ప్రపంచకప్ తొలి మ్యాచ్‌లో భారత మహిళల జట్టు పాకిస్థాన్‌పై 107 పరుగుల తేడాతో విజయం సాధించింది. 245 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్ ఆరంభించిన పాకిస్తాన్ కేవలం 43 ఓవర్లలో 137 పరుగులు మాత్రమే చేసి పరాజయం పాలైంది. సిద్రా అమిన్ (30) టాప్ స్కోరర్. భారత్ తరఫున రాజేశ్వరి గైక్వాడ్ 4 వికెట్లు పడగొట్టింది.
అంతకుముందు టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా 7 వికెట్ల నష్టానికి 244 పరుగులు చేసింది. జట్టు తరపున స్నేహ రాణా, పూజా వస్త్రాకర్ అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడారు. పూజ 59 బంతుల్లో 67 పరుగులు చేసింది. అదే సమయంలో స్నేహ బ్యాటింగ్‌లో 53 పరుగులు వచ్చాయి. స్మృతి మంధాన కూడా 52 పరుగులు చేసింది.
పాకిస్థాన్ ప్లేయింగ్ XI: జవేరియా ఖాన్, సిద్రా అమీన్, బిస్మా మరూఫ్ (కెప్టెన్), ఒమానియా సోహైల్, నిదా దార్, అలియా రియాజ్, ఫాతిమా సనా, సిద్రా నవాజ్, డయానా బేగ్, నష్రా సంధు, అనమ్ అమీన్
ఇండియా ప్లేయింగ్ XI: స్మృతి మంధాన, షెఫాలీ వర్మ, దీప్తి శర్మ, హర్మన్‌ప్రీత్ కౌర్, మిథాలీ రాజ్ (కెప్టెన్), రిచా ఘోష్, స్నేహ రాణా, ఝులన్ గోస్వామి, మేఘనా సింగ్, పూజా వస్త్రాకర్, రాజేశ్వరి గైక్వాడ్.
వన్డే క్రికెట్‌లో భారత్, పాకిస్థాన్ మహిళల జట్లు ఇప్పటి వరకు 10 సార్లు తలపడ్డాయి. మిథాలీ రాజ్ సారథ్యంలో భారత్ ఈ 10 మ్యాచ్‌ల్లో 9 విజయాలు సాధించింది.
మహిళల ప్రపంచకప్‌లోని పిచ్‌పై భారత్, పాకిస్థాన్‌లు మూడు సార్లు తలపడగా, మూడింటిలోనూ భారత్ విజయం సాధించింది.
2022 ప్రపంచకప్‌లో భారత మహిళల జట్టు పాకిస్థాన్‌తో జరిగిన తొలి మ్యాచులో ఘన విజయం సాధించింది. టీమిండియా నిర్ణీత 50 ఓవర్లలో 244 పరుగులు చేసి పాక్ ముందు 245 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన పాక్ కేవలం 43 ఓవర్లలో 137 పరుగులకు ఆలౌట్ అయింది. దీంతో ఈ మ్యాచ్‌లో టీమిండియా 107 పరుగుల తేడాతో విజయం సాధించి, ప్రపంచ కప్‌లో తొలి అడుగును ఘనంగా వేసింది.
పాకిస్తాన్ టీం ఓటమి దిశగా సాగుతోంది. ఇప్పటికే 9 వికెట్లు పడిపోవడంతో పాక్ పరాజయం ఖాయమైంది. అయితే ఎంత తేడాతో ఓడిపోనుందో చూడాలి. దైనా 19, ఆనం అమిన్ 5 పరుగులతో బ్యాటింగ్ చేస్తున్నారు. టీమిండియా విజయం సాధించాలంటే మరో వికెట్ తీయాల్సి ఉండగా, పాక్ 52 బంతుల్లో 113 పరుగులు చేయాల్సి ఉంది.
పాకిస్తాన్ టీంను కష్టాలు వదలడం లేదు. వరుసగా వికెట్లు కోల్పోతూ ఓటమి దిశగా పయణిస్తోంది. గైక్వాడ్ బౌలింగ్‌లో ఫాతిమా(17) పెవిలియన్ చేరింది. దీంతో ఏడో వికెట్‌ను పాక్ కోల్పోయింది. పాక్ ప్రస్తుతం 34 ఓవర్లకు 7 వికట్లు కోల్పోయి 103 పరుగులు చేసింది. విజయం సాధించాలంటే 96 బంతుల్లో 141 పరుగులు చేయాల్సి ఉంది.
భారత ఉమెన్స్ సీనియర్ బౌలర్ ఝలన్ గోస్వామి పాకిస్తాన్ మ్యాచులో సత్తా చాటుతోంది. రెండు వికెట్లు పడగొట్టి పాక్‌ను పీకల్లోతూ కష్టాల్లోకి నెట్టింది. ఇదే క్రమంలో ప్రపంచకప్‌లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా రికార్డు సాధించేందుకు సిద్ధమైది. మరో రెండు వికెట్లు తీస్తే గోస్వామి(38) ఈ లిస్టులో తొలి స్థానంలో నిలవనుంది.
పాకిస్తాన్ టీం ఆది నుంచి పరుగులు సాధించడంలో ఇబ్బందులు పడుతోంది. దీనికి తోడు వరుసగా వికెట్లు కూడా కోల్పోతూ మరింత కష్టాల్లోకి కూరుకపోతోంది. బిస్మా మరూఫ్(15), ఒమైమా సోహైల్(5), సిద్రా అమీన్ (30) వెంటవెంటనే పెవిలియన్ చేరారు. ప్రస్తుతం పాకిస్తాన్ టీం 21.2 ఓవర్లకు 4 వికెట్లు కోల్పోయి 67 పరుగులు చేసింది. భారత బౌలర్లలో ఝలన్ గోస్వామి, రాజేశ్వరి గైక్వాడ్, దీప్తి శర్మ, స్నేహ రాణా తలో వికెట్ పడగొట్టారు.
రాజేశ్వరి గైక్వాడ్ బౌలింగ్‌లో జవేరియా ఖాన్(11) పెవిలియన్ చేరింది. దీంతో భారత్ తొలి వికెట్‌ను సాధించింది. ప్రస్తుతం పాకిస్తాన్ 12 ఓవర్లకు ఒక వికెట్ నష్టపోయి 33 పరుగులు చేసింది.
ఉమెన్స్ ప్రపంచ కప్ 2022లో టీమిండియా తన తొలి మ్యాచులో అద్భుతంగా పునరాగమనం చేసి ఆకట్టుకుంది. ఓ దశలో 100 పరుగులకే సగంపైగా వికెట్లు కోల్పోయిన దశలో పుజా, స్నేహ్ రాణా అద్భుతం హాఫ్ సెంచరీలతో భారత్‌ను పటిష్ట స్థితికి చేర్చారు. నిర్ణీత 50 ఓవర్లలో భారత్ 7 వికెట్లు కోల్పోయి 244 పరుగులు సాధించింది. దీంతో పాకిస్తాన్ మందు 245 పరుగుల టార్గెన్‌ను ఉంచింది.
పూజా వస్త్రాకర్, స్నేహ్ రాణా కీలక భాగస్వామ్యంతో టీమిండియాకు పోరాడు స్కోర్‌ను అందించారు. 100 పరుగుల భాగస్వామ్యంతో భారత స్కోర్‌ను 200 దాటించారు. ఈ క్రమంలో పూజా 47 బంతుల్లోనే ప్రపంచకప్‌లో తొలి హాఫ్ సెంచరీ నమోదు చేసింది.
డయానా బేగ్ 41వ ఓవర్ వేసింది. ఆ ఓవర్ తొలి బంతికి స్నేహ రాణా ఫోర్ బాదింది. దీంతో వీరిద్దరి మధ్య హాఫ్ సెంచరీ భాగస్వామ్యం పూర్తయింది. ఈ సమయంలో భారత్‌కు ఇలాంటి కీలక భాగస్వామ్యం అవసరం. వీరిద్దరు కలిసి టీమిండియాను పోరాడే స్కోర్‌కు చేర్చేందుకు తమవంతు ప్రయత్నం చేస్తున్నారు. 42 ఓవర్ల తర్వాత భారత్ స్కోరు – 185/6
34వ ఓవర్లో నషారా సంధు.. మిథాలీ రాజ్‌ను అవుట్ చేసింది. పాయింట్ దిశగా షాట్ ఆడిన మిథాలీ, డయానా బాగ్‌కి క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరింది. 36 బంతుల్లో 9 పరుగులు మాత్రమే చేసిన మిథాలీ.. తీవ్రంగా నిరాశపరిచింది.
భారత్ వరుసగా వికెట్లు కోల్పోతూ పీకల్లోతూ కష్టాల్లోకి చేరుకుంటోంది. రిచా ఘోష్(1) ఐదో వికెట్‌గా పెవిలియన్ చేరింది. దీంతో భారతమంతా సారథి మిథాలీరాజ్ పైనే నిలిచింది.
భారత్ వరుసగా వికెట్లు కోల్పోతూ ఒత్తిడిలో కూరుకపోతోంది. హర్మన్‌ప్రీత్ కౌర్(4) నాలుగో వికెట్‌గా పెవిలియన్ చేరడంతో భారతమంతా సారథి మిథాలీరాజ్ పైనే నిలిచింది.
దీప్తి శర్మ తర్వాత స్మృతి మంధాన కూడా పెవిలియన్ చేరింది. స్మృతి డ్రైవ్ చేయడానికి ప్రయత్నించి, అనమ్ అమీన్ చేతికి చిక్కింది. మంధాన 75 బంతుల్లో 52 పరుగులు చేసింది. ఆమె ఇన్నింగ్స్‌లో ఒక సిక్స్, మూడు ఫోర్లు ఉన్నాయి.
మంధాన(50) కీలక ఇన్నింగ్స్‌తో ఆకట్టుకుంటోంది. తొలి వికెట్ కోల్పోయిన తరువాత దీప్తి శర్మతో కలిసి కీలక భాగస్వామ్యాన్ని అందించిన మంధాన.. 71 బంతుల్లో 50 పరుగులు సాధించింది. పాక్ బౌలర్లను సమర్ధంగా ఎదుర్కొంటూ ముందుకు సాగుతోంది.
టీమిండియా కీలక భాగస్వామ్యానికి పాక్ బౌలర్లు బ్రేక్ చేశారు. దీప్తి శర్మ(40)ను బౌల్డ్ చేయడంలో 96 పరుగుల వద్ద భారత్ రెండో వికెట్‌ను కోల్పోయింది.
20 ఓవర్లు ముగిసే సరికి భారత్ ఒక వికెట్ నష్టానికి 87 పరుగులు చేసింది. మంధాన 47, దీప్తి 34 పరుగులతో క్రీజులో ఉన్నారు.
16 ఓవర్లకు భారత్ ఒక వికెట్ నష్టానికి 65 పరుగులు చేసింది. మంధాన 54 బంతుల్లో 37 పరుగులు చేయగా, దీప్తి శర్మ 38 బంతుల్లో 22 పరుగులు చేసింది.
12 ఓవర్లు ముగిసే సరికి భారత స్కోర్ 50 పరుగులు దాటింది. మంధాన 30, దీప్తి 15 పరుగులతో క్రీజులో ఉన్నారు. పాక్ బౌలర్లలో దైనా ఓ వికెట్ దక్కించుకుంది.
తొలి వికెట్ కోల్పోయిన తరువాత టీమిండియా ఆచితూచి ఆడుతోంది.. దీప్తి శర్మ, స్మృతి మంధాన భారత ఇన్నింగ్స్‌ను గాడిన పెట్టే పనిలో పడ్డారు. 10 ఓవర్లు ముగిసే సరికి 1 వికెట్ కోల్పోయి 33 పరుగులు చేశారు.
ఈ మ్యాచ్‌లో భారత్, పాకిస్థాన్‌లు 5గురు బౌలర్లతో బరిలోకి దిగుతున్నాయి. రెండు జట్ల ప్లేయింగ్ ఎలెవన్ కూడా సమానంగానే ఉంది.
పాకిస్థాన్ ప్లేయింగ్ XI: జవేరియా ఖాన్, సిద్రా అమీన్, బిస్మా మరూఫ్ (కెప్టెన్), ఒమానియా సోహైల్, నిదా దార్, అలియా రియాజ్, ఫాతిమా సనా, సిద్రా నవాజ్, డయానా బేగ్, నష్రా సంధు, అనమ్ అమీన్
ఇండియా ప్లేయింగ్ XI: స్మృతి మంధాన, షెఫాలీ వర్మ, దీప్తి శర్మ, హర్మన్‌ప్రీత్ కౌర్, మిథాలీ రాజ్ (కెప్టెన్), రిచా ఘోష్, స్నేహ రాణా, ఝులన్ గోస్వామి, మేఘనా సింగ్, పూజా వస్త్రాకర్, రాజేశ్వరి గైక్వాడ్.
టాస్ గెలిచిన భారత కెప్టెన్ మిథాలీ రాజ్ ముందుగా బ్యాటింగ్ ఎంచుకుంది. అంటే పాక్ జట్టు ముందుగా బౌలింగ్ చేయనుంది. అయితే, టాస్ ఓడిపోయిన తర్వాత, పాక్ కెప్టెన్ తాను కూడా మొదట బ్యాటింగ్ చేయాలనుకుంటున్నట్లు అంగీకరించింది. 5గురు బౌలర్లతో ఈ మ్యాచ్‌లో ఇరు జట్లు బరిలోకి దిగాయి.