
Fastest Team Fifty in Womens T20 WC: ఐసీసీ ఉమెన్స్ టి20 వరల్డ్ కప్ 2026 (ICC Women’s T20 World Cup 2026) గ్రూప్-A మ్యాచ్‌లో భారత మహిళల జట్టు సరికొత్త చరిత్ర సృష్టించింది. లీడ్స్‌లోని హెడింగ్లే వేదికగా నెదర్లాండ్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో భారత ఓపెనర్లు స్మృతి మంధాన, షఫాలీ వర్మ ఆకాశమే హద్దుగా చెలరేగిపోయారు. కేవలం 5.1 ఓవర్లలోనే జట్టు స్కోరును 50 పరుగుల మార్కు దాటించి, ఉమెన్స్ టీ20 ప్రపంచకప్‌లో భారత్ తరఫున జాయింట్-ఫాస్టెస్ట్ టీమ్ ఫిఫ్టీ (joint-fastest team fifty) రికార్డును సమం చేశారు.
టాస్ గెలిచిన నెదర్లాండ్స్ జట్టు మొదట ఫీల్డింగ్ ఎంచుకుని బహుశా పెద్ద తప్పే చేసింది. టీమిండియా ఓపెనర్లు స్మృతి మంధాన (Smriti Mandhana), షఫాలీ వర్మ (Shafali Verma) తొలి ఓవర్ నుంచే డచ్ బౌలర్లపై ఎదురుదాడికి దిగారు. మైదానం నలుమూలలా బౌండరీల వర్షం కురిపిస్తూ స్కోరు బోర్డును పరుగులు పెట్టించారు.
ఐరిస్ జ్విల్లింగ్, ఇసాబెల్ వోనింగ్ వేసిన ఓవర్లలో షఫాలీ, స్మృతి వరుస ఫోర్లతో స్టేడియాన్ని హోరెత్తించారు. ముఖ్యంగా 5వ ఓవర్ ముగిసేసరికి భారత్ వికెట్ నష్టపోకుండా 48 పరుగులు చేయగా, 6వ ఓవర్ మొదటి బంతికే ఈ జోడి జట్టు హాఫ్ సెంచరీని పూర్తి చేసింది.
A start filled with sublime shotmaking 👌
5️⃣0️⃣ partnership up between Vice-captain Smriti Mandhana and Shafali Verma 👏
Updates ▶️ https://t.co/FMkrKB1zcS#TeamIndia | #T20WorldCup | #WomenInBlue | #INDvNED | @mandhana_smriti | @TheShafaliVerma pic.twitter.com/ft9CxwOCfq
— BCCI Women (@BCCIWomen) June 17, 2026
కేవలం 5.1 ఓవర్లలోనే భారత్ 50 పరుగుల మార్కును అందుకోవడం విశేషం. ఉమెన్స్ టి20 వరల్డ్ కప్ చరిత్రలో భారత్‌కు ఇదే అత్యంత వేగవంతమైన ఫాస్టెస్ట్ టీమ్ హాఫ్ సెంచరీ. గతంలో 2020 ఎడిషన్‌లో పెర్త్ వేదికగా బంగ్లాదేశ్‌పై టీమిండియా సరిగ్గా 5.1 ఓవర్లలోనే ఈ మైలురాయిని అందుకుంది. ఇప్పుడు మళ్లీ 2026 ప్రపంచకప్‌లో నెదర్లాండ్స్‌పై అదే మ్యాజిక్‌ను రిపీట్ చేస్తూ ఆ రికార్డును సమం చేసింది.
ప్రస్తుతం భారత్ 5.4 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా 57 పరుగులు చేసింది. క్రీజులో షఫాలీ వర్మ 15 బంతుల్లో 5 ఫోర్లతో 25 పరుగులు, స్మృతి మంధాన 19 బంతుల్లో 4 ఫోర్లతో 23 పరుగులతో ఆడుతున్నారు. డచ్ బౌలర్ మిర్తే వాన్ డెన్ రాడ్ ఒత్తిడిలో వరుసగా వైడ్లు వేస్తూ భారత స్కోరుకు అదనపు పరుగులు ఇస్తోంది. తొలి మ్యాచ్‌లో పాకిస్తాన్‌ను చిత్తు చేసిన భారత్, అదే జోష్‌ను ఈ మ్యాచ్‌లోనూ కొనసాగిస్తూ భారీ స్కోరు వైపు దూసుకెళ్తోంది.
భారత ఓపెనర్ల అటాకింగ్ గేమ్ చూస్తుంటే నెదర్లాండ్స్‌కు ఈ మ్యాచ్‌లో భారీ లక్ష్యం తప్పేలా లేదు. పవర్‌ప్లేలోనే ప్రత్యర్థిని మానసికంగా దెబ్బతీసిన టీమిండియా, ఈ గ్రూప్-A మ్యాచ్‌లో భారీ విజయాన్ని అందుకొని నెట్ రన్ రేట్‌ను మరింత మెరుగుపరుచుకోవాలని చూస్తోంది. ఇదే ఫామ్ కొనసాగితే భారత్‌కు ఈ టోర్నీలో తిరుగుండదనే చెప్పాలి.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..