India vs New Zealand: నవంబర్ 17 నుంచి న్యూజిలాండ్‌తో ప్రారంభం కానున్న మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్ కోసం ఇండోర్ ఫాస్ట్ బౌలర్ అవేశ్ ఖాన్ భారత జట్టులోకి ఎంపికయ్యాడు. అతనితో పాటు నగరానికి చెందిన వెంకటేష్ అయ్యర్ కూడా జట్టులో ఎంపికయ్యాడు. వీరిద్దరూ ఢిల్లీలో జరుగుతున్న ముస్తాక్ అలీ ట్రోఫీ టోర్నీలో పాల్గొంటున్న సంగతి తెలిసిందే.
కాగా, బుధవారం, అవేష్ ఇండోర్‌కు తిరిగి వచ్చి, మొదట తన గురువుల వద్దకు వెళ్లి ఆశీర్వాదం తీసుకున్నాడు. అవేష్ మొదట ఎంపీ క్రికెట్ అకాడమీ మాజీ కోచ్ అమయ్ ఖురాసియాను కలవడానికి వెళ్లాడు. ఆపై సంజయ్ జగ్దాలే నుంచి ఆశీర్వాదం తీసుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, ‘టీమిండియా జెర్సీ ధరించడం ప్రతి క్రికెటర్ కల అని, దాని కోసం ఎంతగానో కష్టపడ్డాను. ఇప్పటికి నా కల సాకారం కాబోతోంది. ఇది నా కల మాత్రమే కాదు. మానాన్న ఆశ కూడా అని’ అవేష్ ఖాన్ పేర్కొన్నాడు.
‘మా నాన్నకు కూడా క్రికెట్ అంటే ఎంతో ఇష్టం. అందుకే క్రికెట్ ఆడమంటూ నన్ను ప్రోత్సహించాడు. భారత జట్టుకు ప్రాతినిధ్యం వహించాలనేది మా నాన్న కల. ఇప్పటికి ఇది నెరవేరింది’ అంటూ చెప్పుకొచ్చాడు. ఢిల్లీలో జరిగిన ముస్తాక్ అలీ ట్రోఫీ టోర్నీలో పాల్గొని ఇంటికి తిరిగి వచ్చిన తరువాత, ఎమ్మెల్యే మహేంద్ర హార్దియాతో సహా ఆ ప్రాంత వాసులు అవేష్ ఖాన్‌ను సన్మానించారు. నవంబర్ 12న న్యూజిలాండ్‌తో జరిగే సిరీస్‌కు అవేశ్ బయల్దేరనున్న సందర్భంలో శుభాకాక్షంలు తెలిపారు.
న్యూజిలాండ్‌పై యార్కర్, బౌన్సర్‌లతో దాడి చేస్తా..
టీమిండియాకు ఎంపిక చేసినందుకు అమయ్ ఖురాసియా సర్‌కు క్రెడిట్ ఇస్తాను అని అవేష్ ఖాన్ అన్నాడు. ఆయనే నన్ను మధ్యప్రదేశ్ జట్టులోకి ఎంపిక చేశాడు. నా బౌలింగ్‌లో చాలా లోటుపాట్లు ఉన్నాయని, వాటిని స్వయంగా సరిదిద్దాడు. నా ప్రతిభను గుర్తించి భారత జట్టుకు ప్రాతినిధ్యం వహించే సత్తా నాకు ఉందని అమయ్ సార్ చెప్పారు’ అని ఈ బౌలర్ తెలిపాడు.
‘న్యూజిలాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో ఐపీఎల్ లాంటి ప్రదర్శనను కొనసాగిస్తాను. భారత్‌లోని పిచ్‌లు ఫాస్ట్ బౌలర్లకు అనుకూలంగా లేనప్పటికీ, న్యూజిలాండ్‌పై యార్కర్లు, బౌన్సర్లు నాకు విజయాన్ని అందిస్తాయంటూ’ పేర్కొన్నాడు.
2017లో ఐపీఎల్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తరపున అరంగేట్రం చేసిన అవేష్ ఖాన్.. ఇప్పటి వరకు 25 మ్యాచులు ఆడాడు. ఇందులో 8.23 ఎకానమీ రేటుతో 29 వికెట్లు పడగొట్టాడు. అంతకుముందు 2016 అండర్-19 ప్రపంచ కప్‌లో మెంబర్‌గా ఉన్నాడు.
Also Read: IPL 2022: ధోని స్థానాన్ని భర్తీ చేసేది అతడే.! వచ్చే ఏడాది సీఎస్‌కే రిటైన్ చేసే ఆటగాళ్లు వీరే.!