IND vs SA, 4th T20I: టాస్ గెలిచిన సౌతాఫ్రికా.. మరోసారి పంత్‌కు అచ్చిరాలే.. ప్లేయింగ్ XI ఎలా ఉందంటే?

|

Jun 17, 2022 | 6:45 PM

India vs South Africa T20: మూడో మ్యాచ్‌లో దక్షిణాఫ్రికాను ఓడించడం ద్వారా భారత్ ఈ సిరీస్‌లో విజయాల ఖాతాను తెరిచింది. అయినప్పటికీ సిరీస్‌లో దక్షిణాఫ్రికా 2-1 ఆధిక్యంలో నిలిచింది. ఈమ్యాచ్ పంత్ సేనకు చాలా కీలకం.

IND vs SA, 4th T20I: టాస్ గెలిచిన సౌతాఫ్రికా.. మరోసారి పంత్‌కు అచ్చిరాలే.. ప్లేయింగ్ XI ఎలా ఉందంటే?
India Vs South Africa T20 Series 2022
Follow us on

IND vs SA, 4వ T20I: భారత్-దక్షిణాఫ్రికా మధ్య ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో ఈరోజు నాలుగో టీ20 మ్యాచ్.. రాజ్‌కోట్‌లోని సౌరాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ స్టేడియంలో జరుగుతోంది. ఈ సిరీస్‌లో తొలి రెండు మ్యాచ్‌లు గెలిచి దక్షిణాఫ్రికా సిరీస్‌లో ముందంజ వేసింది. అయితే మూడో మ్యాచ్‌లో గెలిచి పుంజుకున్న భారత్.. ప్రస్తుతం సిరీస్‌ను సమం చేసేందుకు ప్రయత్నిస్తోంది. ఈ మ్యాచ్‌లో టీమ్ ఇండియా గెలిస్తే సిరీస్ 2-2తో సమం చేయనుంది. అలాగే చివరి మ్యాచ్ సిరీస్‌ను డిసైడ్ చేస్తుంది. కాగా, ఈ మ్యాచ్‌లో ఓడిపోతే మాత్రం సిరీస్‌ నుంచి తప్పుకోవడం ఖాయం.

కీలకమైన టాస్‌లో మరోసారి రిషబ్ పంత్‌కు మొండిచేయి దక్కింది. వరుసగా నాలుగోసారి టాస్ ఓడిపోయాడు. ఈ క్రమంలో టాస్ గెలిచిన దక్షిణాఫ్రికా కెప్టెన్ బవుమా.. ఎప్పటిలాగే బౌలింగ్ ఎంచుకున్నాడు. దీంతో రిషబ్ పంత్ సేన, తొలుత బ్యాటింగ్ చేయనుంది. అయితే, టీమిండియాలో ఎలాంటి మార్పులు లేకుండా అదే జట్టుతో బరిలోకి దిగుతుండగా, దక్షిణాఫ్రికా మాత్రం రెండు మార్పులతో బరిలోకి దిగనుంది.

ఇరుజట్లు..

ఇవి కూడా చదవండి

భారత్ (ప్లేయింగ్ XI): రుతురాజ్ గైక్వాడ్, ఇషాన్ కిషన్, శ్రేయాస్ అయ్యర్, రిషబ్ పంత్(కీపర్/కెప్టెన్), హార్దిక్ పాండ్యా, దినేష్ కార్తీక్, అక్షర్ పటేల్, హర్షల్ పటేల్, భువనేశ్వర్ కుమార్, యుజ్వేంద్ర చాహల్, అవేష్ ఖాన్

దక్షిణాఫ్రికా (ప్లేయింగ్ XI): టెంబా బావుమా(కెప్టెన్), క్వింటన్ డి కాక్(కీపర్, రాస్సీ వాన్ డెర్ డస్సెన్, డేవిడ్ మిల్లర్, హెన్రిచ్ క్లాసెన్, డ్వైన్ ప్రిటోరియస్, కేశవ్ మహరాజ్, మార్కో జాన్సెన్, లుంగి న్గిడి, తబ్రైజ్ షమ్సీ, అన్రిచ్ నోర్ట్జే