IND vs NZ 1st Test: రెండో రోజు న్యూజిలాండ్‌దే ఆధిపత్యం.. తేలిపోయిన టీమిండియా బౌలర్లు..

|

Nov 26, 2021 | 5:29 PM

IND vs NZ 1st Test: భారత్‌, న్యూజిలాండ్ జట్ల మధ్య జరుగుతున్న తొలి టెస్ట్ రెండో రోజు ఆట ముగిసింది. తొలి రోజు టీమిండియా తమ ఆధిపత్యాన్ని ప్రదర్శిస్తే.. రెండో రోజు న్యూజిలాండ్‌ తన సత్తా చాటింది...

IND vs NZ 1st Test: రెండో రోజు న్యూజిలాండ్‌దే ఆధిపత్యం.. తేలిపోయిన టీమిండియా బౌలర్లు..
Ind Vs Nz
Follow us on

IND vs NZ 1st Test: భారత్‌, న్యూజిలాండ్ జట్ల మధ్య జరుగుతున్న తొలి టెస్ట్ రెండో రోజు ఆట ముగిసింది. తొలి రోజు టీమిండియా తమ ఆధిపత్యాన్ని ప్రదర్శిస్తే.. రెండో రోజు న్యూజిలాండ్‌ తన సత్తా చాటింది. రెండో రోజు ఆట ముగిసే సమయానికి వికెట్ నష్టపోకుండా 129 పరుగులు సాధించింది. దీంతో కివీస్‌ ఓపెనర్ల వికెట్‌ను తీయడానికి ప్రయత్నించిన భారత బౌలర్ల ప్రయత్నాలు విఫలమయ్యాయి. పేస్‌, స్పిన్నర్‌ అనే తేడా లేకుండా అందరినీ కివీస్‌ ఓపెనర్లు ధీటుగా ఎదుర్కొన్నారు. ఈ క్రమంలోనే టామ్‌ లాథమ్‌ (50), విల్ యంగ్‌ (75)లు కొనసాగుతున్నారు. మొదట్లో కాస్త ఆచితూచి ఆడిన ఈ ఓపెనర్లు అర్థ శతకం పూర్తి చేసుకున్న తర్వాత అవకాశం దొరికినప్పుడల్లా బౌండరీలు, డబుల్స్‌ సాధిస్తూ జట్టు స్కోరును పెంచారు. ఇదిలా ఉంటే కివీస్‌ ప్రస్తుతం 216 పరుగుల వెనుకబడి ఉంది.

ఇక అంతకు ముందు 258/4 ఓవర్‌ నైట్‌ స్కోరుతో మ్యాచ్‌ ప్రారంభించిన టీమిండియా 345 పరగులకు ఆలౌటైంది. నిజానికి ఎక్కువ స్కోర్‌ చేసే అవకాశం ఉన్నా కివీస్‌ బౌలర్ల ధాటికి టీమిండియా ప్లేయర్స్‌ పెవిలియన్‌ బాటపట్టారు. కేవలం 87 పరుగులకే ఆరు వికెట్లు కోల్పోయింది. ఇదిలా ఉంటే భారత బ్యాట్స్‌మెన్స్‌లలో శ్రేయస్‌ అయ్యర్‌ అద్భుతంగా రాణించి సెంచరీతో రాణించాడు. 171 బంతుల్లో 105 పరుగులు సాధించి కీలక ఇన్నింగ్స్‌ ఆడాడు. ఇక రవీంద్ర జడేజా (50), శుభమ్‌ గిల్‌ (52) పరుగులతో మంచి ఇన్నింగ్స్‌ ఆడారు.

Also Read: ZSI Recruitment 2021: జూలాజికల్‌ సర్వే ఆఫ్‌ ఇండియాలో రీసెర్చ్‌ ఫెలో ఉద్యోగాలు.. ఎలా దరఖాస్తు చేసుకోవాలంటే..

PM Gati Shakti: భారతదేశ గతిని మార్చేసే పీఎం గతి శక్తి మాస్టర్ ప్లాన్ రెడీ.. ఎన్ని ప్రాజెక్టులు రానున్నాయంటే?

Inspiration: కూలీ కొడుకు నీట్ కొట్టాడు.. ఆ గ్రామంలో తొలి డాక్టర్ కాబోతున్నాడు