
India vs Zimbabwe, 48th Match, Super 8 Group 1: టీ20 ప్రపంచ కప్ లో భాగంగా 8వ సూపర్ 8 మ్యాచ్‌లో టీమిండియా జింబాబ్వేకు 257 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. ఈ క్రమంలో భారత జట్టు 20 ఓవర్లలో 4 వికెట్లకు 256 పరుగులు చేసింది. టీ20 ప్రపంచ కప్ చరిత్రలో ఇది రెండవ అత్యధిక స్కోరుగా నిలిచింది. 2007లో కెన్యాపై శ్రీలంక చేసిన అత్యధిక స్కోరు 260.
చెన్నైలోని చేపాక్ స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్‌లో జింబాబ్వే కెప్టెన్ సికందర్ రజా టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్నాడు. అభిషేక్ శర్మ 55, హార్దిక్ పాండ్యా 50, తిలక్ వర్మ 44 పరుగులతో అజేయంగా నిలిచి రాణించడంతో భారత్ 256 పరుగులు చేసింది.
టీ20 ప్రపంచ కప్‌లో టీం ఇండియా సాధించిన అత్యధిక స్కోరు కూడా ఇదే. మునుపటి రికార్డు 2007లో ఇంగ్లాండ్‌పై న218 పరుగులు చేసింది. డర్బన్‌లో జరిగిన ఆ మ్యాచ్‌లో యువరాజ్ సింగ్ స్టువర్ట్ బ్రాడ్ ఓవర్‌లో వరుసగా ఆరు సిక్సర్లు కొట్టాడు. నలుగురు జింబాబ్వే బౌలర్లు ఒక్కొక్క వికెట్ తీసుకున్నారు.
భారత్ (ప్లేయింగ్ XI): సంజు శాంసన్(కీపర్), అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్, సూర్యకుమార్ యాదవ్(కెప్టెన్), తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా, శివమ్ దూబే, అక్షర్ పటేల్, అర్ష్‌దీప్ సింగ్, వరుణ్ చకరవర్తి, జస్ప్రీత్ బుమ్రా.
జింబాబ్వే (ప్లేయింగ్ XI): తడివానాషే మారుమణి(కీపర్), బ్రియాన్ బెన్నెట్, డియోన్ మైయర్స్, ర్యాన్ బర్ల్, సికందర్ రజా(కెప్టెన్), టోనీ మునియోంగా, తషింగా ముసెకివా, బ్రాడ్ ఎవాన్స్, టినోటెండా మపోసా, బ్లెస్సింగ్ ముజారబానీ, రిచర్డ్ నగరవ.