
India Women vs Pakistan Women, Women’s T20 World Cup 2026 Highlights Updates: మహిళల టీ20 ప్రపంచకప్‌లో భారత్ పాకిస్థాన్‌ను 64 పరుగుల తేడాతో ఓడించింది. ఎడ్జ్‌బాస్టన్‌లో జరిగిన ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన భారత్ బ్యాటింగ్ ఎంచుకుని, తమ 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 170 పరుగులు చేసింది.
భారత్ తరఫున స్మృతి మంధాన అర్ధ సెంచరీ సాధించింది. ఆమె 44 బంతుల్లో 9 ఫోర్లు, 2 సిక్సర్లతో 68 పరుగులు చేసింది. కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ 36 పరుగులు చేసింది. రిచా ఘోష్ 17 బంతుల్లో 34 పరుగులు చేసింది. పాకిస్థాన్ తరఫున, సాదియా ఇక్బాల్ మరియు ఫాతిమా సనా చెరో 2 వికెట్లు తీయగా, తస్మియా రుబాబ్ మరియు రమీన్ షమీమ్ చెరో 1 వికెట్ తీసుకున్నారు.
171 పరుగుల లక్ష్య ఛేదనలో పాకిస్థాన్ 17 ఓవర్లలో 106 పరుగులకే ఆలౌట్ అయింది. మునీబా అలీ 41 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచింది. భారత్ తరఫున దీప్తి శర్మ 10 పరుగులకు 5 వికెట్లు పడగొట్టింది.
భారత మహిళలు ప్లేయింగ్ XI: స్మృతి మంధాన, షఫాలీ వర్మ, జెమీమా రోడ్రిగ్స్, హర్మన్‌ప్రీత్ కౌర్ (కెప్టెన్), భారతీ ఫుల్మాలి, రిచా ఘోష్ (కీపర్), దీప్తి శర్మ, అరుంధతి రెడ్డి, శ్రేయాంక పాటిల్, శ్రీ చరణి, క్రాంతి గౌడ్.
పాకిస్థాన్ మహిళలు ప్లేయింగ్ XI: గుల్ ఫిరోజా, మునీబా అలీ(కీపర్), అయేషా జాఫర్, సైరా జబీన్, అలియా రియాజ్, నటాలియా పర్వైజ్, ఫాతిమా సనా(కెప్టెన్), రమీన్ షమీమ్, నష్రా సంధు, తస్మియా రుబాబ్, సాదియా ఇక్బాల్.
మహిళల టీ20 ప్రపంచకప్‌లో భారత్ పాకిస్థాన్‌ను 64 పరుగుల తేడాతో ఓడించింది. ఎడ్జ్‌బాస్టన్‌లో జరిగిన ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన భారత్ బ్యాటింగ్ ఎంచుకుని, తమ 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 170 పరుగులు చేసింది.
భారత్ తరఫున స్మృతి మంధాన అర్ధ సెంచరీ సాధించింది. ఆమె 44 బంతుల్లో 9 ఫోర్లు, 2 సిక్సర్లతో 68 పరుగులు చేసింది. కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ 36 పరుగులు చేసింది. రిచా ఘోష్ 17 బంతుల్లో 34 పరుగులు చేసింది. పాకిస్థాన్ తరఫున, సాదియా ఇక్బాల్ మరియు ఫాతిమా సనా చెరో 2 వికెట్లు తీయగా, తస్మియా రుబాబ్ మరియు రమీన్ షమీమ్ చెరో 1 వికెట్ తీసుకున్నారు.
171 పరుగుల లక్ష్య ఛేదనలో పాకిస్థాన్ 17 ఓవర్లలో 106 పరుగులకే ఆలౌట్ అయింది. మునీబా అలీ 41 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచింది. భారత్ తరఫున దీప్తి శర్మ 10 పరుగులకు 5 వికెట్లు పడగొట్టింది.
10 ఓవర్లు ముోగిసే సరికి పాక్ జట్టు 3 వికెట్లు కోల్పోయి 72 పరుగులు చేసింది.
పాకిస్తాన్ పవర్ ప్లే ముగిసన వెంటనే 2వ వికెట్ కోల్పోయింది. దీప్తి తన రెండో 2వ వికెట్ తీసుకుని పాక్ జట్టు పాలిట విలన్‌లా మరింది
పవర్ ప్లే ముగిసే సరికి పాక్ జట్టు 1 వికెట్ కోల్పయి 52 పరుగులు చేసింది.
3 ఓవర్లు ముగిసే సరికి పాకిస్తాన్ జట్టు వికెట్ నష్టపోకుండా 25 పరుగులు చేసింది.
నిర్ణీత 20 ఓవర్లు ముగిసేసరికి భారత జట్టు 6 వికెట్ల నష్టానికి 170 పరుగుల భారీ స్కోరు సాధించింది.
రిచా ఘోష్ హ్యాట్రిక్ బౌండరీలతో భారత జట్టు 19వ ఓవర్‌లో ఏకంగా 23 పరుగులు రాబట్టింది. ఇందులో 4ఫోర్లు, 1 సిక్స్ ఉన్నాయి.
16 ఓవర్లు ముగిసే సరికి భారత జట్టు 4 వికెట్లు కోల్పోయి 122 పరుగులు చేసింది. కౌర్ 36, రిచా 7 పరుగులతో నిలిచింది.
మంధాన 68 పరుగులు చేసిన తర్వాత పెవిలియన్ చేరింది. దీంతో భారత్ 14 ఓవర్లు ముగిసే సరికి 3 వికెట్లు కోల్పోయి 109 పరుగులు చూసింది.
13 ఓవర్లు ముగిసే సరికి భారత జట్టు 100 పరుగులు దాటింది.
8 ఓవర్లు ముగిసే సరికి భారత జట్టు 2 వికెట్లు కోల్పోయి 46 పరుగులు చేసింది. క్రీజులో మంథాన 28, కౌర్ 9 పరుగులతో నిలిచారు.
ఓవైపు వికెట్లు పడుతున్నా మంథాన మాత్రం దూకుడు తగ్గడం లేదు. పాక్ బౌలర్లను సమర్థవంతంగా ఎదుర్కొంటూ పరుగులు సాధిస్తోంది. ఈ క్రమంలో ఆమె ఇప్పటి వరకు 17 బంతులు ఎదుర్కొని 4 ఫోర్లతో 21 పరుగులు సాధించింది.
టాస్ గెలిచిన భారత జట్టుకు ఏమాత్రం కలిసి రావడం లేదు. 4వ ఓవర్ రెండో బంతికే జెమియా(1) పెవిలియన్ చేరింది. దీంతో 4 ఓవర్లు ముగిసే సరికి భారత జట్టు 2 వికెట్లు కోల్పోయి 20 పరుగులు చేసింది.
సిక్స్ కొట్టి మంచి ఊపుమీద కనిపించిన షెఫాలీ వర్మ ఆ వెంటనే పెవిలియన్ చేరింది. దీంతో భారత్ తొలి ఓవర్ ముగిసే సరికి 7 పరుగులు చేసి ఒక వికెట్ కోల్పోయింది.
స్మృతి మంధాన, షఫాలీ వర్మ, జెమీమా రోడ్రిగ్స్, హర్మన్‌ప్రీత్ కౌర్ (కెప్టెన్), భారతీ ఫుల్మాలి, రిచా ఘోష్ (కీపర్), దీప్తి శర్మ, అరుంధతి రెడ్డి, శ్రేయాంక పాటిల్, శ్రీ చరణి, క్రాంతి గౌడ్.
పాకిస్థాన్ మహిళలు ప్లేయింగ్ XI: గుల్ ఫిరోజా, మునీబా అలీ(కీపర్), అయేషా జాఫర్, సైరా జబీన్, అలియా రియాజ్, నటాలియా పర్వైజ్, ఫాతిమా సనా(కెప్టెన్), రమీన్ షమీమ్, నష్రా సంధు, తస్మియా రుబాబ్, సాదియా ఇక్బాల్.
మహిళల టీ20 ప్రపంచ కప్ మ్యాచ్ భారత్, పాకిస్తాన్ జట్ల మధ్య ఎడ్జ్‌బాస్టన్ స్టేడియంలో జరుగుతోంది. భారత్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. టాస్ సమయంలో ఇరు జట్ల కెప్టెన్లు కరచాలనం చేసుకోలేదు.
21,000 మంది ప్రేక్షకులు పట్టే ఎడ్జ్‌బాస్టన్ స్టేడియంలోని పిచ్ బ్యాట్స్‌మెన్‌లకు, బౌలర్లకు ఇద్దరికీ అనుకూలంగా ఉంటుంది. కొత్త బంతి ఫాస్ట్ బౌలర్లకు స్వింగ్‌ను అందిస్తుండగా, మ్యాచ్ సాగేకొద్దీ స్పిన్నర్ల పాత్ర పెరుగుతుంది. ఈ మైదానంలో మహిళల టీ20 అంతర్జాతీయ మ్యాచ్‌లలో మొదటి ఇన్నింగ్స్ సగటు స్కోరు 145. 150కి పైబడిన స్కోర్లను సవాలుగా పరిగణిస్తారు. ఇక్కడ మొదట బ్యాటింగ్ చేసిన జట్టు 10 మ్యాచ్‌లు గెలవగా, ఛేజింగ్ చేసిన జట్టు 9 మ్యాచ్‌లు గెలిచింది.
ఆదివారం బర్మింగ్‌హామ్‌లో క్రికెట్‌కు వాతావరణం అనుకూలంగా ఉండే అవకాశం ఉంది. ఉష్ణోగ్రతలు 10 నుంచి 19 డిగ్రీల సెల్సియస్ మధ్య ఉంటాయి. 20 శాతం వర్షం పడే అవకాశం ఉంది. అయితే, తొలి ఓవర్లలో మేఘాలు, గాలి ఫాస్ట్ బౌలర్లకు స్వింగ్‌ను అందించవచ్చు.
భారత జట్టుకు అతిపెద్ద బలం టాప్ ఆర్డర్. జనవరి 1, 2025 నుంచి షెఫాలీ వర్మ భారతదేశం తరపున అత్యంత విజయవంతమైన బ్యాటర్‌గా కొనసాగుతోంది. ఆమె 21 మ్యాచ్‌లలో ఆరు అర్ధ సెంచరీలతో సహా 677 పరుగులు చేసింది. ఆమె స్ట్రైక్ రేట్ 159.29గా ఉంది. స్మృతి మంధాన 18 మ్యాచ్‌లలో ఒక సెంచరీ, మూడు అర్ధ సెంచరీలతో సహా 572 పరుగులు చేసింది.
శనివారం ప్రాక్టీస్ సమయంలో పాకిస్థాన్ కెప్టెన్ ఫాతిమా సనా గాయపడింది. ఆమె సహచర క్రీడాకారిణి అయేషా జాఫర్ కొట్టిన షాట్ ఆమె కుడి మోకాలికి తగిలింది. ఈ గాయం కారణంగా ఆమె ప్రాక్టీస్ చేయలేకపోయింది. మ్యాచ్ ఆడే అవకాశం కూడా తక్కువగా ఉంది.
మహిళల టీ20 ప్రపంచకప్‌లో భారత్, పాకిస్తాన్‌ల మధ్య జరిగే మ్యాచ్ ఈరోజు సాయంత్రం 7 గంటలకు ఎడ్జ్‌బాస్టన్ స్టేడియంలో ప్రారంభమవుతుంది. ఈ టోర్నమెంట్‌లో ఈ రెండు జట్ల మధ్య ఇదే తొలి మ్యాచ్. గత టీ20 ప్రపంచకప్‌లో భారత్ సెమీఫైనల్స్‌కు చేరుకోగా, పాకిస్తాన్ గ్రూప్ దశలోనే నిష్క్రమించింది.