించుకుంది.
ఉత్కంఠగా సాగిన ఈ మ్యాచ్ లో టీమిండియా ఆఖరి బంతికి విజయం సాధించింది. మొత్తంగా రోహిత్ సేన ఈ మ్యాచ్ లో అన్ని రంగాల్లో ఆధిపత్యం చూపించి, 6 పరుగుల తేడాతో విజయం సాధించింది. టాస్ గెలిచిన ఆస్ట్రేలియా కెప్టెన్ ఆరోన్ ఫించ్ ముందుగా బౌలింగ్ ఎంచుకున్నాడు. తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 187 పరుగులు చేసింది. టీమ్ ఇండియా తరపున అత్యధిక పరుగులు చేసిన ఆటగాడు కేఎల్ రాహుల్ నిలిచాడు. 33 బంతుల్లో 57 పరుగులు చేసి ఇన్నింగ్స్ ఆడాడు. అదే సమయంలో సూర్యకుమార్ యాదవ్ 33 బంతుల్లో 51 పరుగులతో ఇన్నింగ్స్ ఆడాడు. అతని స్ట్రైక్ రేట్ 151.51గా నిలిచింది. ఆస్ట్రేలియా తరపున కేన్ రిచర్డ్‌సన్ 4 వికెట్లు పడగొట్టాడు.
What A Win! ? ?#TeamIndia beat Australia by 6⃣ runs in the warm-up game! ? ?
Scorecard ▶️ https://t.co/3dEaIjgRPS #T20WorldCup | #INDvAUS pic.twitter.com/yqohLzZuf2
— BCCI (@BCCI) October 17, 2022
అనంతరం బ్యాటింగ్‌కు దిగిన ఆస్ట్రేలియా 20 ఓవర్లలో 180 పరుగులకు ఆలౌట్ అయింది. ఉత్కంఠగా సాగిన చివరి ఓవర్ లో భారీ డ్రామా జరిగింది. 6 బంతుల్లో 11 పరుగులు కావాల్సి ఉండగా.. రోహిత్ శర్మ కీలక నిర్ణయం తీసుకున్నాడు. మహ్మద్ షమీని రంగంలోకి దింపాడు. చాలా కాలం తర్వాత షమీ బౌలింగ్ వేస్తుండడంతో అంచనాలు అందుకుంటాడా లేదా అనే అనుమానం కలిగింది. కానీ, విమర్శకులను సైతం మొప్పించేలా తన బౌలింగ్ తో ఆకట్టుకున్నాడు. చివరి ఓవర్లో మూడు వికెట్లు పడగొట్టి, రీ ఎంట్రీకి ఘనమైన పునరాగమనం చేశాడు.