ఐపీఎల్ 2023 కౌంట్ డౌన్ ప్రారంభమైంది. మహిళల ప్రీమియర్ లీగ్ తర్వాత, IPL 2023 ఈ నెలాఖరులో ప్రారంభమవుతుంది. అంతకుముందు భారత మిస్టర్ 360 ప్లేయర్ సూర్యకుమార్ యాదవ్.. సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నాడు. సూర్య తన ఇన్‌స్టాగ్రామ్‌లో స్ట్రీట్ క్రికెట్ ఆడుతున్న వీడియోను పంచుకున్నాడు. ఈ సమయంలో సూర్య స్పెషల్ షాట్ ఆడాడు. ఈ వీడియోను పంచుకుంటూ, ప్రజల డిమాండ్‌పై ‘సుప్లా షాట్’ ట్రై చేశా అంటూ చెప్పుకొచ్చాడు.
సూర్య ఆడిన ఈ స్పెషల్ షాట్ కాస్త వైరల్ అవుతోంది. మరికొద్ది రోజుల్లో ఐపీఎల్‌కు ముందు అతనికి ఆస్ట్రేలియా సవాల్ ఎదురు కానుంది. టెస్టు సిరీస్ తర్వాత భారత్, ఆస్ట్రేలియా మధ్య మార్చి 17 నుంచి మూడు వన్డేల సిరీస్ జరగనుంది. సూర్య వన్డే జట్టులో ముఖ్యమైన భాగంగా ఉన్నాడు. అతను మొదటి టెస్ట్ మ్యాచ్‌లో కూడా భాగమయ్యాడు. అయితే నాగ్‌పూర్ టెస్టులో విఫలమయ్యాడు.
Surya Bhau spotted playing gully cricket in Mumbai. @surya_14kumar #suryakumaryadav #sky #surya #MIOneFamily #mumbai #IPL #IPL2023 #IPLShoot #MumbaiIndians pic.twitter.com/m2yGQTBNDd
— Mumbai Indians One family (@MIonefamily) March 5, 2023
నాగ్‌పూర్ టెస్టులో సూర్య కేవలం 8 పరుగులు మాత్రమే చేయగలిగాడు. ఆయన బ్యాటింగ్ చేసిన విధానంతో అంతా నిరాశ చెందారు. తొలి టెస్టు తర్వాత అతడిని ఢిల్లీ, ఇండోర్ టెస్టుల నుంచి తప్పించారు. ఇప్పుడు వన్డే సిరీస్‌లో సందడి చేయాలని చూస్తున్న సూర్య.. ఆ తర్వాత ఐపీఎల్‌తో బిజీ కానున్నాడు.
వచ్చే నెలలో జరగబోయే ఐపీఎల్‌లో సూర్య తన సత్తా చాటేందుకు సిద్ధమయ్యాడు. వచ్చే నెలలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో ముంబై ఇండియన్స్ జట్టు తమ ప్రచారాన్ని ప్రారంభించనుంది. ఏప్రిల్ 2న ముంబై, ఆర్‌సీబీ మధ్య మ్యాచ్ జరగనుంది.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..