IND vs IRE T20 WC Result: సత్తా చాటిన బౌలర్లు, బ్యాటర్లు.. తొలి మ్యాచ్ లో ఐర్లాండ్ పై భారత్ ఘన విజయం..

India vs Ireland Result, T20 World Cup 2024: టీ-20 ప్రపంచకప్‌లో ఐర్లాండ్‌తో జరిగిన తొలి మ్యాచ్‌లో టీమిండియా ఘన విజయం సాధించింది. న్యూయార్క్‌లోని నసావు ఇంటర్నేషనల్ క్రికెట్ గ్రౌండ్‌లో రోహిత్ శర్మ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్నాడు. భారత బౌలర్లు ఐర్లాండ్ జట్టును 96 పరుగులకే ఆలౌట్ చేశారు. దీని తర్వాత బ్యాట్స్‌మెన్ 13వ ఓవర్‌లో లక్ష్యాన్ని ఛేదించారు. రోహిత్ శర్మ హాఫ్ సెంచరీతో సత్తా చాటాడు.

Ind Vs Ire Match Result

Updated on: Jun 05, 2024 | 11:01 PM

India vs Ireland Result, T20 World Cup 2024: టీ-20 ప్రపంచకప్‌లో ఐర్లాండ్‌తో జరిగిన తొలి మ్యాచ్‌లో టీమిండియా ఘన విజయం సాధించింది. న్యూయార్క్‌లోని నసావు ఇంటర్నేషనల్ క్రికెట్ గ్రౌండ్‌లో రోహిత్ శర్మ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్నాడు. భారత బౌలర్లు ఐర్లాండ్ జట్టును 96 పరుగులకే ఆలౌట్ చేశారు. దీని తర్వాత బ్యాట్స్‌మెన్ 13వ ఓవర్‌లో లక్ష్యాన్ని ఛేదించారు. రోహిత్ శర్మ హాఫ్ సెంచరీతో సత్తా చాటాడు.

ఈ క్రమంలో రోహిత్ శర్మ మూడు రికార్డులు సృష్టించాడు. అంతర్జాతీయ క్రికెట్‌లో అత్యధికంగా 600 సిక్సర్లు, తక్కువ బంతుల్లో 4 వేల పరుగులు, T-20 ప్రపంచకప్‌లో వెయ్యి పరుగులు పూర్తి చేశాడు.

స్లిప్స్‌లో రోహిత్ శర్మ క్యాచ్‌ను బల్బిర్నీ జారవిడిచడంతో తొలి ఓవర్‌లో జరిగిన పొరపాటు ఐర్లాండ్‌కు భారీ నష్టాన్ని మిగిల్చింది.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..