AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IND vs SL 3rd T20 Playing 11: మూడో టీ20 నుంచి ఆ ప్లేయర్ ఔట్.. టీమిండియా ప్లేయింగ్ 11లో కీలక మార్పు..

IND Vs SL T20 Match Prediction Squads: రాజ్‌కోట్‌లో భారత్ వర్సెస్ దక్షిణాఫ్రికా మధ్య జరగనున్న మూడో మ్యాచ్ సిరీస్ డిసైడర్‌గా మారింది. దీంతో ఇరుజట్ల మధ్య హోరాహోరీ పోరు జరగనుంది.

IND vs SL 3rd T20 Playing 11: మూడో టీ20 నుంచి ఆ ప్లేయర్ ఔట్.. టీమిండియా ప్లేయింగ్ 11లో కీలక మార్పు..
Ind Vs Sl 2nd T20i
Venkata Chari
|

Updated on: Jan 07, 2023 | 6:15 AM

Share

ప్రస్తుతం భారత క్రికెట్ జట్టులో తీవ్ర సంక్షోభం నెలకొంది. స్వదేశంలో టీ20 సిరీస్ కోల్పోయే ప్రమాదంలో టీమిండియా ఉంది. ప్రస్తుతం భారత జట్టు శ్రీలంకతో మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ ఆడుతోంది. ఇందులో ఇరుజట్లు 1-1తో సమానంగా నిలిచాయి. సిరీస్‌లో చివరి, నిర్ణయాత్మక మ్యాచ్ శనివారం రాజ్‌కోట్‌లో జరగనుంది. ఈ మ్యాచ్‌లో గెలిచిన జట్టు సిరీస్‌ని దక్కించుకుంటుంది. ఈ సిరీస్‌ను శ్రీలంక గెలిస్తే టీమిండియాకు పెద్ద దెబ్బే తగలనుంది.

రెండో మ్యాచ్‌లో భారత్ మంచి పోరాటం చేసినా టీమ్ ఇండియా గెలవలేకపోయింది. తొలుత బ్యాటింగ్ చేసిన శ్రీలంక ఆరు వికెట్ల నష్టానికి 206 పరుగులు చేసింది. పూర్తి 20 ఓవర్లు ఆడి 16 పరుగుల తేడాతో ఓడిన టీమిండియా ఎనిమిది వికెట్లు కోల్పోయి 190 పరుగులు మాత్రమే చేయగలిగింది. ఇక మూడవ మ్యాచ్‌లో గెలవడం చాలా అవసరంగా మారింది. ఇటువంటి పరిస్థితిలో టీమిండియా తన ప్లేయింగ్-11లో ఏమైనా మార్పులు చేస్తుందా లేదా అనేది ఆసక్తికరంగా మారింది.

మారనున్న ప్లేయింగ్ 11..

రెండో మ్యాచ్‌లో అర్ష్‌దీప్ సింగ్ రాణించలేకపోయాడు. శివ మావి, ఉమ్రాన్ మాలిక్ కూడా పెద్దగా ఆకట్టుకోలేకపోయారు. దీంతో పాటు టీమ్ ఇండియా టాప్ ఆర్డర్ కూడా విఫలమైంది. ఇషాన్ కిషన్, శుభమన్ గిల్, రాహుల్ త్రిపాఠిలు ప్రత్యేకంగా ఏమీ చేయలేకపోయారు. ఇటువంటి పరిస్థితిలో టీమిండియాలో మార్పులు తప్పవని తెలుస్తోంది. బౌలింగ్‌లో ఒక మార్పు ఉండవచ్చని భావిస్తున్నారు. హర్షల్ పటేల్ ప్లేయింగ్-11లోకి తిరిగి రావచ్చని తెలుస్తోంది. హ్యాట్రిక్ నో బాల్స్‌ విసిరిన అర్షదీప్‌ను కూడా మూడో మ్యాచ్‌లో పక్కన పెట్టవచ్చని తెలుస్తోంది. ఇప్పటికే ఈ ప్లేయర్ విషయంలో హార్దిక్ చాలా కోపంగా ఉన్నాడు.

ఇవి కూడా చదవండి

బ్యాటింగ్‌లో ఇషాన్, గిల్ రాణించాల్సి ఉంటుంది. బ్యాటింగ్‌లో మార్పు వచ్చే అవకాశం లేదు. ఒక మ్యాచ్ ఆధారంగా రాహుల్ త్రిపాఠిని ద్రవిడ్ మినహాయించరు. ఆయన గత ప్రకటనలు ఈ విషయాన్ని చెబుతున్నాయి.

అదే జట్టుతో శ్రీలంక..

షనక సారథ్యంలో శ్రీలంక జట్టు అద్భుత ఆటతీరుతో భారత్‌కు గట్టిపోటీనిచ్చింది. షనక విన్నింగ్ కాంబినేషన్‌ను తారుమారు చేసేందుకు మొగ్గుచూపడు. అందుకే శ్రీలంక ప్లేయింగ్-11లో మార్పుపై పెద్దగా ఆశలు లేవు.

టీమ్ ఇండియా ప్లేయింగ్-11..

హార్దిక్ పాండ్యా (కెప్టెన్), ఇషాన్ కిషన్, శుభ్‌మన్ గిల్, రాహుల్ త్రిపాఠి, సూర్యకుమార్ యాదవ్, దీపక్ హుడా, అక్షర్ పటేల్, శివమ్ మావి/ హర్షల్ పటేల్, ఉమ్రాన్ మాలిక్, అర్ష్‌దీప్ సింగ్, యుజ్వేంద్ర చాహల్.

శ్రీలంక ప్లేయింగ్-11..

దనుస షనక (కెప్టెన్), పాతుమ్ నిస్సాంక, కుసల్ మెండిస్, భానుక రాజపక్సే, చరిత అసలంక, ధనంజయ్ డి సిల్వా, వనిందు హసరంగా, చమిక కరుణరత్నే, మహిష్ తీక్షణ, కసున్ రచిత, దిల్షన్ మధుశంక.

మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..