AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IND vs ENG: నరాలు తెగే ఉత్కంఠ.. చివరి టెస్టులో విజయం ఎవరిదంటే..?

భారత్-ఇంగ్లాండ్ మధ్య ఓవల్‌లో జరిగిన ఉత్కంఠభరిత టెస్ట్ మ్యాచ్‌లో ఇంగ్లాండ్ విజయం సాధించింది. భారత బౌలర్లు అద్భుతమైన ప్రదర్శనతో ఇంగ్లాండ్‌ను తక్కువ స్కోర్‌కు పరిమితం చేశారు. యశస్వి జైస్వాల్, ఆకాశ్ దీప్, జడేజా, సుందర్ వంటి ఆటగాళ్ళు బ్యాటింగ్‌లో రాణించారు. చివరి రోజు వర్షం కారణంగా ఆట నిలిచిపోయింది, అయితే భారత బౌలర్ల పోరాటం విశేషంగా గుర్తుండిపోతుంది.

IND vs ENG: నరాలు తెగే ఉత్కంఠ.. చివరి టెస్టులో విజయం ఎవరిదంటే..?
Siraj 2
SN Pasha
|

Updated on: Aug 04, 2025 | 4:34 PM

Share

భారత్‌, ఇంగ్లాండ్‌ మధ్య లండన్‌లోని ఓవల్‌ గ్రౌండ్‌లో జరిగిన చివరి టెస్టు నరాలు తెగే ఉత్కంఠ మధ్య ముగిసింది. ఈ మ్యాచ్‌లోను ఇంగ్లాండ్‌ సునాయాసంగా గెలిచేస్తుంది అనుకున్నప్పటికీ.. భారత బౌలర్లు అ‍ద్భుతం చేశారు. టీమిండియాను 6 పరుగుల తేడాతో గెలిపించారు. టెస్టుల క్రికెట్ చరిత్రలోనే ఇంత తక్కువ తేడాతో గెలవడం ఇదే తొలిసారి. ఈ మ్యాచ్‌లో తొలి ఇన్నింగ్స్‌ లో 224 పరుగులకు టీమిండియా ఆలౌట్‌ అయింది. వెటరన్‌ క్రికెటర్‌ కరుణ్‌ నాయర్‌ హాఫ్‌ సెంచరీతో రాణించాడు. మిగతా ఆటగాళ్లు అంతగా ఆకట్టుకోలేదు. ఇక ఇంగ్లాండ్‌ తమ తొలి ఇన్నింగ్స్‌ను అగ్రెసివ్‌గా స్టార్ట్‌ చేసినా.. ఆ తర్వాత భారత బౌలర్లు పుంజుకొని.. ఇంగ్లండ్‌ను సైతం 247 పరుగులకే ఆలౌట్‌ చేశారు.

భారత బౌలర్లలో మొహమ్మద్‌ సిరాజ్‌ 4, ప్రసిద్ధ్‌ కృష్ణ 4 వికెట్లతో రాణించారు. ఆ తర్వాత రెండో ఇన్నింగ్స్‌కు టీమిండియా 396 పరుగుల మంచి స్కోర్‌ చేసి.. ఇంగ్లాండ్‌కు ఫైటింగ్‌ టార్గెట్‌ ఇచ్చింది. రెండో ఇన్నింగ్స్‌లో భారత ఓపెనర్‌ యశస్వి జైస్వాల్‌ 118, ఆకాశ్‌ దీప్‌ 66, రవీంద్ర జడేజా 53, వాషింగ్టన్‌ సుందర్‌53 పరుగులతో అద్భుతంగా ఆడాడు. ఆ తర్వాత ఇంగ్లాండ్‌ రెండో ఇన్నింగ్స్‌లో మంచి బ్యాటింగ్‌ చేస్తూ.. నాలుగో రోజే మ్యాచ్‌ ముగిస్తుందని అంతా అనుకున్నారు. కానీ, వర్షం కారణంగా నాలుగో రోజు ఆట త్వరగా ముగిసింది. అప్పటికీ ఇంగ్లాండ్‌కు కేవలం 35 పరుగులు మాత్రమే కావాలి. చేతిలో కావాల్సినన్ని వికెట్లు ఉన్నాయి. అయినా కూడా భారత బౌలర్లు అద్భుతంగా పోరాడారు. భారత బౌలర్లలో మొహమ్మద్‌ సిరాజ్‌ ఐదు వికెట్లతో చెలరేగాడు.

మరిన్ని క్రికెట్‌ వార్తల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి..