T20 World Cup 2022: టీ20 ప్రపంచకప్‌లో ఆడే భారత జట్టు ఇదే .. ఆ స్టార్‌ ప్లేయర్లకు మొండి చెయ్యి

| Edited By: Ravi Kiran

Sep 13, 2022 | 1:41 PM

Team India For T20 World Cup: ఆస్ట్రేలియా వేదికగా అక్టోబర్‌లో ప్రారంభయమ్యే టీ 20 ప్రపంచకప్‌కు భారత జట్టును ప్రకటించారు. ఈ ప్రతిష్ఠాత్మక టోర్నీ కోసం భారత సెలెక్టర్లు మొత్తం15 మంది ఆటగాళ్లను ఎంపిక చేశారు.

T20 World Cup 2022: టీ20 ప్రపంచకప్‌లో ఆడే భారత జట్టు ఇదే .. ఆ స్టార్‌ ప్లేయర్లకు మొండి చెయ్యి
Team India
Follow us on

Team India For T20 World Cup: ఆస్ట్రేలియా వేదికగా అక్టోబర్‌లో ప్రారంభయమ్యే టీ 20 ప్రపంచకప్‌కు భారత జట్టును ప్రకటించారు. ఈ ప్రతిష్ఠాత్మక టోర్నీ కోసం భారత సెలెక్టర్లు మొత్తం15 మంది ఆటగాళ్లను ఎంపిక చేశారు. టీమిండియా జట్టు పగ్గాలు రోహిత్ శర్మకే అప్పగించారు. వైస్‌ కెప్టెన్‌గా కేఎల్ రాహుల్‌ వ్యవహరించనున్నాడు. కాగా గాయం కారణంగా చాలా కాలం పాటు జట్టుకు దూరంగా ఉన్న డెత్‌ ఓవర్ల స్పెషలిస్టులు జస్ప్రీత్ బుమ్రా, హర్షల్‌ పటేల్‌ కూడా ఆస్ట్రేలియా ఫ్లైట్ ఎక్కనున్నారు. కాగా ఇటీవల రిషబ్ పంత్ గురించి అనేక ఊహాగానాలు వచ్చాయి. అతని ఇటీవలి ఫామ్ గురించి పలు ప్రశ్నలు తలెత్తాయి. జట్టుకు దూరంగా ఉంచాలన్న ప్రతిపాదనలు కూడా వచ్చాయి. అయితే సెలక్టర్లు అతనిపై నమ్మకం ఉంచారు. దీంతో పాటు దినేష్ కార్తీక్‌కు కూడా అవకాశం కల్పించారు. గాయంతో బాధపడుతున్న రవీంద్ర జడేజాకు స్థానం కల్పించలేదు.  చాహర్, షమీలతో పాటు శ్రేయస్ అయ్యర్, రవి బిష్ణోయ్ లను స్టాండ్ బై ప్లేయర్స్‌గా తీసుకున్నారు.

కాగా 2013లో ధోనీ కెప్టెన్సీలో చాంపియన్స్ ట్రోఫీని గెలుచుకున్న టీమ్ ఇండియా ఆ తర్వాత మరే ఐసీసీ ట్రోఫీని గెలవలేకపోయింది. ఆ తర్వాత ధోనీ శకం, విరాట్ కోహ్లీ కెప్టెన్సీ ముగిసినా భారత జట్టు ఐసీసీ టైటిల్‌ను ముద్దాడలేకపోయింది.ఈనేపథ్యంలో దేశం మొత్తం చూపు ఇప్పుడు ప్రస్తుతం కెప్టెన్‌ రోహిత్‌ శర్మపైనే ఉంది. కాగా టీ20 ప్రపంచ కప్ 2022 అక్టోబర్ 22 నుండి నవంబర్ 13 వరకు జరుగుతుంది. అక్టోబర్ 23న చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌తో భారత జట్టు తన ప్రపంచకప్‌ పోరును ప్రారంభించనుంది. మెల్‌బోర్న్‌ వేదికగా ఈ మ్యాచ్‌ జరగనుంది.

ఇవి కూడా చదవండి

టీ20 ప్రపంచకప్‌ జట్టు

రోహిత్‌ శర్మ (కెప్టెన్‌), కేఎల్‌ రాహుల్‌ (వైస్‌ కెప్టెన్‌), విరాట్‌, పంత్‌, సూర్యకుమార్, దినేష్ కార్తీక్,  హార్దిక్‌, దీపక్‌ హుడా, అశ్విన్‌, చాహల్‌, అక్షర్‌ పటేల్‌, బుమ్రా, భువనేశ్వర్‌, హర్షల్‌ పటేల్‌, అర్ష్‌దీప్‌ సింగ్‌.

స్టాండ్ బై ప్లేయర్స్: షమీ, శ్రేయాస్ అయ్యర్, రవి బిష్ణోయ్, దీపక్ చాహార్

మరిన్ని క్రీడావార్తల కోసం క్లిక్ చేయండి..