IND vs SA: కీలక పోరుకు సిద్ధమైన భారత్, సౌతాఫ్రికా.. 3వ వన్డేకు వర్షం ముప్పు.. ప్లేయింగ్ XIలో మార్పులు?

|

Oct 11, 2022 | 6:10 AM

దీంతో ఇరు జట్ల చూపు సిరీస్‌ గెలుపొందడంపైనే ఉంది. అయితే ఓపెనింగ్ జోడీ కెప్టెన్ శిఖర్ ధావన్, యువ బ్యాట్స్‌మెన్ శుభ్‌మన్ గిల్‌ల ప్రదర్శనపై భారత జట్టు మేనేజ్‌మెంట్ కాస్త ఆందోళన చెందుతోంది. ఈ సిరీస్‌లో ఈ ఇద్దరు బ్యాట్స్‌మెన్‌లు ఇప్పటి వరకు పరుగులు చేయడంలో తెగ ఇబ్బంది పడుతున్నారు.

IND vs SA: కీలక పోరుకు సిద్ధమైన భారత్, సౌతాఫ్రికా.. 3వ వన్డేకు వర్షం ముప్పు.. ప్లేయింగ్ XIలో మార్పులు?
India Vs South Africa 3rd Odi Preview
Follow us on

దక్షిణాఫ్రికా సిరీస్‌లో శిఖర్ ధావన్ నేతృత్వంలోని భారత జట్టుకు శుభారంభం అంతగా జరగలేదు. లక్నోలో జరిగిన తొలి మ్యాచ్‌లో ఓటమి చవిచూడాల్సి వచ్చింది. ఆ తర్వాత రాంచీ వేదికగా జరిగిన రెండో మ్యాచ్‌లో గెలిచి సిరీస్‌ను సమం చేసిన టీమ్‌ఇండియా.. తాజాగా మంగళవారం ఢిల్లీలో జరగనున్న నిర్ణయాత్మక మూడో వన్డేలో తలపడేందుకు సిద్ధమైంది.

దీంతో ఇరు జట్ల చూపు సిరీస్‌ గెలుపొందడంపైనే ఉంది. అయితే ఓపెనింగ్ జోడీ కెప్టెన్ శిఖర్ ధావన్, యువ బ్యాట్స్‌మెన్ శుభ్‌మన్ గిల్‌ల ప్రదర్శనపై భారత జట్టు మేనేజ్‌మెంట్ కాస్త ఆందోళన చెందుతోంది. ఈ సిరీస్‌లో ఈ ఇద్దరు బ్యాట్స్‌మెన్‌లు ఇప్పటి వరకు పరుగులు చేయడంలో తెగ ఇబ్బంది పడుతున్నారు.

తీవ్రంగా నిరాశపరిచిన ధావన్..

ఇవి కూడా చదవండి

వన్డేల్లో నిలకడగా రాణిస్తున్న భారత బ్యాట్స్‌మెన్‌లలో ఒకరైన ధావన్.. ఈ సిరీస్‌లో ఇప్పటివరకు 17 పరుగులు మాత్రమే చేశాడు. ఇప్పుడు వచ్చే ఏడాది జరగనున్న వన్డే ప్రపంచకప్‌పై దృష్టి సారించిన ఈ వెటరన్ బ్యాట్స్‌మెన్ నిర్ణయాత్మక మ్యాచ్‌లో జట్టుకు మెరుగైన ఆరంభాన్ని అందించడానికి ప్రయత్నించాలి. మరోవైపు ఆర్డర్‌లో అగ్రస్థానంలో లభిస్తున్న అవకాశాలను గిల్ పూర్తి స్థాయిలో సద్వినియోగం చేసుకోలేకపోతున్నాడు. తొలి మ్యాచ్‌లో చౌకగా ఔటైన అతను రెండో వన్డేలో శుభారంభాన్ని పెద్ద స్కోరుగా మార్చలేకపోయాడు.

బలంగా మిడిల్ ఆర్డర్..

అయితే శ్రేయాస్ అయ్యర్, ఇషాన్ కిషన్, సంజు శాంసన్‌లతో కూడిన భారత మిడిల్ ఆర్డర్ బలంగా కనిపిస్తోంది. అయ్యర్, శాంసన్ తమ ప్రదర్శనలో నిలకడను కనబరుస్తుండగా, కిషన్ గొప్ప రిథమ్‌లో కనిపిస్తున్నాడు. భారత జట్టు మేనేజ్‌మెంట్ వన్డే ప్రపంచకప్ కోసం ఆటగాళ్లను ప్రయత్నిస్తున్నప్పుడు, ముగ్గురూ తమ ఫామ్‌ను కొనసాగించడానికి తమ వంతు ప్రయత్నం చేస్తారనడంలో ఎలాంటి సందేహం లేదు.

సత్తా చాటిన సిరాజ్..

బౌలింగ్‌లో, మహ్మద్ సిరాజ్ T20 ప్రపంచ కప్ కోసం జట్టులో గాయపడిన జస్ప్రీత్ బుమ్రా స్థానంలో బలమైన వాదనను వినిపిస్తున్నాడు. స్పిన్నర్లు షాబాజ్ అహ్మద్, రవి బిష్ణోయ్ కూడా తమ అరంగేట్రంలోనే మంచి ప్రదర్శన చేశారు. వచ్చే ఏడాది ప్రపంచకప్‌ దృష్ట్యా దక్షిణాఫ్రికాకు ఈ సిరీస్‌ చాలా కీలకం కానుంది. ఐసీసీ క్రికెట్ వరల్డ్ కప్ సూపర్ లీగ్‌లో తన ఖాతాలో కొన్ని పాయింట్లను చేర్చుకోవడానికి శాయశక్తులా ప్రయత్నిస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు.

దక్షిణాఫ్రికాకు కఠిన సవాల్..

దక్షిణాఫ్రికా ప్రస్తుతం ర్యాంకింగ్స్‌లో 11వ స్థానంలో ఉంది. 50 ఓవర్ల ప్రపంచ కప్‌నకు నేరుగా అర్హత సాధించే పరిస్థితి కనిపించడం లేదు. టెంబా బావుమా పేలవ ఫామ్‌లో ఉంది. అస్వస్థత కారణంగా రెండో వన్డేకు అతనికి విశ్రాంతి లభించింది. డిసైడర్‌లో అతను పునరాగమనం చేస్తాడో లేదో చూడాలి.

కేర్‌టేకర్ కెప్టెన్ కేశవ్ మహారాజ్ రెండో వన్డేలో టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ చేయాలని తప్పుడు నిర్ణయం తీసుకున్నాడు. తరువాత బౌలింగ్ చేస్తున్నప్పుడు మంచుతో దక్షిణాఫ్రికా బౌలర్లు ఇబ్బంది పడ్డారు. అయినప్పటికీ, నిర్ణయాత్మక మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా కూడా ఎటువంటి అవకాశాన్ని వదలదపడంలో ఎలాంటి సందేహం లేదు. బ్యాటింగ్‌లో ఇప్పటివరకు క్వింటన్ డి కాక్, ఐడెన్ మార్క్రామ్, డేవిడ్ మిల్లర్ మంచి ప్రదర్శన చేశారు. అయితే ఈ మ్యాచ్‌కు వర్షం ఆటంకం కలిగించవచ్చు.

భారీ వర్షం కురిసే ఛాన్స్..

జాతీయ రాజధాని ప్రాంతంలో గత మూడు రోజులుగా భారీ వర్షాలు కురుస్తుండగా మంగళవారం కూడా వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షం కారణంగా మైదానం కూడా తడిసి పోయింది. ఙలాంటి పరిస్థితుల్లో మ్యాచ్ సాధ్యమా లేదా అనే దానిపైనే అందరి దృష్టి నెలకొంది.

రెండు జట్లు :

భారత్: శిఖర్ ధావన్ (కెప్టెన్), శుభమన్ గిల్, రితురాజ్ గైక్వాడ్, ఇషాన్ కిషన్, శ్రేయాస్ అయ్యర్, సంజూ శాంసన్, శార్దూల్ ఠాకూర్, కుల్దీప్ యాదవ్, అవేష్ ఖాన్, రవి బిష్ణోయ్, మహ్మద్ సిరాజ్, వాషింగ్టన్ సుందర్, ముఖేష్ కుమార్, రజత్ అహ్మద్, షహబాజ్ పటీదార్, రాహుల్ త్రిపాఠి.

దక్షిణాఫ్రికా: టెంబా బావుమా (కెప్టెన్), యెనెమన్ మలన్, క్వింటన్ డి కాక్, ఐడెన్ మార్క్‌రామ్, హెన్రిక్ క్లాసెన్, డేవిడ్ మిల్లర్, వేన్ పార్నెల్, కేశవ్ మహరాజ్, కగిసో రబడ, లుంగి ఎన్‌గిడి, తబ్రేజ్ షమ్సీ, రీజా హెండ్రిక్స్, మార్కో జాన్‌సేన్, ఎన్రిలీ నోర్సెన్, ఫెహ్లుక్వాయో.