సానియాతో పెళ్లి రూమర్లు.. ఇన్‌‌స్టాలో షమీ కీలక పోస్ట్

TV9 Telugu

28 June 2024

సానియా మీర్జాతో తన నిశ్చితార్థం గురించి పుకార్ల కారణంగా వార్తల్లో నిలిచిన భారత ఫాస్ట్ బౌలర్ మహమ్మద్ షమీ తన కోరిక గురించి చెప్పుకొచ్చాడు.

షమీ కోరిక!

షమీ తన ఈ కోరికను ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్ ద్వారా పేర్కొన్నాడు. దీంతో ఈ పోస్ట్‌పై అభిమానులు కామెంట్లు చేస్తున్నారు. 

ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్

టీ20 ప్రపంచకప్ 2024లో టీమ్ ఇండియా ఫైనల్‌కు చేరుకోవడం పట్ల షమీ చాలా సంతోషంగా ఉన్నాడు. ఇక, ఇప్పుడు టైటిల్‌పై తన కోరికను బయటపెట్టాడు.

ఐసీసీ టైటిల్‌పై కోరిక

ఇప్పుడు మనం ట్రోఫీని గెలుచుకోవడానికి చాలా దగ్గరగా ఉన్నామని షమీ ఇన్‌స్టాగ్రామ్‌లో రాసుకొచ్చాడు. జై హింద్ అంటూ తెలిపాడు. 

ట్రోఫీకి చాలా దగ్గరగా ఉన్నాం

గాయం కారణంగా షమీ ప్రస్తుతం టీమ్ ఇండియాకు దూరంగా ఉన్నాడు. టీ20 ప్రపంచకప్ జట్టుకు కూడా దూరంగా ఉన్నాడు.

గాయంతో దూరం

అయితే, ఇటీవల తన పోస్ట్‌లలో ఒకదాని ద్వారా అతను గాయం నుంచి కోలుకోవడం గురించి సమాచారాన్ని పంచుకున్నాడు. 

గాయం నుంచి కోలుకున్న షమీ

2023 వన్డే ప్రపంచ కప్‌లో షమీ టీమ్ ఇండియాలో భాగమయ్యాడు. ఇప్పుడు టీమ్‌ఇండియా మరో ఐసీసీ ఫైనల్‌కు చేరుకోవడం పట్ల చాలా సంతోషంగా ఉన్నాడు. 

వన్డే ప్రపంచకప్‌ ఆడిన షమీ

సానియాతో పెళ్లి రూమర్లపై షమీ నుంచి ఎటువంటి రియాక్షన్ లేదు. ప్రస్తుతం గాయంపై పని చేస్తూ.. భారత జట్టులోకి రీ ఎంట్రీ ఇచ్చేందుకు రెడీ అవుతున్నాడు.

సానియా పెళ్లిపై నో కామెంట్స్