IND vs ENG: సెమీస్‌లో ఇంగ్లండ్‌ను చిత్తు చేసిన భారత్.. 10 ఏళ్ల తర్వాత ఫైనల్‌ పోరుకు

10 ఏళ్ల తర్వాత టీ-20 ప్రపంచకప్‌లో టీమిండియా ఫైనల్‌కు చేరుకుంది. భారత జట్టు మూడోసారి ఫైనల్‌కు చేరుకుంది. డిఫెండింగ్ ఛాంపియన్ ఇంగ్లండ్‌పై భారత్ 68 పరుగుల తేడాతో విజయం సాధించింది. దీంతో రోహిత్ శర్మ సారథ్యంలోని టీమిండియా 2022 టీ20 ప్రపంచకప్ ఓటమికి ప్రతీకారం తీర్చుకుంది. ఈ జట్టు చివరిసారిగా 2014లో ఫైనల్‌కు చేరుకుంది.

IND vs ENG: సెమీస్‌లో ఇంగ్లండ్‌ను చిత్తు చేసిన భారత్.. 10 ఏళ్ల తర్వాత ఫైనల్‌ పోరుకు
Ind Vs Eng
Follow us

|

Updated on: Jun 28, 2024 | 2:53 AM

10 ఏళ్ల తర్వాత టీ-20 ప్రపంచకప్‌లో టీమిండియా ఫైనల్‌కు చేరుకుంది. భారత జట్టు మూడోసారి ఫైనల్‌కు చేరుకుంది. డిఫెండింగ్ ఛాంపియన్ ఇంగ్లండ్‌పై భారత్ 68 పరుగుల తేడాతో విజయం సాధించింది. దీంతో రోహిత్ శర్మ సారథ్యంలోని టీమిండియా 2022 టీ20 ప్రపంచకప్ ఓటమికి ప్రతీకారం తీర్చుకుంది. ఈ జట్టు చివరిసారిగా 2014లో ఫైనల్‌కు చేరుకుంది.

గయానాలోని ప్రొవిడెన్స్ స్టేడియంలో ఇంగ్లండ్ కెప్టెన్ జోస్ బట్లర్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్నాడు. రోహిత్ శర్మ అర్ధసెంచరీతో ఇంగ్లండ్‌కు 172 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించిన టీమ్‌ఇండియా, ఆపై కుల్దీప్, అక్షర్‌ల బౌలింగ్‌తో ఇంగ్లిష్‌ జట్టును 16.4 ఓవర్లలో 103 పరుగులకే పెవిలియన్‌కు పంపింది.

కుల్దీప్ యాదవ్, అక్షర్ పటేల్ కలిసి 6 మంది బ్యాట్స్‌మెన్‌లను పెవిలియన్‌కు పంపారు. ఫిల్ సాల్ట్, జోఫ్రా ఆర్చర్‌లను జస్ప్రీత్ బుమ్రా అవుట్ చేశాడు. ఇద్దరు బ్యాటర్లు రనౌట్ అయ్యారు.

జట్లు:

భారత్ (ప్లేయింగ్ XI): రోహిత్ శర్మ(కెప్టెన్), విరాట్ కోహ్లీ, రిషబ్ పంత్(కీపర్), సూర్యకుమార్ యాదవ్, శివమ్ దూబే, హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, అర్ష్‌దీప్ సింగ్, జస్ప్రీత్ బుమ్రా.

ఇంగ్లండ్ (ప్లేయింగ్ XI): ఫిలిప్ సాల్ట్, జోస్ బట్లర్(కెప్టెన్, కీపర్), జానీ బెయిర్‌స్టో, హ్యారీ బ్రూక్, మొయిన్ అలీ, లియామ్ లివింగ్‌స్టోన్, సామ్ కర్రాన్, క్రిస్ జోర్డాన్, జోఫ్రా ఆర్చర్, ఆదిల్ రషీద్, రీస్ టోప్లీ.