IND vs SA Final Match: సౌతాఫ్రికాతో నేడు చివరి పోరు.. ఫైనల్ మ్యాచ్‌లో ఎవరు గెలుస్తారో మరి..!

IND vs SA Final Match: సౌతాఫ్రికాతో ఐదు టీ20 మ్యాచ్‌ల సిరీస్‌లో ఇవాళ తుదిపోరు జరుగనుంది. ఇప్పటికే ఇరుజట్లు 2-2తో సమానంగా ఉండడంతో

IND vs SA Final Match: సౌతాఫ్రికాతో నేడు చివరి పోరు.. ఫైనల్ మ్యాచ్‌లో ఎవరు గెలుస్తారో మరి..!
Ind Vs Sa

Updated on: Jun 19, 2022 | 5:38 AM

IND vs SA Final Match: సౌతాఫ్రికాతో ఐదు టీ20 మ్యాచ్‌ల సిరీస్‌లో ఇవాళ తుదిపోరు జరుగనుంది. ఇప్పటికే ఇరుజట్లు 2-2తో సమానంగా ఉండడంతో నేటి మ్యాచ్‌ హోరాహోరీగా జరిగే అవకాశం ఉంది. వరుస మ్యాచ్‌లలో గెలిచి జోష్‌లో ఉన్న టీమిండియా సిరీస్‌ విన్నింగ్‌ మ్యాచ్‌లో సత్తా చాటేందుకు వ్యూహాలు రచిస్తోంది. బెంగుళూరు చిన్నస్వామి స్టేడియంలో సాయంత్రం 7గంటలకు మ్యాచ్‌ ప్రారంభం కానుంది.

ఈ సిరీస్‌లో తొలి రెండు మ్యాచ్‌ల్లో సౌతాఫ్రికా జట్టు విజయం సాధించిన విషయం తెలిసిందే. ఆ తరువాత జరిగిన 3వ మ్యాచ్‌లో భారత ఆటగాళ్లు విజృంభించారు. దాంతో ఆ మ్యాచ్‌లో టీమిండియా గ్రాండ్ విక్టరీ సాధించింది. ఆ తరువాత జరిగిన 4వ మ్యాచ్‌లోనూ భారత జట్టుదే హవా నడిచింది. ఈ మ్యాచ్‌లోనూ ఇండియా విజయం సాధించింది. దాంతో 5 మ్యాచ్‌ల ఈ సిరీస్‌లో సౌతాఫ్రికా 2, ఇండియా 2 చొప్పున గెలిచి సమానంగా నిలిచాయి. ఇవాళ జరగనున్న ఫైనల్ పోరులో ఏ టీమ్ గెలిస్తే ఆ టీమ్‌ సిరీస్‌ను కైవసం చేసుకుంటుంది.