IND vs ENG: ఐర్లాండ్‌లో అవమానానికి ఇంగ్లాడ్‌లో ప్రతీకారం.. ఫుల్ షెడ్యూల్ ఇదే.. ఫ్రీగా ఎక్కడ చూడాలంటే?

India vs England T20 schedule: ఐర్లాండ్ చేతిలో తిన్న దెబ్బ నుంచి టీమిండియా ఎంత త్వరగా కోలుకుంటే అంత మంచిది. పాత తప్పులను పక్కన పెట్టి, ఇంగ్లాండ్ పిచ్‌లపై సరికొత్త వ్యూహాలతో దూకుడు ప్రదర్శిస్తేనే భారత్ తన నెంబర్ వన్ స్థానాన్ని కాపాడుకోగలదు. మరి ఈ ప్రతిష్టాత్మక సిరీస్‌లోనైనా మన ఆటగాళ్లు పూర్వ వైభవాన్ని అందుకుంటారో లేదో చూడాలి.

IND vs ENG: ఐర్లాండ్‌లో అవమానానికి ఇంగ్లాడ్‌లో ప్రతీకారం.. ఫుల్ షెడ్యూల్ ఇదే.. ఫ్రీగా ఎక్కడ చూడాలంటే?
Ind Vs Eng T20i

Updated on: Jun 29, 2026 | 7:21 PM

ప్రపంచ నెంబర్ వన్ టీ20 జట్టుగా మురిసిపోతున్న భారత క్రికెట్ జట్టుకు పసికూన ఐర్లాండ్ ఊహించని షాక్ ఇచ్చింది. చివరి మ్యాచ్‌లో కేవలం ఒక్క పరుగు తేడాతో ఓడిపోయి సిరీస్‌ను కోల్పోవడం అభిమానులను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. ఈ ఘోర పరాభవం తర్వాత టీమిండియా వెంటనే ఇంగ్లాండ్‌తో ఐదు టి20ల సిరీస్‌కు సిద్ధమవుతోంది.

మూడేళ్ల విజయ పరంపరకు బ్రేక్.. ఐర్లాండ్ గడ్డపై అవమానకర క్లీన్ స్వీప్..!

బెల్‌ఫాస్ట్ వేదికగా ఆదివారం రాత్రి ఉత్కంఠభరితంగా జరిగిన చివరి టి20 మ్యాచ్‌లో భారత జట్టు కేవలం ఒక్క పరుగు తేడాతో ఓడిపోయింది. దీంతో ఆతిథ్య ఐర్లాండ్ జట్టు టి20 సిరీస్‌ను కైవసం చేసుకుని సరికొత్త చరిత్ర సృష్టించింది. గత మూడేళ్లుగా టీ20 సిరీస్‌లలో ఓటమనేదే ఎరుగని భారత ఆధిపత్యానికి ఈ ఓటమితో తెరపడింది. గతంలో 2019లో ఆస్ట్రేలియా చేతిలో భారత్ ఇలా వైట్ వాష్‌కు గురికాగా, మళ్లీ ఇన్నాళ్లకు టీ20ల్లో పెద్దగా రికార్డు లేని ఐర్లాండ్ చేతిలో క్లీన్ స్వీప్ అవ్వడం భారత క్రికెట్ చరిత్రలోనే ఒక అవమానకరమైన రికార్డుగా మిగిలిపోనుంది.

అభిమానుల్లో ఆందోళన.. ఇంగ్లాండ్ పర్యటనపై నీలినీడలు..!

ఐర్లాండ్ వంటి చిన్న జట్టుతోనే ఇంత దారుణంగా ఆడితే, ఇక ప్రపంచంలోనే అత్యంత బలమైన జట్లలో ఒకటైన ఇంగ్లాండ్‌ను వారి సొంత గడ్డపై ఎలా ఎదుర్కొంటారనే ఆందోళన అభిమానుల్లో వ్యక్తమవుతోంది. కేవలం రెండు రోజుల వ్యవధిలోనే భారత జట్టు ఇంగ్లాండ్‌తో ఐదు మ్యాచ్‌ల టి20 సిరీస్‌లో తలపడాల్సి ఉంది. ఈ నేపథ్యంలో అసలు మ్యాచ్‌లు ఎప్పుడు జరుగుతాయి, ఎక్కడ జరుగుతాయి అనే విషయాలపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.

భారత్ వర్సెస్ ఇంగ్లాండ్ టి20 సిరీస్ పూర్తి షెడ్యూల్:

రాబోయే ప్రతిష్టాత్మక ఇంగ్లాండ్ పర్యటనకు సంబంధించిన ఐదు టీ20 మ్యాచ్‌ల పూర్తి వివరాలు ఈ కింది విధంగా ఉన్నాయి:

తొలి టీ20 మ్యాచ్: జులై 1వ తేదీన చెస్టర్ లీ స్ట్రీట్ వేదికగా జరుగుతుంది.

రెండో టీ20 మ్యాచ్: జులై 4వ తేదీన మాంచెస్టర్ వేదికగా నిర్వహిస్తారు.

మూడో టీ20 మ్యాచ్: జులై 7వ తేదీన నాటింగ్హామ్ వేదికగా జరుగుతుంది.

నాలుగో టీ20 మ్యాచ్: జులై 9వ తేదీన బ్రిస్టల్ వేదికగా సాగుతుంది.

ఐదో టీ20 మ్యాచ్: జులై 11వ తేదీన సౌతాంప్టన్ వేదికగా చివరి మ్యాచ్ జరగనుంది.

మ్యాచ్ సమయాలు, ఉచిత ప్రత్యక్ష ప్రసార వివరాలు..

ఈ సిరీస్‌లోని మ్యాచ్ సమయాల విషయానికి వస్తే అభిమానులు కొంచెం అప్రమత్తంగా ఉండాలి. మాంచెస్టర్‌లో జరిగే రెండో టీ20, సౌతాంప్టన్‌లో జరిగే ఐదో టీ20 మ్యాచ్‌లు భారత కాలమానం ప్రకారం రాత్రి 7:00 గంటలకు ప్రారంభమవుతాయి. అయితే మిగిలిన మూడు టీ20 మ్యాచ్‌లు మాత్రం రాత్రి 10:00 గంటలకు ప్రారంభం కానున్నాయి. ఈ టీ20 సిరీస్ ముగిసిన వెంటనే జులై 14 నుంచి మూడు వన్డేల సిరీస్ కూడా ప్రారంభం కానుంది. ఈ మ్యాచ్‌లను టీవీల్లో చూడాలనుకునే వారు స్టార్ స్పోర్ట్స్ నెట్‌వర్క్‌లో వీక్షించవచ్చు. మొబైల్ లేదా ఓటిటిలో చూడాలనుకునే వారు జియో సినిమా లేదా హాట్‌స్టార్ ద్వారా చూడవచ్చు. ముఖ్యంగా జియో సిమ్ వాడుతున్న వినియోగదారులు ఈ మ్యాచ్‌లను పూర్తిగా ఉచితంగా ఆస్వాదించవచ్చు.

Follow Us