Watch: గ్రౌండ్లోనే షర్ట్ విప్పిన భారత ప్లేయర్.. వీడు ఏమైనా గంగూలీ అనుకుంటున్నాడా ?

Watch: క్రికెట్ మక్కాగా భావించే లార్డ్స్ చారిత్రాత్మక మైదానంలో 2002 నాటి సౌరవ్ గంగూలీ సంబరాలు మళ్లీ పునరావృతమయ్యాయి. భారత మిక్స్డ్ డిసబిలిటీ క్రికెట్ టీమ్ ఆఖరి మ్యాచ్‌లో ఇంగ్లాండ్‌ను 118 పరుగుల భారీ తేడాతో ఊచకోత కోసింది. ఈ అద్భుత గెలుపు తర్వాత భారత ఆటగాళ్లు లార్డ్స్ బాల్కనీలో టీషర్టులు విప్పి ఊపుతూ రచ్చ రచ్చ చేశారు.

Watch: గ్రౌండ్లోనే షర్ట్ విప్పిన భారత ప్లేయర్.. వీడు ఏమైనా గంగూలీ అనుకుంటున్నాడా ?
Sourav Ganguly

Updated on: Aug 20, 2026 | 1:50 PM

Watch: క్రికెట్‌కు ఎంతో ప్రత్యేకమైన లార్డ్స్ మైదానంలో మరోసారి గంగూలీ మార్క్ సెలబ్రేషన్స్ కనిపించాయి. భారత మిక్స్డ్ డిసబిలిటీ క్రికెట్ జట్టు ఆఖరి మ్యాచ్‌లో ఇంగ్లాండ్‌పై 118 పరుగుల భారీ విజయాన్ని సాధించింది. ఈ గెలుపు తర్వాత భారత ఆటగాళ్లు లార్డ్స్ బాల్కనీలో టీషర్టులు విప్పి ఊపుతూ సంబరాలు చేసుకున్నారు. 2002 నెట్‌వెస్ట్ ట్రోఫీ ఫైనల్‌లో ఇంగ్లాండ్‌పై భారత్ గెలిచిన తర్వాత అప్పటి కెప్టెన్ సౌరవ్ గంగూలీ లార్డ్స్ బాల్కనీలో తన జెర్సీ విప్పి గాలిలో ఊపిన విషయం తెలిసిందే. ఆ సంఘటన అప్పట్లో ప్రపంచవ్యాప్తంగా సంచలనంగా మారింది.

ఇది కూడా చదవండి: 199 Centuries: ఎవరు సామి నువ్వు…. సచిన్, కోహ్లీలకే సాధ్యంకాలే.. 199 సెంచరీలు అలా ఎలా బాదేశావ్..

ఇప్పుడు దాదాపు అదే తరహాలో భారత మిక్స్డ్ డిసబిలిటీ క్రికెట్ జట్టు ఆటగాళ్లు లార్డ్స్ బాల్కనీలో సంబరాలు చేసుకున్నారు. ఒక ఆటగాడు తన టీషర్ట్ విప్పి ఊపగా.. జట్టుకు చెందిన ఓ అధికారి కూడా తన బ్లేజర్ తీసి ఆనందాన్ని వ్యక్తం చేశారు. ఈ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.ఆఖరి మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన భారత జట్టు 206 పరుగులు చేసింది. అనంతరం 207 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లాండ్‌ను భారత బౌలర్లు కేవలం 88 పరుగులకే ఆలౌట్ చేశారు.దీంతో భారత్ 118 పరుగుల భారీ విజయాన్ని అందుకుంది. ఈ సిరీస్‌లో భారత జట్టు సాధించిన అత్యధిక స్కోరు కూడా ఇదే కావడం విశేషం.

ఇది కూడా చదవండి: Virat Kohli: ఓర్నీ.. వీళ్ల ధైర్యం తగలెయ్యా.. ఏకంగా విరాట్ కోహ్లీ బ్రాండ్‌కే ఎసరు పెట్టారు కదరా!

ఇది కూడా చదవండి:Unwanted Records: టెస్ట్ చరిత్రలోనే పరమ చెత్త రికార్డు.. తొలి ఓవర్ తొలి బంతికే అవుటైన ముగ్గురు స్టార్ బ్యాటర్లు

భారత్ ఆఖరి మ్యాచ్‌లో ఘన విజయం సాధించినప్పటికీ.. ఏడు మ్యాచ్‌ల సిరీస్‌ను ఇంగ్లాండ్ 4-3తో గెలుచుకుంది. అయితే చివరి మ్యాచ్‌లో భారత ఆటగాళ్లు అద్భుతమైన ఆటతీరును ప్రదర్శించి అభిమానుల మనసులు గెలుచుకున్నారు. 2002లో గంగూలీ చేసిన సెలబ్రేషన్స్‌ను గుర్తు చేసేలా భారత ఆటగాళ్లు లార్డ్స్ బాల్కనీలో సంబరాలు చేసుకోవడం ప్రత్యేక ఆకర్షణగా మారింది. వైకల్యాన్ని లెక్కచేయకుండా మైదానంలో అద్భుతంగా పోరాడిన ఈ ఆటగాళ్లు సాధించిన విజయం ఎంతోమందికి స్ఫూర్తిగా నిలిచింది.

ఇది కూడా చదవండి: Saaniya Chandhok: సచిన్ కోడలు సానియా చందోక్‌లో ఈ టాలెంట్ ఉందా? ఏం చేసిందో తెలిస్తే వావ్ అంటారు

మరిన్ని క్రికెట్‌ వార్తల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి..

 

Loading...
Unable to load recommendations.
Follow Us