స్వీట్ రివేంజ్‌తో రోహిత్ రికార్డుల వర్షం

TV9 Telugu

25 June 2024

టీమిండియా తరుపున కెప్టెన్ రోహిత్ శర్మ అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. 19 బంతుల్లో అర్ధ సెంచరీ పూర్తి చేసిన అతను ఓవరాల్ గా 41 బంతుల్లో 92 పరుగులు చేశాడు. తన ఇన్నింగ్స్‌లో 8 సిక్సర్లు కొట్టాడు.

రోహిత్ విశ్వరూపం

నవంబర్ 19న ఆస్ట్రేలియాతో జరిగిన వన్డే ప్రపంచకప్ ఫైనల్‌లో భారత జట్టు ఓటమి పాలైంది. ప్రతి భారతీయ అభిమానితో పాటు కెప్టెన్ రోహిత్ శర్మ బాధను అనుభవిస్తున్నాడు.

ఇప్పటికీ ఓటమి బాధ

అందుకే ఆ ఫైనల్ ఓటమి తర్వాత ఆస్ట్రేలియాతో జరిగిన తొలి పోరులో రోహిత్ ఆగ్రహం కట్టలు తెంచుకుంది. దీంతో ఆసీస్‌తో జరిగిన మ్యాచ్‌లో వీర విహారం చేశాడు.

పగ తీర్చుకున్న రోహిత్

టీ20 ప్రపంచకప్‌లో ఆస్ట్రేలియాతో జరిగిన సూపర్-8 మ్యాచ్‌లో రోహిత్ శర్మ వచ్చిన వెంటనే అద్భుతంగా బ్యాటింగ్ చేసి సిక్సర్లు బాది విధ్వంసం సృష్టించాడు.

రోహిత్ సిక్సర్లు

రోహిత్ మూడో ఓవర్‌లో మిచెల్ స్టార్క్‌పై 4 సిక్సర్లు, 1 ఫోర్ కొట్టి 29 పరుగులు కొల్లగొట్టాడు. దీనితో T20 ఇంటర్నేషనల్‌లో ప్రత్యేక స్థానాన్ని సాధించాడు.

సిక్సర్ల సునామీ

టీ20 ప్రపంచకప్‌లో 200 సిక్సర్లు బాదిన తొలి బ్యాట్స్‌మెన్‌గా భారత కెప్టెన్ రోహిత్ నిలిచాడు. అతని తర్వాత న్యూజిలాండ్‌కు చెందిన మార్టిన్ గప్టిల్ (173) రెండో స్థానంలో ఉన్నాడు.

200 సిక్సర్ల రికార్డు

ఇది మాత్రమే కాదు, రోహిత్ తన హాఫ్ సెంచరీని కేవలం 19 బంతుల్లో పూర్తి చేశాడు. ఇది ఈ ప్రపంచ కప్‌లో ఏ ఆటగాడు చేసిన వేగవంతమైన అర్ధ సెంచరీగా నిలిచింది.

వేగవంతమైన హాఫ్ సెంచరీ

రోహిత్ తన 8వ సిక్స్ కొట్టిన వెంటనే, టీ20 ప్రపంచకప్‌లో భారత్ తరపున ఒక ఇన్నింగ్స్‌లో అత్యధిక సిక్సర్లు బాదిన యువరాజ్ సింగ్ (7) రికార్డును కూడా బద్దలు కొట్టాడు. చివరకు 92 పరుగుల వద్ద ఔటయ్యాడు.

యువీని వెనక్కు నెట్టేశాడు