IND vs WI 1st ODI: సీనియర్లు లేకుండానే బరిలోకి టీమిండియా.. శిఖర్ సారథ్యంలో ప్లేయింగ్ XI ఎలా ఉండనుందంటే?

|

Jul 20, 2022 | 6:20 AM

భారత్ వర్సెస్ వెస్టిండీస్ మధ్య మొదటి వన్డే మ్యాచ్ శుక్రవారం, జులై 22న జరగనుంది. ఈ మ్యాచ్‌లో టీమిండియా ప్లేయింగ్ ఎలెవన్ ఎలా ఉంటుందో ఓసారి చూద్దాం..

IND vs WI 1st ODI: సీనియర్లు లేకుండానే బరిలోకి టీమిండియా.. శిఖర్ సారథ్యంలో ప్లేయింగ్ XI ఎలా ఉండనుందంటే?
Ind Vs Wi Shikhar Dhawan
Follow us on

IND vs WI 1st ODI, Team India Playing 11: వన్డే సిరీస్‌లో 2-1 తేడాతో ఇంగ్లండ్‌ను ఓడించిన టీమిండియా ప్రస్తుతం వెస్టిండీస్‌పై దుమ్మురేపేందుకు సిద్ధమవుతోంది. వెస్టిండీస్‌లో టీమిండియా మూడు వన్డేల సిరీస్‌తో పాటు ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ ఆడనుంది. వెస్టిండీస్‌లో భారత పర్యటన జులై 22 శుక్రవారం మొదటి వన్డేతో ప్రారంభమవుతుంది. కోహ్లీ, రోహిత్, పంత్, బుమ్రా, హార్దిక్ లేకుండానే టీమిండియా బరిలోకి దిగనుంది. వెస్టిండీస్‌తో జరిగే వన్డే సిరీస్‌లో రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, హార్దిక్ పాండ్యా, రిషబ్ పంత్, జస్ప్రీత్ బుమ్రా భారత జట్టులో లేకపోవడం గమనార్హం. వన్డే సిరీస్‌లో టీమిండియాకు సీనియర్ ఓపెనర్ శిఖర్ ధావన్ నాయకత్వం వహించనున్నాడు.

ఓపెనర్స్‌గా ధావన్, గిల్..

తొలి వన్డేలో శిఖర్ ధావన్, శుభ్‌మన్ గిల్‌లు ఇన్నింగ్స్‌ను ఓపెనింగ్ చేసే అవకాశం ఉంది. అదే సమయంలో, శ్రేయాస్ అయ్యర్ మూడో స్థానంలో ఆడే ఛాన్స్ ఉంది. దీని తర్వాత సూర్యకుమార్ యాదవ్ నాలుగో నంబర్‌లో, దీపక్ హుడా ఐదో నంబర్‌లో, సంజూ శాంసన్ ఆరో నంబర్‌లో బరిలోకి దిగవచ్చు.

ఇవి కూడా చదవండి

జడేజాతో సారథ్యంలో బౌలింగ్ విభాగం..

వైస్ కెప్టెన్ రవీంద్ర జడేజా ఏడో నంబర్‌లో ఆడనున్నాడు. యుజ్వేంద్ర చాహల్ అతనితో కలిసి స్పిన్ విభాగాన్ని నిర్వహించనున్నాడు. ఫాస్ట్ బౌలింగ్ విభాగం బాధ్యత మహ్మద్ సిరాజ్, శార్దూల్ ఠాకూర్, ప్రసిద్ధ్ కృష్ణల భుజాలపై ఉంటుంది. ఇంగ్లండ్‌తో జరిగిన మూడో వన్డేలో సిరాజ్ అద్భుత ప్రదర్శన చేశాడు.

భారత ప్రాబబుల్ ప్లేయింగ్ ఎలెవన్ – శిఖర్ ధావన్ (కెప్టెన్), శుభమన్ గిల్, శ్రేయాస్ అయ్యర్, సూర్యకుమార్ యాదవ్, సంజు శాంసన్ (వికెట్ కీపర్), దీపక్ హుడా, రవీంద్ర జడేజా, శార్దూల్ ఠాకూర్, యుజ్వేంద్ర చాహల్, మహ్మద్ సిరాజ్, ప్రసిద్ధ్ కృష్ణ.

వన్డే సిరీస్ కోసం భారత జట్టు: శిఖర్ ధావన్ (కెప్టెన్), రుతురాజ్ గైక్వాడ్, శుభమన్ గిల్, దీపక్ హుడా, సూర్యకుమార్ యాదవ్, శ్రేయాస్ అయ్యర్, ఇషాన్ కిషన్ (కీపర్), సంజు శాంసన్ (కీపర్), రవీంద్ర జడేజా (వైస్ కెప్టెన్), శార్దూల్ ఠాకూర్, యుజువేంద్ర ఠాకూర్ చాహల్, అక్షర్ పటేల్, అవేష్ ఖాన్, ప్రసిద్ధ్ కృష్ణ, మహ్మద్ సిరాజ్, అర్ష్‌దీప్ సింగ్.