25 బంతుల్లో 8 సిక్సర్లు.. 250 స్ట్రైక్‌రేట్‌తో 71 పరుగులు.. భారత స్పిన్నర్‌ను దంచి కొట్టిన సౌతాఫ్రికా ఆటగాడు..

|

Jun 14, 2022 | 2:35 PM

భారత్ గెలవాలంటే ఈరోజు హెన్రిచ్ క్లాసెన్‌కు వ్యతిరేకంగా భారత సీనియర్ స్పిన్నర్ చాహల్ చెలరేగి ఆడాలి. లేదంటే టీమిండియా సిరీస్‌ను కోల్పోవాల్సి ఉంటుంది.

25 బంతుల్లో 8 సిక్సర్లు.. 250 స్ట్రైక్‌రేట్‌తో 71 పరుగులు.. భారత స్పిన్నర్‌ను దంచి కొట్టిన సౌతాఫ్రికా ఆటగాడు..
India Vs South Africa
Follow us on

ఈరోజు భారత్, దక్షిణాఫ్రికా జట్లు విశాఖ వేదికగా తలపడనున్నాయి. సిరీస్‌ను సీల్ చేయాలనే ఉద్దేశ్యంతో దక్షిణాఫ్రికా బరిలోకి దిగనుండగా, సిరీస్‌లో తమ ఆశలను సజీవంగా ఉంచుకునే ఉద్దేశ్యంతో టీమ్ ఇండియా పోరాడనుంది. వైజాగ్‌లో భారత్-దక్షిణాఫ్రికా జట్ల మధ్య జరిగే ఈ పోరులో ఇరు జట్ల ఆటగాళ్ల పాత్ర కీలకం కానుంది. ముఖ్యంగా హెన్రిచ్ క్లాసెన్, యుజ్వేంద్ర చాహల్ (Heinrich Klaasen vs Yuzvendra Chahal) మధ్య పోరు ఆసక్తికరంగా మారనుంది. భారత్ గెలవాలంటే, ఈరోజు హెన్రిచ్ క్లాసెన్‌కు వ్యతిరేకంగా చాహల్ చెలరేగాలి. లేకుంటే టీమిండియా పరిస్థితి దారుణంగా ఉంటుంది. కటక్‌లో జరిగిన సిరీస్‌లో రెండో టీ20లో చాహల్ వేసిన 13 బంతులను ఎదుర్కొన్న క్లాసెన్ 3 సిక్సర్లతో 30 పరుగులు చేశాడు.

టీ20ల్లో చాహల్ vs క్లాసెన్..

టీ20 ఇంటర్నేషనల్స్‌లో చాహల్, క్లాసెన్ రెండు సార్లు తలపడ్డారు. ఆ రెండు సందర్భాల్లో, క్లాసెన్ భారత బౌలర్ చాహల్ బౌలింగ్‌లో 25 బంతులు ఆడాడు. అందులో అతను 8 సిక్సర్లతో 71 పరుగులు చేశాడు. అంటే చాహల్‌పై ఓవరాల్ స్ట్రైక్ రేట్ 250కి చేరువలో ఉంది. కటక్‌లో 13 బంతులు ఆడిన క్లాసెన్, ఇక 2018లో చాహల్ బౌలింగ్‌లో 12 బంతుల్లో 41 పరుగులు చేశాడు. ఆ సమయంలో అతను 5 సిక్సర్లు కొట్టాడు.

ఇవి కూడా చదవండి

లెగ్ స్పిన్నర్లను బాదేస్తున్న క్లాసెన్..

చాహల్‌పై క్లాసెన్ అద్భుతమైన రికార్డు వెనుక ఓ కారణం కూడా ఉంది. లెగ్ స్పిన్నర్లకు వ్యతిరేకంగా బ్యాటింగ్ చేయడం తనకు ఇష్టమని క్లాసెన్ చెప్పుకొచ్చాడు. ఇక చాహల్ లెగ్ స్పిన్నర్ అనే సంగతి తెలిసిందే. “చాహల్‌ను ఎదుర్కోవడం అంటే నాకు చాలా ఇష్టం. ముఖ్యంగా నేను ఇద్దరు అద్భుతమైన లెగ్ స్పిన్నర్లను ఎదుర్కొనేందుకు ఎదురుచూస్తుంటాను. నేను టైటాన్స్ తరపున షాన్ వాన్ బెర్గ్‌ని కూడా ఎదుర్కొన్నాను. లెగ్ స్పిన్నర్లను ఎదుర్కోవడాన్ని ఇష్టపడుతుంటాను” అని క్లాసెన్ పేర్కొన్నాడు.