AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

AB de Villiers : నఖ్వీ నుంచి ట్రోఫీ తీసుకోవాల్సింది..సౌతాఫ్రికా దిగ్గజం ఉచిత సలహా

ఆసియా కప్ 2025 ఫైనల్‌లో చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌ను ఓడించి టీమిండియా టైటిల్‌ను గెలుచుకుంది. అయితే, మ్యాచ్ అనంతరం జరిగిన ట్రోఫీ ప్రదానోత్సవం పెద్ద వివాదంగా మారింది. ఆసియన్ క్రికెట్ కౌన్సిల్ అధ్యక్షుడు, పాకిస్థాన్ క్రికెట్ బోర్డు ఛైర్మన్ మొహసిన్ నఖ్వీ చేతుల మీదుగా ట్రోఫీని తీసుకోవడానికి భారత జట్టు నిరాకరించడం చర్చనీయాంశమైంది.

AB de Villiers : నఖ్వీ నుంచి ట్రోఫీ తీసుకోవాల్సింది..సౌతాఫ్రికా దిగ్గజం ఉచిత సలహా
Ab De Villiers
Rakesh
|

Updated on: Oct 04, 2025 | 1:59 PM

Share

AB de Villiers : ఆసియా కప్ 2025 ఫైనల్‌లో చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌ను ఓడించి టీమిండియా టైటిల్‌ను గెలుచుకుంది. అయితే, మ్యాచ్ అనంతరం జరిగిన ట్రోఫీ ప్రదానోత్సవం పెద్ద వివాదంగా మారింది. ఆసియన్ క్రికెట్ కౌన్సిల్ అధ్యక్షుడు, పాకిస్థాన్ క్రికెట్ బోర్డు ఛైర్మన్ మొహసిన్ నఖ్వీ చేతుల మీదుగా ట్రోఫీని తీసుకోవడానికి భారత జట్టు నిరాకరించడం చర్చనీయాంశమైంది. ఈ ఘటనపై దక్షిణాఫ్రికా మాజీ క్రికెటర్ ఏబీ డివిలియర్స్ నఖ్వీ నుంచి ట్రోఫీ తీసుకోకపోవడంపై వివాదాస్పద కామెంట్స్ చేశారు.

భారత జట్టు ఈ నిర్ణయం తీసుకోవడం వెనుక బలమైన కారణాలు ఉన్నాయి. ఇది కేవలం ఒక రాజకీయ అంశంగా కాకుండా, క్రీడా ప్రపంచంలో పాకిస్థాన్ క్రికెట్ బోర్డు చీఫ్ అనుసరిస్తున్న తీరుకు నిరసనగా భావించవచ్చు. మొహసిన్ నఖ్వీ గతంలో పీసీబీ చీఫ్‌గా ఉంటూ భారత్‌కు వ్యతిరేకంగా పలు వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం, అలాగే ఆసియా కప్ ట్రోఫీని అక్రమంగా తమ వద్దే ఉంచుకుని దానిని తిరిగి ఇచ్చేందుకు నిరాకరించడం వంటి బాధ్యతారాహిత్యమైన చర్యలు తీసుకున్నారు. ఇటువంటి ప్రవర్తనను ప్రోత్సహించకూడదనే ఉద్దేశంతోనే టీమిండియా ఈ నిర్ణయం తీసుకుంది.

ట్రోఫీని అప్పగించడంలో పాకిస్థాన్ క్రికెట్ బోర్డు అధ్యక్షుడు అహంకారాన్ని, మొండితనాన్ని ప్రదర్శించడంతో, క్రీడా ప్రపంచంలో గౌరవం, సరైన క్రీడా స్ఫూర్తిని కాపాడాలనే ఉద్దేశంతో భారత జట్టు నఖ్వీని దూరం పెట్టింది. నఖ్వీ స్వయంగా పాకిస్థాన్ హోం శాఖ మంత్రి.. అందుకే ఆయన విషయంలో భారత్ తన అభ్యంతరం వ్యక్తంచేసింది. ఇది దేశం గౌరవానికి, క్రీడా సంస్థల పట్ల ఉండవలసిన నిబద్ధతకు ప్రాధాన్యతనిచ్చే ఒక ఆదర్శప్రాయమైన వైఖరిగా నిలిచింది.

భారత జట్టు చర్యపై ఏబీ డివిలియర్స్ చేసిన వ్యాఖ్యలు చర్చకు దారితీశాయి. తన వీకెండ్ యూట్యూబ్ షో #360లో ఆయన మాట్లాడుతూ, “భారత జట్టు ట్రోఫీని ఎవరు అందిస్తున్నారో వారి వల్ల వారు సంతోషంగా లేదు. ఇది క్రీడలకు తగదు అని నేను భావిస్తున్నాను. రాజకీయాలు దూరంగా ఉండాలి. ఇది చూస్తే చాలా బాధగా ఉంది. కానీ భవిష్యత్తులో వారు విషయాలను పరిష్కరించుకుంటారని ఆశిస్తున్నాను. ఇది క్రీడలను, ఆటగాళ్లను, క్రీడాకారులను, క్రికెటర్లను చాలా కఠినమైన పరిస్థితిలో పడేస్తుంది. అది నేను చూడటం ఇష్టం లేదు. చివరికి అది చాలా ఇబ్బందికరంగా ఉంది” అని అభిప్రాయపడ్డారు. ఏబీ డీవిల్లియర్స్ గతంలో పాకిస్తాన్ భారత్ పట్ల వ్యవహరించిన తీరు గురించి విషయ పరిజ్ఞానం లేకుండా ఉచిత సలహా ఇచ్చేశారు.

ట్రోఫీ చుట్టూ ఉన్న వివాదాలను ప్రస్తావిస్తూనే, ఏబీ డివిలియర్స్ భారత జట్టు ప్రదర్శనను ప్రశంసించడం మరచిపోలేదు. “ముఖ్యమైన దానిపై (క్రికెట్) దృష్టి పెడదాం. భారత జట్టు నిజంగా చాలా బలంగా కనిపిస్తోంది. టి20 ప్రపంచ కప్‌కు సన్నద్ధమవుతోంది. గుర్తుంచుకోండి, అది చాలా దూరంలో లేదు. వారికి చాలా టాలెంట్ ఉందని, వారు పెద్ద సందర్భాలలో బాగా ఆడుతున్నారని కనిపిస్తోంది. కాబట్టి అద్భుతం” అని డివిలియర్స్ అన్నారు.

మరిన్ని క్రికెట్‌ వార్తల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి

హాయిగా.. ఆనందంగా.. ఫిబ్రవరిలో తప్పక విజిట్ చేయాల్సిన ప్లేసెస్ ఇవే
హాయిగా.. ఆనందంగా.. ఫిబ్రవరిలో తప్పక విజిట్ చేయాల్సిన ప్లేసెస్ ఇవే
మహాలక్ష్మి రాజయోగం.. వీరికి చేతినిండా డబ్బే డబ్బు!
మహాలక్ష్మి రాజయోగం.. వీరికి చేతినిండా డబ్బే డబ్బు!
ఈ మహిళ సక్సెస్ స్టోరీ వింటే సెల్యూట్ చేయాల్సిందే
ఈ మహిళ సక్సెస్ స్టోరీ వింటే సెల్యూట్ చేయాల్సిందే
పవర్‌ఫుల్ గ్రహాల ఎంట్రీ.. డబుల్ రాజయోగంతో ఈ 4 రాశులకు డబుల్...
పవర్‌ఫుల్ గ్రహాల ఎంట్రీ.. డబుల్ రాజయోగంతో ఈ 4 రాశులకు డబుల్...
వారెవ్వా అదిరే బైక్.. ఎక్కువ మైలేజ్.. చాలా తక్కువ ధర.. సూపర్..
వారెవ్వా అదిరే బైక్.. ఎక్కువ మైలేజ్.. చాలా తక్కువ ధర.. సూపర్..
ఇంకెన్నాళ్లు జుట్టుకు రంగు వాడతారు.. దానిమ్మ తొక్కల్ని ఇలా వాడితే
ఇంకెన్నాళ్లు జుట్టుకు రంగు వాడతారు.. దానిమ్మ తొక్కల్ని ఇలా వాడితే
30 ఏళ్ల క్రితం సినిమా క్లాసిక్ హిట్.. ఇప్పటికీ ట్రెండ్ అవుతున్న ప
30 ఏళ్ల క్రితం సినిమా క్లాసిక్ హిట్.. ఇప్పటికీ ట్రెండ్ అవుతున్న ప
రేపటితో టీమిండియా 5 ఏళ్ల రికార్డు మటాష్ అవుతుందా?
రేపటితో టీమిండియా 5 ఏళ్ల రికార్డు మటాష్ అవుతుందా?
ఓటీటీలో సుదీప్ లేటెస్ట్ సూపర్ హిట్ మూవీ.. తెలుగులోనూ స్ట్రీమింగ్
ఓటీటీలో సుదీప్ లేటెస్ట్ సూపర్ హిట్ మూవీ.. తెలుగులోనూ స్ట్రీమింగ్
మున్సిపల్ ఎన్నికల రిజర్వేషన్లు ఖరారు.. మహిళలు, బీసీలకు..
మున్సిపల్ ఎన్నికల రిజర్వేషన్లు ఖరారు.. మహిళలు, బీసీలకు..