భారత మహిళల జట్టు కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ మ్యాచ్ తర్వాత అంపైరింగ్‌పై నిరసన వ్యక్తం చేసినందుకు ఐసిసి భారీ జరిమానా విధించింది . హర్మన్‌పై కఠిన చర్యలు తీసుకున్న ఐసీసీ, కౌర్ మ్యాచ్ ఫీజులో 75% జరిమానా విధించింది. బంగ్లా దేశ్‌తో జరిగిన మూడో వన్డేలో హర్మన్‌ప్రీత్ అంపైరింగ్‌ను ప్రశ్నించడమే కాకుండా బ్యాట్‌తో వికెట్‌ను కొట్టి తన కోపాన్ని వెళ్లగక్కింది. కౌర్ ప్రవర్తనను మ్యాచ్ రిఫరీ ఇప్పుడు ICCకి నివేదించారని, నిబంధనల ప్రకారం హర్మన్‌ప్రీత్ కౌర్‌ను లెవల్ 2లో దోషిగా నిర్ధారించారని, ఇందుకు గానూ 4 డీ మెరిట్ పాయింట్లు విధిస్తున్నట్లు క్రిక్ బజ్ తెలిపింది. భారత్, బంగ్లాదేశ్ మహిళల జట్ల మధ్య వన్డే సిరీస్‌లో చివరి మ్యాచ్ జూలై 22న షేర్-ఎ-బంగ్లా స్టేడియంలో జరిగింది. రెండు జట్ల మధ్య మ్యాచ్ టైగా ముగియగా, ఆ తర్వాత రెండు జట్లూ సిరీస్‌లో సంయుక్త విజేతలుగా ట్రోఫీని షేర్ చేసుకున్నాయి.
మ్యాచ్ సమయంలో, బంగ్లాదేశ్ జట్టు హర్మన్‌ప్రీత్ కౌర్‌పై క్యాచ్ అవుట్ కోసం విజ్ఞప్తి చేసింది. బంగ్లాదేశ్ జట్టు విజ్ఞప్తిని అంగీకరించిన అంపైర్ ఔట్ నిర్ణయం తీసుకున్నాడు. అంపైర్ వివాదాస్పద నిర్ణయంతో ఆగ్రహం చెందిన కౌర్ వికెట్‌ను బ్యాట్‌తో కొట్టింది. అనంతరం తన్వీర్ అహ్మద్‌తో అంపైర్ వాగ్వాదానికి దిగింది. మ్యాచ్ ముగిసిన తర్వాత కూడా హర్మన్ అంపైర్ నిర్ణయాలపై అసహనం వ్యక్తం చేసింది. మరోవైపు హర్మన్ ప్రవర్తనను బంగ్లాదేశ్ కెప్టెన్ నిగర్ సుల్తానా తప్పుబట్టింది. ‘మ్యాచ్‌లో ఏం జరిగిందో మనందరికి తెలుసు. అది తన పర్సనల్ ఇష్యూ. కానీ సహచర ఆటగాళ్లతో కొంచెం మర్యాదగా ప్రవర్తించాలి. కనీసం ఫొటోలు దిగేందుకు కూడా ఆమె నిరాకరించింది. ఇది మంచి పద్దతి కాదు. ఈ మ్యాచ్‌లో ఉన్న అంపైర్లకు చాలా అనుభవం ఉంది. మనకు నచ్చినా, నచ్చకపోయినా వారు తీసుకున్న నిర్ణయాలను ఫైనల్‌గానే పరిణించాల్సి ఉంటుంది’ అని బంగ్లా కెప్టెన్ హర్మన్ తీరును తప్పపట్టింది.
The controversial dismissal of Harmanpreet Kaur #CricketTwitter #BANvIND pic.twitter.com/XEGdTMgRJd
— Female Cricket (@imfemalecricket) July 22, 2023
Harmanpreet Kaur holds no bars against the umpiring. 🔥#CricketTwitter #BANvIND
pic.twitter.com/thHeO4ulod— Women’s CricZone (@WomensCricZone) July 22, 2023
మరిన్ని క్రీడా వార్తల కోసం క్లిక్ చేయండి..