IND Vs AUS: ఒరేయ్ ఆజామూ.! మ్యాచ్ అంటే ఇదిరా.. 22 ఫోర్లు, 6 సిక్సర్లతో టీమిండియాకే దెబ్బేశారుగా

48 గంటల్లోనే సీన్ మారిపోయింది. అక్టోబర్ 1న ఇండియా ఏ కాన్పూర్ స్టేడియంలో తొలి వన్డే గెలవగా.. అదే స్టేడియంలో రెండో వన్డేలో ఘోర ఓటమిని ఎదుర్కుంది. ఆ వివరాలు ఏంటో ఇప్పుడు ఈ స్టోరీలో తెలుసుకుందామా మరి. ఓ సారి లుక్కేయండి.

IND Vs AUS: ఒరేయ్ ఆజామూ.! మ్యాచ్ అంటే ఇదిరా.. 22 ఫోర్లు, 6 సిక్సర్లతో టీమిండియాకే దెబ్బేశారుగా
Cricket

Updated on: Oct 04, 2025 | 9:43 AM

అక్టోబర్ 3న శుక్రవారం కాన్పూర్‌లోని గ్రీన్ పార్క్ స్టేడియంలో, ఆస్ట్రేలియా జట్టు అద్భుత విజయాన్ని అందుకుంది. ఇండియా-ఏతో జరిగిన రెండో వన్డేలో తొమ్మిది వికెట్ల తేడాతో గెలుపొందింది. రెండవ మ్యాచ్‌లో శ్రేయాస్ అయ్యర్ నాయకత్వంలోని ఆతిథ్య జట్టు ఘోర పరాజయాన్ని చవిచూసింది. గత మ్యాచ్‌లో భారీ స్కోరు చేసిన ఇండియా-ఏ ఈసారి 250 పరుగులు కూడా చేయలేకపోయింది. డక్‌వర్త్ లూయిస్ పద్దతిలో ఆస్ట్రేలియా విజయం సాధించి సిరీస్‌ను 1-1తో సమం చేసుకుంది.

ఇది చదవండి: అక్కడికి ఎలా ఎక్కావు మావ.. వీడియో చూస్తే వణికిపోవాల్సిందే

ఆస్ట్రేలియా ఏతో జరిగిన తొలి మ్యాచ్‌లో శ్రేయాస్ అయ్యర్ అద్భుత సెంచరీ చేయడమే కాదు.. జట్టు భారీ స్కోర్ సాధించగా.. రెండో వన్డేలో చతికిలబడింది. కేవలం 17 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయింది. ఆపై బరిలోకి వచ్చిన తిలక్ వర్మ 94 పరుగులతో రాణించాడు. దీంతో ఇండియా ఏ జట్టు 45.5 ఓవర్లలో 246 పరుగుల గౌరవప్రదమైన స్కోర్ సాధించగలిగింది. అటు తిలక్ వర్మకు రియాన్ పరాగ్ అర్ధ సెంచరీతో సహకారం అందించడం గమనార్హం. ఆస్ట్రేలియా ఏ తరఫున కెప్టెన్ జాక్ ఎడ్వర్డ్స్ అత్యధికంగా నాలుగు వికెట్లు తీసి.. టీమిండియా పతనాన్ని శాసించాడు.

ఇవి కూడా చదవండి

ఇక చేధనలో భాగంగా బరిలోకి దిగిన ఆస్ట్రేలియా ఏ.. కేవలం ఆరు ఓవర్లలోనే 40 పరుగులకు పైగా స్కోర్ సాధించింది. ఈలోగా వర్షం అంతరాయం కలిగించడంతో డక్‌వర్త్-లూయిస్ పద్ధతి ప్రకారం ఆస్ట్రేలియా A జట్టు గెలవాలంటే 25 ఓవర్లలో 160 పరుగులు చేయాల్సి ఉంది. మెక్‌గుర్క్ 36 పరుగులు సాధించగా.. మిగిలిన ఇద్దరు బ్యాటర్లు లక్ష్యాన్ని కేవలం 16.4 ఓవర్లలో లేదా 100 బంతుల్లోనే చేధించారు. ఆసీస్ తరఫున హార్వే 49 బంతుల్లో అజేయంగా 70 పరుగులు చేయగా, కొన్నోలీ 31 బంతుల్లో 50 పరుగులు చేశాడు. మొత్తంమీద ఆసీస్ 22 ఫోర్లు, 6 సిక్సర్లతో మ్యాచ్‌ను 9 వికెట్ల తేడాతో గెలిచింది.

ఇది చదవండి: కొండ కింద నల్లటి ఆకారం.. కెమెరాకు పని చెప్పి జూమ్ చేయగా దిమ్మతిరిగింది