IND vs AUS ICC World Cup 2023 Highlights: ఆస్ట్రేలియాను చిత్తు చేసిన భారత్.. హాఫ్ సెంచరీలతో దుమ్మురేపిన కోహ్లీ, రాహుల్..

India vs Australia, ICC world Cup 2023 Highlights Updates: ఆస్ట్రేలియా జట్టు 49.3 ఓవర్లలో 199 పరుగులకు ఆలౌట్ అయింది. దీంతో టీమిండియాకు 200 పరుగుల టార్గెట్ ఇచ్చింది. భారత బౌలర్లలో జడేజా 3, బుమ్రా 2, కుల్దీప్ 2 వికెట్లు పడగొట్టగా.. సిరాజ్, అశ్విన్, పాండ్యా తలో వికెట్ పడగొట్టారు.

IND vs AUS ICC World Cup 2023 Highlights: ఆస్ట్రేలియాను చిత్తు చేసిన భారత్.. హాఫ్ సెంచరీలతో దుమ్మురేపిన కోహ్లీ, రాహుల్..
India Vs Australia Live Score

Updated on: Oct 08, 2023 | 10:12 PM

India vs Australia, ICC world Cup 2023 Highlights Updates: వన్డే ప్రపంచకప్ 5వ మ్యాచ్‌లో ఆస్ట్రేలియాపై టీమిండియా అద్భుత విజయం సాధించింది. చెన్నైలోని ఎంఏ చిదంబరం స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా కెప్టెన్ పాట్ కమిన్స్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్నాడు. అలా ఇన్నింగ్స్ ప్రారంభించిన ఆస్ట్రేలియా జట్టు.. భారత జట్టు స్పిన్ ధాటికి తడబడింది. ఫలితంగా ఆస్ట్రేలియా 49.3 ఓవర్లలో 199 పరుగులకు ఆలౌటైంది. 200 పరుగుల సులువైన లక్ష్యాన్ని ఛేదించిన ఆసీస్ పేసర్లు టీమిండియాకు ఆదిలోనే షాక్ ఇచ్చారు. ఓపెనర్లు ఇషాన్ కిషన్ (0), రోహిత్ శర్మ (0) సున్నాకి అవుట్ కాగా, శ్రేయాస్ అయ్యర్ కూడా సున్నాకి ఔటయ్యాడు. ఆ తర్వాత విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్ 165 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పడంతో భారత్ విజయం సాధించింది. విరాట్ 85 పరుగులు, రాహుల్ 97 పరుగులు చేశారు. రాహుల్ సిక్సర్ కొట్టి భారత్ 6 వికెట్ల తేడాతో విజయం సాధించాడు.

ఆస్ట్రేలియా జట్టు 49.3 ఓవర్లలో 199 పరుగులకు ఆలౌట్ అయింది. దీంతో టీమిండియాకు 200 పరుగుల టార్గెట్ ఇచ్చింది. భారత బౌలర్లలో జడేజా 3, బుమ్రా 2, కుల్దీప్ 2 వికెట్లు పడగొట్టగా.. సిరాజ్, అశ్విన్, పాండ్యా తలో వికెట్ పడగొట్టారు. 

ఐసీసీ 13వ వన్డే ప్రపంచకప్‌లో నేడు కీలక మ్యాచ్ జరగనుంది. చెన్నైలోని ఎంఏ చిదంబరం స్టేడియంలో రోహిత్ శర్మ నేతృత్వంలోని భారత్ , పాట్ కమిన్స్ నేతృత్వంలోని ఆస్ట్రేలియా జట్టు తలపడుతున్నాయి. ఇరు జట్లకు ఇదే తొలి మ్యాచ్ కావడంతో గెలుపుతో ప్రచారాన్ని ఎవరు ప్రారంభిస్తారో చూడాలి. రెండు జట్లూ స్టార్ ఆటగాళ్లతో బరిలోకి దిగడంతో చెన్నైలో హైవోల్టేజ్ మ్యాచ్ కావడం ఖాయం.

MA చిదంబరం స్టేడియం: పిచ్ రిపోర్ట్..

చెన్నైలోని ఎంఏ చిదంబరం స్టేడియం స్పిన్ బౌలర్లకు మరింత ఉపయోగకరంగా ఉంటుంది. ఇది ప్రధానంగా స్పిన్నర్లకు స్వర్గధామం అని పిలుస్తారు. ఈ పిచ్ నెమ్మదిగా ఉంటుంది. ఇక్కడ టాస్ గెలిచిన జట్లు ముందుగా బ్యాటింగ్ చేయడం మంచిది. ఎందుకంటే మ్యాచ్ జరుగుతున్న కొద్దీ పిచ్ ఛేజింగ్ మరింత కష్టం అవుతుంది. ఈ పిచ్‌పై, 260-270 స్కోర్ చేసే జట్లకు సవాలుగా ఉంటుంది.

ఇండియా ప్లేయింగ్ ఎలెవన్: రోహిత్ శర్మ (కెప్టెన్), ఇషాన్ కిషన్, విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్, కేఎల్ రాహుల్ (వికెట్ కీపర్), హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, రవిచంద్రన్ అశ్విన్, కుల్దీప్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్.

ఆస్ట్రేలియా ప్లేయింగ్ ఎలెవన్: డేవిడ్ వార్నర్, మిచెల్ మార్ష్, స్టీవ్ స్మిత్, మార్నస్ లాబుషాగ్నే, గ్లెన్ మాక్స్‌వెల్, కామెరాన్ గ్రీన్, అలెక్స్ కారీ (వికెట్ కీపర్), పాట్ కమిన్స్ (కెప్టెన్), మిచెల్ స్టార్క్, ఆడమ్ జంపా, జోష్ హేజిల్‌వుడ్.

LIVE Cricket Score & Updates

The liveblog has ended.
  • 08 Oct 2023 09:55 PM (IST)

    విజయంతో అడుగు ముందుకు..

    2023 వన్డే ప్రపంచకప్‌లో టీమ్ ఇండియా తన మిషన్‌ను విజయంతో ప్రారంభించింది. చెన్నైలోని ఎంఏ చిదంబరం స్టేడియంలో జరిగిన తొలి మ్యాచ్‌లో ఆస్ట్రేలియాపై భారత్ 6 వికెట్ల తేడాతో విజయం సాధించింది. దీంతో టీమిండియాకు 2 పాయింట్లు లభించాయి.

  • 08 Oct 2023 09:37 PM (IST)

    కోహ్లీ ఔట్..

    భారత జట్టు 37.4 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 167 పరుగులు చేసింది. కేఎల్ రాహుల్ క్రీజులో ఉన్నాడు. 85 పరుగుల వద్ద విరాట్ కోహ్లీ ఔటయ్యాడు. మార్నస్ జోష్ హేజిల్‌వుడ్‌ బౌలింగ్‌లో లాబుస్‌చాగ్నే చేతికి చిక్కాడు. హేజిల్‌వుడ్‌కి ఇది మూడో వికెట్‌. అతను శ్రేయాస్ అయ్యర్ (0 పరుగులు), రోహిత్ శర్మ (0 పరుగులు)లను అవుట్ చేశాడు.


  • 08 Oct 2023 08:58 PM (IST)

    సెంచరీ భాగస్వామ్యంతో దూకుడు పెంచిన రోహిత్, కేఎల్ రాహుల్..

    భారత జట్టు 31 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 124 పరుగులు చేసింది. క్రీజులో విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్ ఉన్నారు. వీరిద్దరి మధ్య సెంచరీ భాగస్వామ్యం ఉంది. విరాట్ తన వన్డే కెరీర్‌లో 67వ ఫిఫ్టీని పూర్తి చేయగా, రాహుల్ 16వ అర్ధశతకం పూర్తి చేశాడు.

  • 08 Oct 2023 08:26 PM (IST)

    సెంచరీ భాగస్వామ్యం దిశగా..

    భారత జట్టు 25 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 97 పరుగులు చేసింది. క్రీజులో విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్ ఉన్నారు. వీరిద్దరు సెంచరీ భాగస్వామ్యం దిశగా దూసుకెళ్తున్నారు.

  • 08 Oct 2023 07:54 PM (IST)

    హాఫ్ సెంచరీ దాటిన స్కోర్..

    భారత జట్టు 18 ఓవర్లలో మూడు వికెట్ల నష్టానికి 56 పరుగులు చేసింది. క్రీజులో విరాట్ కోహ్లీ 34, కేఎల్ రాహుల్ 32 పరుగులతో క్రీజులో ఉన్నారు. వీరిద్దరి మధ్య అర్ధ సెంచరీ భాగస్వామ్యం నెలకొంది.

  • 08 Oct 2023 06:50 PM (IST)

    ముగ్గురు జీరోకే ఔట్..

    ప్రపంచకప్‌ తొలి మ్యాచ్‌లో ఆస్ట్రేలియాను టీమిండియా 199 పరుగులకు ఆలౌట్‌ చేసింది. అనంతరం భారత జట్టు 2 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి, పీకల్లోతు కష్టాల్లో కూరుకపోయింది. ప్రస్తుతం క్రీజులో విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్ ఉన్నారు. వీరిపైనే భారత అభిమానులు ఆశలు పెట్టుకున్నారు.

    శ్రేయాస్ అయ్యర్ 0 పరుగుల వద్ద ఔటయ్యాడు. రోహిత్ శర్మ (0 పరుగులు)ను జోష్ హేజిల్‌వుడ్‌ అవుట్ చేశాడు. అంతకుముందు ఇషాన్ కిషన్ 0 పరుగుల వద్ద ఔటయ్యాడు. నాలుగో బంతికి ఫస్ట్ స్లిప్‌లో మిచెల్ స్టార్క్ చేతికి చిక్కాడు. ఇషాన్ గోల్డెన్ డక్‌గా పెవిలియన్ చేరాడు.

  • 08 Oct 2023 06:36 PM (IST)

    ఆదిలోనే షాకిచ్చిన మిచెల్ స్టార్క్..

    200 పరుగులు టార్గెట్ కోసం బరిలోకి దిగిన భారత్‌కు ఆస్ట్రేలియా పేసర్ మిచెల్ స్టార్క్ షాకిచ్చాడు. రోహిత్‌తో కలిసి ఓపెనింగ్‌కు వచ్చిన ఇషాన్ కిషన్ (0)కే పెవిలియన్ చేరాడు. గిల్ స్థానంలో వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవడంలో కిషన్ విఫలమయ్యాడు. దీంతో భారత్ 1 ఓవర్ పూర్తయ్యే సరికి 2 పరుగులు చేసింది.

  • 08 Oct 2023 06:02 PM (IST)

    టీమిండియా టార్గెట్ 200

    ఆస్ట్రేలియా జట్టు 49.3 ఓవర్లలో 199 పరుగులకు ఆలౌట్ అయింది. దీంతో టీమిండియాకు 200 పరుగుల టార్గెట్ ఇచ్చింది. భారత బౌలర్లలో జడేజా 3, బుమ్రా 2, కుల్దీప్ 2 వికెట్లు పడగొట్టగా.. సిరాజ్, అశ్విన్, పాండ్యా తలో వికెట్ పడగొట్టారు. 

  • 08 Oct 2023 05:55 PM (IST)

    జంపాను పెవిలియన్ చేర్చిన హార్దిక్..

    ఆస్ట్రేలియా జట్టు 48.2 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 189 పరుగులు చేసింది. క్రీజులో మిచెల్ స్టార్క్, జోష్ హజెల్ వుడ్ ఉన్నారు. హార్దిక్ బౌలింగ్‌లో ఆడమ్ జంపా (6) కోహ్లీకి క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు.

  • 08 Oct 2023 05:24 PM (IST)

    8 వికెట్లు డౌన్..

    ఆస్ట్రేలియా జట్టు 42.2 ఓవర్లలో 8 వికెట్లకు 165 పరుగులు చేసింది. క్రీజులో ఆడం జంపా, మిచెల్ స్టార్క్ ఉన్నారు.

  • 08 Oct 2023 05:02 PM (IST)

    కామెరూన్ గ్రీన్‌కు అశ్విన్ షాక్..

    భారత స్పిన్నర్ల దూకుడుతో ఆస్ట్రేలియా విలవిల్లాడుతోంది. వరుసగా వికెట్లు కోల్పోతూ కష్టాల్లో కూరుకపోతోంది. అప్పటికే 6 వికెట్లు కోల్పోయిన ఆసీస్‌కు అశ్విన్ మరోషాక్ ఇచ్చాడు. కామెరూన్ గ్రీన్ (8)ను పెవిలియన్ చేరాడు.

  • 08 Oct 2023 04:57 PM (IST)

    మాక్స్‌వెల్, కామెరాన్ గ్రీన్ జోడీని బ్రేక్ చేసిన కుల్దీప్..

    గ్లెన్ మాక్స్‌వెల్ (15)ను కుల్దీప్ పెవిలియన్ చేర్చాడు. దీంతో 35.5 ఓవర్లలో ఆస్ట్రేలియా టీం 6 వికెట్లు కోల్పోయి 140 పరుగులు చేసింది.

  • 08 Oct 2023 04:50 PM (IST)

    మాక్స్‌వెల్, కామెరాన్ గ్రీన్ జోడీపై ఆస్ట్రేలియా ఆశలు..

    ఆస్ట్రేలియా జట్టు 34 ఓవర్లలో 5 వికెట్లకు 134 పరుగులు చేసింది. క్రీజులో గ్లెన్ మాక్స్‌వెల్, కామెరాన్ గ్రీన్ ఉన్నారు.

  • 08 Oct 2023 04:29 PM (IST)

    జడేజా దెబ్బకు ఒకే ఓవర్లో 2 వికెట్లు డౌన్..

    జడేజా దెబ్బకు ఆస్ట్రేలియా ఒకే ఓవర్లో 2 వికెట్లు కోల్పోయింది. మొదల లబూషేన్, తర్వాత అలెక్స్ క్యారీ పెవిలియన్ చేరారు. దీంతో ఆసీస్ జట్టు 30 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 119 పరుగులు చేసింది.

  • 08 Oct 2023 04:24 PM (IST)

    4వ వికెట్ డౌన్..

    మార్నస్ లాబుషాగ్నే (27) పరుగులు చేసిన తర్వాత జడేజా బౌలింగ్‌లో కీపర్ రాహుల్‌కి క్యాచ్ ఇచ్చి ఔట్ అయ్యాడు. దీంతో 29.2 ఓవర్లలో ఆస్ట్రేలియా 4 వికెట్లు కోల్పోయి 119 పరుగులు చేసింది.

  • 08 Oct 2023 04:11 PM (IST)

    స్మిత్‌ను పెవిలియన్ చేర్చిన జడేజా..

    స్టీవ్ స్మిత్ (46 పరుగులు) హాఫ్ సెంచరీకి చేరువలోకి వచ్చి జడేజా బౌలింగ్‌లో పెవిలియన్ చేరాడు. దీంతో ఆస్ట్రేలియా 110 పరుగులకే 3 వికెట్లు కోల్పోయింది.

  • 08 Oct 2023 03:48 PM (IST)

    మరో కీలక భాగస్వామ్యం దిశగా ఆసీస్..

    ఆస్ట్రేలియా జట్టు 23 ఓవర్లలో రెండు వికెట్ల నష్టానికి 93 పరుగులు చేసింది. క్రీజులో స్టీవ్ స్మిత్ 40, మార్నస్ లాబుషాగ్నే 12 పరుగులతో క్రీజులో ఉన్నారు.

  • 08 Oct 2023 03:27 PM (IST)

    వార్నర్ ఔట్..

    41 పరుగుల వద్ద డేవిడ్ వార్నర్ అవుటయ్యాడు. అతను 17వ ఓవర్ మూడో బంతికి కుల్దీప్‌ బౌలింగ్‌లో అతనికే క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు.

  • 08 Oct 2023 03:15 PM (IST)

    హాఫ్ సెంచరీ దాటిన భాగస్వామ్యం..

    ఆస్ట్రేలియా జట్టు 15 ఓవర్లలో ఒక వికెట్ నష్టానికి 71 పరుగులు చేసింది. డేవిడ్ వార్నర్ 40, స్టీవ్ స్మిత్ 31 పరుగులతో క్రీజులో ఉన్నారు. వీరిద్దరి మధ్య 66 పరుగుల భాగస్వామం నెలకొంది.

  • 08 Oct 2023 02:12 PM (IST)

    IND vs AUS Live Score: తొలి వికెట్ కోల్పోయిన ఆస్ట్రేలియా..

    టాస్ ఓడిన భారత్‌కు బుమ్రా తన రెండో ఓవర్‌లోనే వికెట్ పడగొట్టాడు. దీంతో ఆస్ట్రేలియాకు భారీ షాక్ ఇచ్చాడు. మిచెల్ మార్ష్‌ను కోహ్లీ క్యాచ్ అందుకుని పెవిలియన్‌కు చేర్చాడు.

  • 08 Oct 2023 02:04 PM (IST)

    ఇరుజట్ల ప్లేయింగ్ 11

    ఇండియా ప్లేయింగ్ ఎలెవన్: రోహిత్ శర్మ (కెప్టెన్), ఇషాన్ కిషన్, విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్, కేఎల్ రాహుల్ (వికెట్ కీపర్), హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, రవిచంద్రన్ అశ్విన్, కుల్దీప్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్.

    ఆస్ట్రేలియా ప్లేయింగ్ ఎలెవన్: డేవిడ్ వార్నర్, మిచెల్ మార్ష్, స్టీవ్ స్మిత్, మార్నస్ లాబుషాగ్నే, గ్లెన్ మాక్స్‌వెల్, కామెరాన్ గ్రీన్, అలెక్స్ కారీ (వికెట్ కీపర్), పాట్ కమిన్స్ (కెప్టెన్), మిచెల్ స్టార్క్, ఆడమ్ జంపా, జోష్ హేజిల్‌వుడ్.

  • 08 Oct 2023 01:39 PM (IST)

    టాస్‌ గెలిచిన ఆస్ట్రేలియా.. భారత్‌ బౌలింగ్‌

    చెన్నై వేదికగా జరుగనున్న ఈ వరల్డ్‌కప్‌ మ్యాచ్‌లో భారత్‌- ఆస్ట్రేలియా జట్లు తలపడనున్నాయి. అయితే టాస్‌ టాస్‌ గెలిచిన ఆస్ట్రేలియా బ్యాటింగ్‌ను ఎంచుకుంది. ఇక భారత్ బౌలింగ్‌ చేయనుంది.

  • 08 Oct 2023 01:29 PM (IST)

    కాసేపట్లో భారత్‌ – ఆస్ట్రేలియా మ్యాచ్‌

    కాసేపట్లో భారత్‌ – ఆస్ట్రేలియా మ్యాజ్‌ జరుగనుంది. చెన్నై వేదికగా ఈ వరల్డ్‌కప్‌ మ్యాచ్‌ జరగబోతంది. తొలి విజయంతో మంచి బోణీ చేయాలని భారత్‌ ఆరాట పడుతోంది. మొదటి మ్యాచ్‌లోనూ భారత్‌ను నిలువరించాలని ఆసీస్‌ పోరాటం చేస్తోంది.

  • 08 Oct 2023 12:34 PM (IST)

    నేడు భారత్ – ఆస్ట్రేలియా మధ్య కీలక మ్యాచ్‌

    ఐసీసీ 13వ వన్డే ప్రపంచకప్‌లో నేడు కీలక మ్యాచ్ జరగనుంది. చెన్నైలోని ఎంఏ చిదంబరం స్టేడియంలో రోహిత్ శర్మ నేతృత్వంలోని భారత్ , పాట్ కమిన్స్ నేతృత్వంలోని ఆస్ట్రేలియా జట్టు తలపడుతున్నాయి.