IND vs AUS 4th Test: టీమిండియా టార్గెట్ 340.. ఒకే ఓవర్లో బిగ్ షాకిచ్చిన కమిన్స్.. రోహిత్, రాహుల్ ఔట్

|

Dec 30, 2024 | 6:36 AM

India vs Australia, 4th Test Day 5 Score: బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో భాగంగా జరుగుతున్న నాలుగో టెస్టులో భారత్‌కు ఆస్ట్రేలియా 340 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. సోమవారం 92 ఓవర్లలో టీమ్ ఇండియా ఛేజింగ్ చేయాల్సి ఉంటుంది. భారత్ రెండో ఇన్నింగ్స్‌లో 20 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 27 పరుగులు చేసింది. యశస్వి జైస్వాల్, విరాట్ కోహ్లీ క్రీజులో ఉన్నారు. కేఎల్ రాహుల్ జీరో పరుగులకే ఔట్ కాగా, 9 పరుగుల వద్ద రోహిత్ శర్మ ఔటయ్యాడు. ఇద్దరినీ ఒకే ఓవర్లో పాట్ కమిన్స్ అవుట్ చేశాడు.

IND vs AUS 4th Test: టీమిండియా టార్గెట్ 340.. ఒకే ఓవర్లో బిగ్ షాకిచ్చిన కమిన్స్.. రోహిత్, రాహుల్ ఔట్
Team India
Follow us on

India vs Australia, 4th Test Day 5 Score: బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో భాగంగా జరుగుతున్న నాలుగో టెస్టులో భారత్‌కు ఆస్ట్రేలియా 340 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. సోమవారం 92 ఓవర్లలో టీమ్ ఇండియా ఛేజింగ్ చేయాల్సి ఉంటుంది. భారత్ రెండో ఇన్నింగ్స్‌లో 20 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 27 పరుగులు చేసింది. యశస్వి జైస్వాల్, విరాట్ కోహ్లీ క్రీజులో ఉన్నారు. కేఎల్ రాహుల్ జీరో పరుగులకే ఔట్ కాగా, 9 పరుగుల వద్ద రోహిత్ శర్మ ఔటయ్యాడు. ఇద్దరినీ ఒకే ఓవర్లో పాట్ కమిన్స్ అవుట్ చేశాడు.

5వ రోజు తొలి సెషన్‌లో ఆస్ట్రేలియా జట్టు రెండో ఇన్నింగ్స్‌లో 234 పరుగులకు ఆలౌటైంది. దీంతో ఆస్ట్రేలియా జట్టు మొత్తం 339 పరుగుల ఆధిక్యం సాధించింది. నాథన్ లియాన్ 41 పరుగుల వద్ద ఔటయ్యాడు. మార్నస్ లాబుషాగ్నే 70, కెప్టెన్ పాట్ కమిన్స్ 41 పరుగులు చేశారు. జస్ప్రీత్ బుమ్రా 5 వికెట్లు, మహ్మద్ సిరాజ్ 3 వికెట్లు తీశారు. తొలి ఇన్నింగ్స్‌లో ఆస్ట్రేలియా 474 పరుగులు చేయగా, భారత్ 369 పరుగులు చేసింది. ఇక్కడ కంగారూలకు తొలి ఇన్నింగ్స్‌లో 105 పరుగుల ఆధిక్యం లభించింది. సిరీస్ 1-1తో సమమైంది.

ఇరుజట్లు..

భారత్: రోహిత్ శర్మ (కెప్టెన్), యశస్వి జైస్వాల్, కేఎల్ రాహుల్, విరాట్ కోహ్లీ, రిషబ్ పంత్, రవీంద్ర జడేజా, నితీష్ రెడ్డి, వాషింగ్టన్ సుందర్, జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్, ఆకాశ్ దీప్.

ఇవి కూడా చదవండి

ఆస్ట్రేలియా: పాట్ కమిన్స్ (కెప్టెన్), ఉస్మాన్ ఖవాజా, సామ్ కాన్‌స్టాన్స్, మార్నస్ లాబుషాగ్నే, స్టీవ్ స్మిత్, ట్రావిస్ హెడ్, మిచెల్ మార్ష్, అలెక్స్ కారీ (వికెట్ కీపర్), మిచెల్ స్టార్క్, నాథన్ లియాన్, స్కాట్ బోలాండ్.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..