Asia Cup 2023, India Vs Sri Lanka: ఆసియా కప్ 16వ ఎడిషన్ ఫైనల్‌లో భారత్, శ్రీలంక జట్లు (India Vs Sri Lanka) తలపడనున్నాయి. ఆదివారం కొలంబోకు చెందిన ఆర్. ప్రేమదాస మైదాన్‌లో జరిగే ఫైనల్ షోడౌన్‌లో ఉత్కంఠభరిత పోరు జరగనుంది. ఎందుకంటే ఆసియా కప్ చరిత్రలో భారత జట్టు శ్రీలంకపై మాత్రమే ఫైనల్‌లో ఓడిపోయింది.
గత 15 ఆసియా కప్ టోర్నీల్లో టీమ్ ఇండియా మొత్తం 10 సార్లు ఫైనల్ ఆడింది. ఫైనల్‌లో మూడుసార్లు ఓడిపోయింది. అది కూడా శ్రీలంకపైనే కావడం.. ప్రస్తుతం రోహిత్ శర్మను ఆందోళనకు గురిచేస్తోంది.
1984లో ప్రారంభమైన ఆసియాకప్ తొలి ఎడిషన్‌లో టీమిండియా శ్రీలంకను ఓడించి టైటిల్‌ను కైవసం చేసుకుంది. ఆ తర్వాత 1988, 1991, 1995 ఫైనల్స్‌లో లంకను ఓడించి ఆసియా కప్‌లో భారత జట్టు హ్యాట్రిక్ ఛాంపియన్‌గా నిలిచింది.
కానీ, 1997లో శ్రీలంక జట్టు భారత జట్టును ఓడించి తొలిసారి ఆసియా ఛాంపియన్‌గా అవతరించింది. ఆ తర్వాత 2004, 2008లోనూ భారత్‌ను ఓడించి శ్రీలంక ఆసియా కప్‌ను గెలుచుకుంది.
ఇక 2010 ఆసియా కప్ ఫైనల్‌లో శ్రీలంక జట్టును ఓడించి టీమిండియా ట్రోఫీని అందుకుంది. ఆ తర్వాత ఫైనల్‌లో ఇరు జట్లు తలపడలేదు. ఇప్పుడు 13 ఏళ్ల విరామం తర్వాత ఇరు జట్లు ఆసియాకప్‌లో ఫైనల్ పోరుకు సిద్ధమయ్యాయి.
ఆసియాకప్ ఫైనల్లో టీమిండియా చేతిలో ఓడిన ఏకైక జట్టుగా నిలిచిన శ్రీలంక.. అదే ఆత్మవిశ్వాసంతో బరిలోకి దిగేందుకు సిద్ధమైంది. మరోవైపు, ప్రపంచకప్‌నకు ముందు ఆసియాకప్‌ను కైవసం చేసుకునే దిశగా టీమిండియా దూసుకుపోతోంది. అందువల్ల ఆదివారం జరిగే ఫైనల్ పోరులో హోరాహోరీ పోటీ నెలకొనే అవకాశం ఉంది.
ఇప్పటి వరకు 8సార్లు ఫైనల్లో తలపడిన భారత్, శ్రీలంక టీంలలో ఆధిపత్యం టీమిండియా వైపే నిలిచింది. అయితే, శ్రీలంకలో జరిగిన రెండు ఫైనల్స్‌లోనూ టీమిండియాకు ఓటమే ఎదురైంది. దీంతో మూడో సారి ఇరుజట్ల మధ్య శ్రీలంకలోనే జరగనుండడంతో రోహిత్ సేనకు ఆందోళన మొదలైంది.
శ్రీలంక జట్టు: దసున్ షనక (కెప్టెన్), పాతుమ్ నిస్సాంక, దిముత్ కరుణరత్నే, కుసల్ పెరీరా, కుసల్ మెండిస్ (వైస్ కెప్టెన్), చరిత్ అసలంక, ధనంజయ డి సిల్వా, సదీర సమరవిక్రమ, దునిత్ వెల్లాలఘే, మతిషా పతిరణ, కసున్ రజిత, దుషన్ రజిత, బి. ఫెర్నాండో, ప్రమో డి మధుషన్.
టీమ్ ఇండియా: రోహిత్ శర్మ (కెప్టెన్), శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్, కేఎల్ రాహుల్ (వికెట్ కీపర్), తిలక్ వర్మ, ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్యా (వైస్ కెప్టెన్), రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, శార్దూల్ ఠాకూర్, కుల్దీప్ యాదవ్, మహ్మద్ సిరాజ్, జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ షమీ, ప్రసీద్ద్ కృష్ణ.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..