
తాజాగా ఐసీసీ ప్రపంచకప్ 2019 లీగ్ దశలో ఇరు జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌లో కోహ్లీ సేన ఘన విజయం సాధించింది.
అయితే ఈ మ్యాచ్‌కు సంబంధించిన వస్తువులను వేలం వేశారు. మ్యాచ్‌లో ఉపయోగించిన టాస్ కాయిన్, బాల్, అధికారిక స్కోర్ షీట్‌లను ఆన్‌లైన్‌లో వేలం వేయగా.. అవి అదిరిపోయే ధరకు అమ్ముడయ్యాయి.
ఈ మ్యాచ్‌లో ఉపయోగించిన కాయిన్ టాస్‌ని రూ.లక్ష(1450 డాలర్లు)కు కొనుగోలు చేయగా.. మ్యాచ్‌లో వాడిన బంతులను రూ.లక్ష 50 వేలకు(2151 డాలర్లు) కొనుగోలు చేశారు. ఇక అధికారిక స్కోర్‌షీట్‌ని వేలం వేయగా.. అది రూ.75 వేలు(1000 డాలర్ల) అమ్ముడు పోయింది. ఇక ఇతర మ్యాచుల్లో వాడిన వస్తువులను వేలం కూడా వేశారు. కానీ అవి చాలా తక్కువ ధరకు అమ్ముడుపోయాయి. ఆస్ట్రేలియా-పాక్ మధ్య జరిగిన మ్యాచ్‌లో వాడిన బంతి 150 డాలర్లకు, సౌతాఫ్రికా-ఆసీస్ మధ్య జరిగిన మ్యాచ్ 300 డాలర్లకు అమ్ముడుపోయాయి.