IND vs ZIM 1st T20I : జింబాబ్వేతో సమరానికి వేళాయె.. హరారే పిచ్ రిపోర్ట్, వాతావరణం ఎలా ఉందంటే?
IND vs ZIM 1st T20I : జింబాబ్వేతో తొలి టీ20కు టీమిండియా సిద్ధమైంది. హరారే స్పోర్ట్స్ క్లబ్ పిచ్ బౌలర్లకు అనుకూలంగా ఉండనుండగా, వర్షం ప్రభావం ఉండదని వాతావరణ శాఖ అంచనా వేసింది. టాస్ గెలిచిన జట్టు ముందుగా బౌలింగ్ ఎంచుకునే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి.

IND vs ZIM 1st T20I : ఇంగ్లాండ్, ఐర్లాండ్ జట్లపై జరిగిన సుదీర్ఘ బ్రిటన్ పర్యటనను ముగించుకుని టీమిండియా ఇప్పుడు జింబాబ్వే గడ్డపై అడుగుపెట్టింది. అక్కడ ఆడిన మొత్తం 7 టీ20 మ్యాచ్‌లలో కేవలం ఒక్క విజయాన్నే సాధించిన మెన్ ఇన్ బ్లూ జట్టు, ఇప్పుడు ఆ చేదు జ్ఞాపకాలను వెనక్కి నెట్టి జింబాబ్వేతో జరిగే మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌పై దృష్టి పెట్టింది. టీ20 ప్రపంచకప్ విజేతలుగా ఉన్న భారత జట్టు, ఈ టూర్‌లో ఎలాగైనా గెలుపు ట్రాక్‌లోకి రావాలని పట్టుదలగా ఉంది. తొలి టీ20 మ్యాచ్ ఇవాళ హరారే స్పోర్ట్స్ క్లబ్ వేదికగా జరగనుంది.
హరారే పిచ్ బ్యాటర్లకా లేక బౌలర్లకా?
హరారే స్పోర్ట్స్ క్లబ్ పిచ్ సాంప్రదాయకంగా నెమ్మదిగా ఉంటూ బ్యాటర్లకు పెద్దగా సహకరించదు. ఇక్కడ బంతి బ్యాట్‌పైకి సరిగ్గా రాకపోవడంతో భారీ షాట్లు ఆడటం అంత సులువు కాదు. ఇక్కడ తొలి ఇన్నింగ్స్ సగటు స్కోరు 158 పరుగులుగా ఉండగా, రెండో ఇన్నింగ్స్‌లో 136 పరుగులే నమోదవుతుంటాయి. దీన్ని బట్టి పిచ్ బౌలర్లకు ముఖ్యంగా కట్టర్లు వేసే పేసర్లు, లెంత్ బంతులు సంధించే బౌలర్లకు ఎక్కువగా అనుకూలిస్తుందని స్పష్టమవుతోంది. అయితే ఎండ తీవ్రత ఎక్కువగా ఉంటే మ్యాచ్ జరిగే కొద్దీ పిచ్ ఫ్లాట్ అయ్యి రెండో ఇన్నింగ్స్‌లో బ్యాటర్లకు కాస్త సులభం కావచ్చు.
టాస్ గెలిస్తే ఏంటి ప్లాన్?
ఇటీవల జింబాబ్వే-బంగ్లాదేశ్ మధ్య జరిగిన సిరీస్‌లోనూ పిచ్‌లు బౌలర్లకే పూర్తి అనుకూలంగా మారాయి. ఇప్పుడు భారత్-జింబాబ్వే మ్యాచ్‌లో కూడా పిచ్ అలాగే ఉండే అవకాశం ఉంది. ఈ నేపధ్యంలో టాస్ గెలిచిన కెప్టెన్ ముందుగా బౌలింగ్ ఎంచుకోవడానికి మొగ్గు చూపవచ్చు. రెండో ఇన్నింగ్స్‌లో బ్యాటింగ్ కొంత మెరుగవుతుందనే అంచనాలు ఉన్నాయి.
హరారే వాతావరణ నివేదిక
మ్యాచు జరిగే హరారే ప్రాంతంలో వాతావరణం చాలా ఆహ్లాదకరంగా ఉండనుంది. మ్యాచ్ సమయంలో ఉష్ణోగ్రత దాదాపు 26 డిగ్రీల సెల్సియస్ వరకు నమోదయ్యే అవకాశం ఉంది. ఎలాంటి వర్షం గండం లేకుండా మ్యాచ్ సాఫీగా జరిగేందుకు వాతావరణం పూర్తిగా సహకరించనుంది.
మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
