Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IND vs WI: ప్లేయింగ్ XIలో శ్రేయాస్ అయ్యర్‌కు స్థానం కష్టమే.. మిడిలార్డర్‌లో అలాంటి వారే కావాలి: రోహిత్ శర్మ

శ్రేయాస్ అయ్యర్‌ను 4 రోజుల క్రితం కోల్‌కతా నైట్ రైడర్స్ ఐపీఎల్ 2022 వేలంలో రూ. 12.25 కోట్లకు కొనుగోలు చేసి, ఆపై 16న అతనిని కెప్టెన్‌గా నియమించింది. అయితే అతను టీమిండియా ప్లేయింగ్ ఎలెవన్‌లో చోటు పొందడం లేదు.

IND vs WI: ప్లేయింగ్ XIలో శ్రేయాస్ అయ్యర్‌కు స్థానం కష్టమే.. మిడిలార్డర్‌లో అలాంటి వారే కావాలి: రోహిత్ శర్మ
India Vs West Indies: hreyas Iyer
Follow us
Venkata Chari

|

Updated on: Feb 18, 2022 | 7:28 AM

వెస్టిండీస్ (India Vs West Indies) తో జరిగిన మొదటి టీ20 మ్యాచ్ లో టీం ఇండియా(Team India) ఘన విజయం సాధించింది. అయితే, బౌలింగ్‌లో మంచి ప్రదర్శన చేసిన టీమిండియా.. బ్యాటింగ్‌లో మాత్రం ఆశించిన స్థాయిలో రాణించలేకపోయింది. అయితే ఈ మ్యాచ్‌లో జట్టు ఆటతీరుతో పాటు ప్లేయింగ్ ఎలెవన్ కూడా చర్చనీయాంశమైంది. ఈ జట్టులో 21 ఏళ్ల లెగ్ స్పిన్నర్ రవి బిష్ణోయ్‌కు అవకాశం ఇచ్చింది. అతను అరంగేట్రంలో అద్భుత ప్రదర్శన చేశాడు. అదే సమయంలో, మిడిల్ ఆర్డర్ బ్యాట్స్‌మెన్ శ్రేయాస్ అయ్యర్‌కు మాత్రం ప్లేయింగ్ XIలో చోటు లభించలేదు. అయితే 4 రోజుల క్రితం శ్రేయాస్ ఐపీఎల్ 2022 వేలంలో రూ. 12.25 కోట్లకు కోల్‌కతా నైట్ రైడర్స్‌లో భాగమయ్యాడు. ఇలాంటి పరిస్థితుల్లో అయ్యర్‌కు ఎందుకు అవకాశం రాలేదంటూ ఎన్నో ప్రశ్నలు మొదలయ్యాయి. అందుకు కారణాన్ని కెప్టెన్ రోహిత్ శర్మ(Rohit Sharma) వెల్లడించాడు.

వెస్టిండీస్‌పై 6 వికెట్ల తేడాతో విజయం సాధించిన తర్వాత, కెప్టెన్ రోహిత్ శర్మను ప్లేయింగ్ ఎలెవన్ గురించి ప్రశ్నించగా, అందులో శ్రేయాస్ అయ్యర్‌ను కూడా ప్రస్తావించారు. దీనికి రోహిత్, భారత బ్యాట్స్‌మెన్ అవసరాన్ని బట్టి ప్లేయింగ్ ఎలెవన్‌ను ఎంపిక చేస్తామని చెప్పుకొచ్చాడు. జట్టుకు మిడిల్ ఆర్డర్‌లో ఆల్ రౌండర్ అవసరమని, అందుకే అతని స్థానంలో వెంకటేష్ అయ్యర్‌ని తీసుకున్నామని రోహిత్ వెల్లడించాడు.

మిడిల్ ఆర్డర్‌లో ఆల్ రౌండర్ అవసరం.. మ్యాచ్ అనంతరం భారత కెప్టెన్ తన వ్యూహం గురించి, ఆడలేని ఆటగాళ్లకు ఇస్తున్న సందేశం గురించి వెల్లడించాడు. ఆటగాళ్లందరూ పరిస్థితిని అర్థం చేసుకున్నారని రోహిత్ చెప్పుకొచ్చాడు. భారత కెప్టెన్ మాట్లాడుతూ.. “శ్రేయాస్ అయ్యర్ లాంటి ఆటగాడు ప్రస్తుతం బెంచ్‌కు పరిమితం కావాల్సి ఉంటుంది. ఇది చాలా కష్టం. కానీ, జట్టు అవసరాలకు అనుగుణంగా నిర్ణయం తీసుకున్నారు. మిడిల్ ఆర్డర్‌లో ఆల్‌రౌండర్‌ కావాలి. జట్టులో ఈ పోటీ బాగానే ఉంది. ప్రపంచకప్‌న‌కు ముందు జట్టుకు ఆల్‌రౌండర్ అవసరమని శ్రేయాస్‌తో చెప్పాం. ఆటగాళ్లందరూ తెలివైనవారు. ప్రొఫెషనల్‌గా ఉంటారు. జట్టు కంటే ఏదీ ఉన్నతమైనది కాదని వారందరూ అర్థం చేసుకున్నారు” అని వెల్లడించాడు.

ప్లేయింగ్ ఎలెవన్‌లో ఎంపిక అనేది ఆటగాళ్ల ఫామ్‌ను దృష్టిలో ఉంచుకోవడమే కాకుండా, ప్రత్యర్థి, ఫీల్డ్‌ను కూడా దృష్టిలో ఉంచుకుని జరుగుతుందని రోహిత్ చెప్పాడు. ప్లేయింగ్ XI ఎంపికలో చాలా జాగ్రత్తలు తీసుకుంటారు. ప్రత్యర్థి జట్టు, పరిస్థితులు, మైదానం పరిమాణం లాంటి ఎన్నో అంశాలు ఇందులోకి వస్తాయి. ఒక్కోసారి బయట కూర్చునే ఆటగాళ్లకు చాలా ఇబ్బందిగా అనిపించినా క్లియర్ మెసేజ్ ఇస్తున్నాం. మేం జట్టుకు మొదటి స్థానం ఇవ్వాల్సి ఉంటుంది” అని పేర్కొన్నాడు.

మిడిలార్డర్‌లో శ్రేయాస్‌కు గట్టి పోటీ.. మిడిల్ ఆర్డర్ టీమిండియా గెలవడంలో కీలకపాత్ర పోషించింది. ఇందులో సూర్యకుమార్ యాదవ్, వెంకటేష్ అయ్యర్ 48 పరుగుల అజేయ భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. మిడిల్ ఆర్డర్‌లో అయ్యర్‌కు పోటీగా సూర్యకుమార్ యాదవ్, వెంకటేష్‌ లాంటి ప్లేయర్లు ఉన్నారు. ఇందులో వెంకటేష్ ఆల్ రౌండర్ సామర్థ్యం కలిగి ఉన్నాడు. సూర్యకుమార్ యాదవ్ నిలకడగా రాణిస్తూ తన స్థానాన్ని నిలబెట్టుకోగలిగాడు. దాంతో అయ్యర్ బెంచ్‌కు పరిమితం కావాల్సి ఉంది.

Also Read: 13 బంతుల్లో తుఫాన్ ఇన్నింగ్స్.. బంతితోనూ ప్రత్యర్ధికి చెమటలు పట్టించిన ధోని శిష్యుడు.. ఎవరో తెలుసా.!

IND vs WI, T20I Series: బీసీసీఐ కీలక నిర్ణయం.. చివరి మ్యాచ్ చూసేందుకు వారికి అనుమతి..!