India vs England T20 Series:టెస్ట్ సిరీస్ గెలిచిన టీమిండియా ఆ తరువాత ఇప్పుడు ఇంగ్లాండ్‌తో ఐదు టీ 20 మ్యాచ్ల సిరీస్ జరుగనుంది. ఇదిలావుంటే.. టీ20 సిరీస్‌కు ముందే టీమిండియాకు ఇది బ్యాడ్ న్యూస్ వినిపించింది. ఫిట్‌నెస్ పరీక్షలో లెగ్ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి విఫలమయ్యాడు. అతను రెండోసారి నిర్వహించిన యో-యో పరీక్షల్లో కూడా సక్కెస్ కాలేక పోయాడు. అందుకే శుక్రవారం నుంచి ఇంగ్లండ్‌తో జరిగే ఐదు టీ 20 ఇంటర్నేషనల్ సిరీస్‌లో జట్టులో చోటు దక్కించుకోలేక పోయాడు.
ఇదిలావుంటే.. వరుణ్‌తో పాటు, ఫాస్ట్ బౌలర్ టి.నటరాజన్ గాయంతో బాధపడ్డాడు. ఇంగ్లాండ్‌తో పొట్టి సిరీస్‌లో భారత యువ బౌలర్ నటరాజన్ ఆడేది అనుమానంగా మారింది. మోకాలితో పాటు భుజం గాయంతో అతడు బాధపడుతున్నట్లు జాతీయ క్రికెట్ అకాడమీ(NCA) వర్గాలు పేర్కొన్నాయి.
భారత యువ బౌలర్ టి.నటరాజన్ ఇంగ్లాండ్‌తో టీ20 సిరీస్‌కు దూరమయ్యే అవకాశాలా చాలా కనిపిస్తున్నాయి. మోకాలి, భుజం గాయాల కారణంగా అతడు సిరీస్‌లో ఆడేదానిపై ఇంత వరకు క్లారిటీ రాలేదు. దాదాపుగా ఆడకపోవచ్చని అంటున్నారు. గత ఆస్ట్రేలియా సిరీస్‌లో అద్భుతమైన ప్రదర్శన చేసిన నట్టూ. ఈ గాయాల కారణంగా కొంత కాలం రెస్ట్ తీసుకునే అవకాశం ఉంది. నటరాజన్ మోకాలి, భుజం గాయంతో బాధపడుతున్నాడు. అతడు ఇంగ్లాండ్‌తో టీ20 సిరీస్‌లో ఆడేది అనుమానంగా మారింది అని జాతీయ క్రికెట్ అకాడమీ వర్గాలు అంటున్నాయి.
యో-యో పరీక్షలో వరుణ్ అధిగమించలేకపోయాడు. దీంతో అతని స్థానంలో రాహుల్ చాహర్‌ను ఆడించే అవకాశాలు కనిపిస్తున్నాయి. హార్దిక్ పాండ్య సైతం టీ20లకు పూర్తి స్థాయిలో సన్నద్ధమని ప్రకటించాడు. అతడు బ్యాటింగ్, బౌలింగ్ చేస్తున్న వీడియోను ట్విట్టర్లో పోస్టు చేశాడు.
Preparation done ✅??
Can’t wait to get on the field on 12th ? pic.twitter.com/Nyr6Bys2EF— hardik pandya (@hardikpandya7) March 9, 2021