బార్బడోస్‌లో భారీ వర్షం.. మ్యాచ్ రద్దయితే ట్రోఫీ ఎవరు గెలుస్తారు?
TV9 Telugu
29 June 2024
T20 వరల్డ్ కప్ 2024 చివరి మ్యాచ్ బార్బడోస్‌లో భారత్ వర్సెస్ దక్షిణాఫ్రికా మధ్య జరగనుంది. ట్రోఫీ కోసం ఎదురుచూస్తున్న 2 జట్ల మధ్య మ్యాచ్ జరగనుంది.
ఇలాంటి పరిస్థితుల్లో వర్షం కురిస్తే ప్రపంచ ఛాంపియన్‌ను ఎంపిక చేసేందుకు ఐసీసీ ఎలాంటి నిబంధనలు రూపొందించిందన్న ప్రశ్న తలెత్తుతోంది.
మ్యాచ్‌కు ముందు, అంటే జూన్ 28వ తేదీ రాత్రి బార్బడోస్‌లో భారీ వర్షం కురిసింది. కొంతమంది స్పోర్ట్స్ జర్నలిస్టులు ఈ సమాచారాన్ని అందించారు.
జూన్ 29న కూడా వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఈ మ్యాచ్‌లో వర్షం పడే ప్రమాదం 70 శాతం ఉంది. దీంతో మ్యాచ్ జరగడంపై అనుమానాలు వస్తున్నాయి.
దక్షిణాఫ్రికా, ఆఫ్ఘనిస్తాన్ మధ్య జరిగిన మొదటి సెమీ-ఫైనల్ కోసం ICC రిజర్వ్ డే ఉంచింది. భారత్, ఇంగ్లండ్ మధ్య రెండో సెమీఫైనల్‌కు రిజర్వ్ డే లేదు.
అయితే, ఈ మ్యాచ్‌లో ICC గేమ్‌ను పూర్తి చేయడానికి 240 నిమిషాల అదనపు సమయాన్ని అంటే 4 గంటల 10 నిమిషాలు ఉంచింది.
ఫైనల్‌కు జూన్ 30ని రిజర్వ్ డేగా ఉంచారు. జూన్ 29న వర్షం ఆగకపోతే ఫైనల్ మ్యాచ్ కోసం అభిమానులు మరో రోజు వేచి చూడక తప్పదు.
బార్బడోస్ వాతావరణ శాఖ ప్రకారం జూన్ 30న వర్షం ఆగిపోవచ్చు. ఒకవేళ ఫైనల్ రద్దు చేయాల్సి వస్తే.. ఇరు జట్లను ఉమ్మడి విజేతలుగా ప్రకటిస్తారు.
ఇక్కడ క్లిక్ చేయండి..