IND vs AUS 4th Test: 3 వికెట్లు కోల్పోయిన భారత్.. చేతులు ఎత్తేసిన కోహ్లీ, రాహుల్, రోహిత్

|

Dec 30, 2024 | 7:36 AM

India vs Australia 4th Test Day 5: బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో భాగంగా జరుగుతున్న నాలుగో టెస్టులో భారత్‌కు ఆస్ట్రేలియా 340 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ప్రస్తుతం లంచ్ విరామ సమయానికి భారత్ రెండో ఇన్నింగ్స్‌లో 26.1 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 33 పరుగులు చేసింది. యశస్వి జైస్వాల్ 14 పరుగులతో నాటౌట్‌గా ఉన్నాడు.

IND vs AUS 4th Test: 3 వికెట్లు కోల్పోయిన భారత్.. చేతులు ఎత్తేసిన కోహ్లీ, రాహుల్, రోహిత్
Rohit Kohli Rahul
Follow us on

India vs Australia 4th Test Day 5: బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో భాగంగా జరుగుతున్న నాలుగో టెస్టులో భారత్‌కు ఆస్ట్రేలియా 340 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ప్రస్తుతం లంచ్ విరామ సమయానికి భారత్ రెండో ఇన్నింగ్స్‌లో 26.1 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 33 పరుగులు చేసింది. యశస్వి జైస్వాల్ 14 పరుగులతో నాటౌట్‌గా ఉన్నాడు. విరాట్ కోహ్లీ (5 పరుగులు) ఉస్మాన్ మిచెల్ స్టార్క్‌ బౌలింగ్‌లో ఖవాజా చేతికి చిక్కాడు. కేఎల్ రాహుల్ (0), రోహిత్ శర్మ (9 పరుగులు)లను పాట్ కమిన్స్ పెవిలియన్ పంపాడు.

లంచ్ బ్రేక్- ఆస్ట్రేలియా బౌలర్ల ఆధిపత్యం..

మెల్‌బోర్న్ టెస్టులో చివరి రోజు తొలి సెషన్ ఆస్ట్రేలియా బౌలర్ల పేరిటకు షిఫ్ట్ అయింది. ఈ సెషన్‌లో భారత జట్టు 3 వికెట్లు కోల్పోయింది. రోహిత్ శర్మ 9 పరుగులు, కేఎల్ రాహుల్ 0, విరాట్ కోహ్లీ 5 పరుగులు చేసి ఔటయ్యారు. 27 ఓవర్ల 5 బంతుల ఈ సెషన్‌లో 5 వికెట్లు పడి 39 పరుగులు వచ్చాయి. వీటిలో ఆస్ట్రేలియా ఒక వికెట్ నష్టానికి 6 పరుగులు చేయగా, భారత్ 33 పరుగులకే 3 వికెట్లు కోల్పోయింది.

ఇవి కూడా చదవండి

ఇరుజట్లు:

భారత్: రోహిత్ శర్మ (కెప్టెన్), యశస్వి జైస్వాల్, కేఎల్ రాహుల్, విరాట్ కోహ్లీ, రిషబ్ పంత్, రవీంద్ర జడేజా, నితీష్ రెడ్డి, వాషింగ్టన్ సుందర్, జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్, ఆకాశ్ దీప్.

ఆస్ట్రేలియా: పాట్ కమిన్స్ (కెప్టెన్), ఉస్మాన్ ఖవాజా, సామ్ కాన్‌స్టాన్స్, మార్నస్ లాబుషాగ్నే, స్టీవ్ స్మిత్, ట్రావిస్ హెడ్, మిచెల్ మార్ష్, అలెక్స్ కారీ (వికెట్ కీపర్), మిచెల్ స్టార్క్, నాథన్ లియాన్, స్కాట్ బోలాండ్.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..