మూడో టీ20: టీమిండియాలో కీలక మార్పు.. తుది జట్టులోకి రోహిత్ శర్మ.. ఆ స్టార్ ప్లేయర్‎పై వేటు.!

|

Mar 16, 2021 | 3:44 PM

India Vs England: భారత్, ఇంగ్లాండ్ మధ్య జరుగుతోన్న ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్ రసవత్తరంగా మారుతోంది. ఇప్పటికే ఇరు జట్లూ 1-1తో సిరీస్ సమం చేయగా..

మూడో టీ20: టీమిండియాలో కీలక మార్పు.. తుది జట్టులోకి రోహిత్ శర్మ.. ఆ స్టార్ ప్లేయర్‎పై వేటు.!
Follow us on

India Vs England: భారత్, ఇంగ్లాండ్ మధ్య జరుగుతోన్న ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్ రసవత్తరంగా మారుతోంది. ఇప్పటికే ఇరు జట్లూ 1-1తో సిరీస్ సమం చేయగా.. మూడో మ్యాచ్ ఇవాళ రాత్రి 7 గంటలకు అహ్మదాబాద్‎లోని మొతేరా స్టేడియం వేదికగా జరగనుంది. ఇదిలా ఉంటే కరోనా వైరస్ ప్రభావం కారణంగా మిగతా మూడు టీ20లకు బీసీసీఐ ప్రేక్షకులను అనుమతించలేదు. ఏది ఏమైనా ఈ మ్యాచ్ గెలిచేందుకు ఇరు జట్లూ నెట్స్‎లో విపరీతమైన శ్రమించాయి. ఈ క్రమంలోనే టీమిండియా, ఇంగ్లాండ్ తుది జట్టు కూర్పు విషయానికి వస్తే.. ఈ మ్యాచ్‎లో కెప్టెన్ విరాట్ కోహ్లీ  ప్లేయింగ్ ఎలెవన్‎లో కీలక మార్పు చేయనున్నట్లు తెలుస్తోంది.

వాస్తవానికి, తొలి టీ 20 మ్యాచ్‎కు ముందు రోహిత్ శర్మ, కేఎల్ రాహుల్ ఓపెనర్లగా బరిలోకి దిగుతారని.. శిఖర్ ధావన్ రిజర్వ్ ఓపెనర్ అని కెప్టెన్ కోహ్లీ పోస్ట్ మ్యాచ్ ప్రెసెంటేషన్‎లో వెల్లడించాడు. అయితే ఆ తర్వాత తొలి రెండు మ్యాచ్‎లకు రోహిత్ శర్మ లేకపోవడం ప్రేక్షకులను ఆశ్చర్యానికి గురి చేసింది.

ఇక మొదటి మ్యాచ్‎లో ఓపెనింగ్ జోడిగా బరిలోకి దిగిన కేఎల్ రాహుల్, శిఖర్ ధావన్ పేలవ ఫామ్‎తో నిరాశపరిచారు. ఇక రెండో మ్యాచ్‎లో ధావన్‎ను తొలగించి.. ఇషాన్ కిషన్‎ ఓపెనర్‎గా రావడమే కాకుండా అర్ధ సెంచరీతో అదరగొట్టాడు. అయితే కేఎల్ రాహుల్ మాత్రం మరోసారి నిరాశపరిచాడు. దీనితో మూడో మ్యాచ్‎లో కీలక మార్పు చేసేందుకు విరాట్ కోహ్లీ, టీమ్ మేనేజ్‎మెంట్ సిద్ధమైంది.

రాహుల్ ఔట్.. రోహిత్ శర్మ ఇన్…

రెగ్యులర్ టీ20 ఓపెనర్, హిట్‎మ్యాన్ రోహిత్ శర్మను బరిలోకి దింపేందుకు టీమిండియా సిద్ధమైంది. కేఎల్ రాహుల్ స్థానంలో అతడు తుది జట్టులోకి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ మార్పుతో పాటు పేసర్ శార్దూల్ ఠాకూర్ స్థానంలో అక్షర్ పటేల్‎ను తిరిగి తీసుకోనున్నట్లు తెలుస్తోంది. ఈ రెండు మార్పులు టీమిండియాలో ఉండే అవకాశం కనిపిస్తోంది. యధావిధిగా మరో ఓపెనర్‎గా ఇషాన్ కిషన్, కోహ్లీ తర్వాత శ్రేయాస్ అయ్యర్, సూర్యకుమార్ యాదవ్, రిషబ్ పంత్, హార్దిక్ పాండ్యాలు బరిలోకి దిగుతారు.

టీమిండియా జట్టు(అంచనా): రోహిత్ శర్మ, ఇషాన్ కిషన్, విరాట్ కోహ్లీ, రిషబ్ పంత్, శ్రేయాస్ అయ్యర్, సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్యా, యుజ్వేంద్ర చాహల్, వాషింగ్టన్ సుందర్, భువనేశ్వర్ కుమార్, అక్షర్ పటేల్

ఇంగ్లాండ్ జట్టు(అంచనా): జాసన్ రాయ్, జోస్ బట్లర్, డేవిడ్ మాలన్, జానీ బెయిర్ స్టో, బెన్ స్టోక్స్, ఇయాన్ మోర్గాన్, సామ్ కరన్, టామ్ కరన్, జోర్డాన్, ఆర్చర్, రషీద్

మరిన్ని ఇక్కడ చదవండి:

తెలుగు రాష్ట్రాల ప్రయాణీకులు ముఖ్య గమనిక…పలు ట్రైన్స్ దారి మళ్లింపు.. వివరాలివే!

కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఊరట.. పదవీ విరమణ రోజే పెన్షన్ బెనిఫిట్స్.. వివరాలు ఇవే.!

చుట్టూ భారీ అనకొండలు.. వాటితో ఆటలు.. ఇంతలోనే ఊహించని సంఘటన.. గగుర్పొడిచే వీడియో.!