
India vs Pakistan Match Ticket Rates: శ్రీలంకలో జరగనున్న ఆసియా కప్ మ్యాచ్‌ల కోసం టిక్కెట్ల విక్రయాలు కూడా ప్రారంభమయ్యాయి. టోర్నీలో 4 మ్యాచ్‌లు పాకిస్థాన్‌లో జరగనున్నాయి. అదే సమయంలో శ్రీలంక ఫైనల్‌తో సహా మొత్తం 9 మ్యాచ్‌లు నిర్వహించనున్నారు. సెప్టెంబరు 2న శ్రీలంకలోని పల్లెకెలె స్టేడియంలో భారత్-పాకిస్థాన్ మధ్య గ్రూప్-ఏ మ్యాచ్ కూడా జరగనుంది. ఈ మ్యాచ్ అమ్మకాలు ప్రారంభించిన వెంటనే టిక్కెట్లు విక్రయించడానికి ఎక్కువ సమయం పట్టలేదు. అదే సమయంలో అత్యంత ఖరీదైన మ్యాచ్ టిక్కెట్ ధర వింటే షాక్ అవుతారు.
క్రికెట్ ఫీల్డ్‌లో ఏ దేశంలోనైనా భారత్-పాకిస్థాన్ మధ్య మ్యాచ్ అంటే అభిమానుల్లో కచ్చితంగా క్రేజ్ ఉంటుంది. శ్రీలంకలో జరగనున్న ఈ మ్యాచ్‌కు సంబంధించి కూడా అలాంటిదే కనిపిస్తుంది. ఇక్కడ మొదట ఖరీదైన టిక్కెట్ల అమ్మకం చాలా వేగంగా కనిపించింది. ఈ మ్యాచ్ కోసం అత్యంత ఖరీదైన టిక్కెట్ ధర 300 US డాలర్లుగా నిలిచింది. ఇది రూ.25,000లుగా నిలిచింది.
Pakistan to host Asia Cup after 15 years 🏆✨
🎟️ Get your tickets at https://t.co/HARU9vsaGB#AsiaCup2023 pic.twitter.com/JF7KZoHfg5
— Pakistan Cricket (@TheRealPCB) August 17, 2023
ఈ మ్యాచ్ కోసం అతి తక్కువ టిక్కెట్ ధర 30 US డాలర్లు అంటే రూ.2,500లు. అదే సమయంలో V-VIP, VIP స్టాండ్‌ల టిక్కెట్‌లన్నీ పూర్తిగా అమ్ముడయ్యాయి. వీఐపీ స్టాండ్ టిక్కెట్ ధర దాదాపు రూ.10,500లుగా మారింది. ఆసియా కప్ మ్యాచ్‌ల టిక్కెట్‌లను pcb.bookme.pk వెబ్‌సైట్ నుంచి కొనుగోలు చేయవచ్చు.
India’s squad update for Asia Cup 2023 likely to be announced on 20th August 23.#IndianCricket#TeamIndia #AsiaCup2023 pic.twitter.com/a1gez7tmd7
— Sandeep77 (@Sandeep_Anshu77) August 18, 2023
ఆసియా కప్‌లో సెప్టెంబర్ 2న గ్రూప్-ఏలో పాకిస్థాన్‌తో తొలి మ్యాచ్ ఆడిన భారత్.. సెప్టెంబర్ 4న నేపాల్ జట్టుతో రెండో మ్యాచ్ ఆడాల్సి ఉంది. ఈ మ్యాచ్‌కి కూడా టిక్కెట్ల విక్రయాలు ప్రారంభమయ్యాయి. నేపాల్‌తో జరిగే మ్యాచ్‌కి సంబంధించిన అన్ని V-VIP, VIP స్టాండ్ టిక్కెట్లు పూర్తిగా అమ్ముడయ్యాయి. ఈ మ్యాచ్‌కు అత్యంత ఖరీదైన టికెట్ ధర దాదాపు రూ.4200లుగా నిర్ణయించారు. అదే సమయంలో చౌకైన టిక్కెట్ ధర సుమారు రూ.850లుగా నిలిచింది.
What is the reason for expensive ticket prices?#AsiaCup2023 #SriLanka pic.twitter.com/YoXHezI9CF
— Rajindh Gooneratne (@rajindh_guna) August 18, 2023
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..