Ind vs Pak: విన్నర్‌గా మన బహుమతి ఆర్మీకి.. పాక్‌ రన్నరప్‌ మనీ టెర్రరిస్టులకు..!

'ఆడేటప్పుడు, ఆట తరువాత... ఎంతైనా రెచ్చిపోండి, నేను చూసుకుంటా'.. ఫైనల్ మ్యాచ్‌కు ముందు పాకిస్తాన్‌ క్రికెట్ బోర్డ్‌ ఛైర్మన్ నఖ్వీ పాక్‌ ఆటగాళ్లకు నూరిపోసిన విద్వేషం ఇది. టీమిండియాపై 'ఎలాంటి ఫైట్‌ అయినా చేయండి.. నేను మేనేజ్‌ చేస్తా' అంటూ ఆటకు ముందు పాక్‌ క్రికెటర్లను రెచ్చగొట్టాడు. ఒకవేళ మ్యాచ్‌ గనక అటుఇటు అయుంటే పాకిస్తాన్‌ వేషాలు ఏ రేంజ్‌లో ఉండేవో. ఎంత అతి చేసే వాళ్లో. ఆ ఛాన్స్ మనోళ్లు ఇస్తేగా అసలు. టీమిండియా దగ్గర అలాంటి డైలాగ్స్‌ లేవ్. ఓన్లీ యాక్షన్స్. షేక్‌ హ్యాండ్ ఇవ్వకపోవడం నుంచి ట్రోఫీ లేకుండానే సెలబ్రేట్‌ చేసుకునే దాకా అంతా జెంటిల్‌మెన్‌ గేమ్‌. చిల్లర చేష్టలతో పరువు పోగొట్టుకున్నది పాకిస్తానే. ఆపరేషన్‌ సింధూర్‌ విక్టరీని గ్రౌండ్‌లో సింబాలిక్‌గా చూపిస్తూ చేసిన విన్యాసాలు... పాక్‌కు ఉక్కపోత 'పోయించింది'. అసలు.. ఆ విన్నింగ్‌ షాట్‌ చూశాక పాకిస్తాన్‌కు సౌండ్‌ లేదు. విన్నింగ్‌ షాట్‌ దుబాయ్‌లో కొడితే... మోత ఇస్లామాబాద్‌లో మోగింది. బహుశా ఇలాంటి మ్యాచ్‌ క్రికెట్‌ చరిత్రలోనే చూడలేదేమో. ఎన్నో సిరీస్‌లు జరిగాయ్, ఇకపై ఎన్నో జరుగుతాయ్.. బట్ ఈ ఆసియా కప్‌ మాత్రం సమ్‌థింగ్‌ స్పెషల్. పర్టిక్యులర్‌గా చెప్పుకోవాల్సిన ఇన్సిడెంట్స్‌ చాలా ఉన్నాయ్.

Ind vs Pak: విన్నర్‌గా మన బహుమతి ఆర్మీకి..  పాక్‌ రన్నరప్‌ మనీ టెర్రరిస్టులకు..!
India Wins Asia Cup

Updated on: Sep 29, 2025 | 9:59 PM

దుబాయ్‌ గ్రౌండ్‌లో జరిగింది ఆట కాదు.. ఒక యుద్ధం. ఆపరేషన్‌ సింధూర్‌కు కొనసాగింపు.. క్రికెట్‌ గ్రౌండ్‌లో గానీ జరుగుతోందా అన్నంతగా హీట్‌ పుట్టించింది ఫైనల్‌ మ్యాచ్‌. ‘ఆరు జెట్ ఫ్లైట్స్‌’ కూల్చేశాం అంటూ చేతులు పైకెత్తి చూపాడొక మూర్ఖుడు… పేరు రవూఫ్. మనోళ్లు ఊరుకుంటారా. వికెట్‌ తీయడం ఆలస్యం ‘నీది కూలింది చూసుకో’ అంటూ ఎక్కడ మంట పెట్టాలో అక్కడ పెట్టారు. ఇలాంటి ఎమోషనల్‌ గేమ్‌.. బహుశా క్రికెట్‌ హిస్టరీలో ఏ దేశాల మధ్య జరిగి ఉండదు. ఆసియా కప్‌లో టీమిండియా ఆడుతోందనగానే గరం గరం అయ్యారు మొదట్లో. 8 టీమ్‌లతో జరిగే సాధారణ ఆసియా కప్‌ అది. పైగా ఏషియన్‌ క్రికెట్‌ కౌన్సిల్‌ను పాకిస్తాన్‌ ఆడిస్తోంది. ఒకవిధంగా పాకిస్తాన్‌ కండక్ట్‌ చేస్తున్న సిరీస్‌ ఇది. అందులోనూ ఫామ్‌లో ఉన్న జట్టు ఒక్కటీ లేదు. వీటన్నిటికీ మించి పహల్గామ్‌ దాడితో భారత స్త్రీల సౌభాగ్యాన్ని చెరిపేసిన ఉగ్రవాదులకు అండగా వున్న పాకిస్తాన్‌తో ఆడాలి. ‘గెలిస్తే మాత్రం.. అవసరమా ఈ సిరీస్‌ మనకి’ అని విమర్శించిన వాళ్లూ లేకపోలేదు. అందుకే, ఆసియా కప్‌లో పాకిస్తాన్‌తో ఆడిన మొదటి మ్యాచ్‌కు అసలు టికెట్లు కూడా అమ్ముడుపోలేదు. ఒక్క సెలబ్రిటీ దుబాయ్‌ వెళ్తే ఒట్టు. క్రికెట్‌ భారతీయుల నరనరాన ఉందేమో. పాక్‌తో మ్యాచ్‌ అంటే రక్తం మరుగుతుందేమో. కాని, అన్నిటికీ మించి దేశభక్తే అల్టిమేట్. అందుకే, ఆసియా కప్‌లో టీమిండియా ఆడొద్దంటూ ఎన్నెన్ని నిరసనలు చేశారో. సరే.. ఎవరు ఔనన్నా,...

పూర్తి కథనాన్ని చదివేందుకు TV9 యాప్‌ని డౌన్‌లోడ్ చేయండి

ప్రత్యేకమైన కథనాలకు అపరిమితమైన యాక్సెస్ TV9 యాప్‌లో కొనసాగండి