IND vs WI: చివరి మ్యాచ్​లో ఇండియాకు ఎదురు దెబ్బ.. గాయం కారణంగా మధ్యలోనే వెళ్లిపోయిన బౌలర్..

వెస్టిండీస్‌తో జరిగిన టీ 20 సిరీస్ చివరి మ్యాచ్‌లో టీమ్ ఇండియాకు భారీ ఎదురుదెబ్బ తగిలింది. ఆదివారం కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్ స్టేడియంలో..

IND vs WI: చివరి మ్యాచ్​లో ఇండియాకు ఎదురు దెబ్బ.. గాయం కారణంగా మధ్యలోనే వెళ్లిపోయిన బౌలర్..
Deepak (1)
Follow us
Srinivas Chekkilla

|

Updated on: Feb 21, 2022 | 5:45 AM

వెస్టిండీస్‌తో జరిగిన టీ 20 సిరీస్ చివరి మ్యాచ్‌లో టీమ్ ఇండియాకు భారీ ఎదురుదెబ్బ తగిలింది. ఆదివారం కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్ స్టేడియంలో జరిగిన మూడో, చివరి మ్యాచ్‌లో ఫాస్ట్ బౌలర్ దీపక్ చాహర్(deepak chahar ) గాయపడ్డాడు చాహర్‌కి ఇన్నింగ్స్‌లో రెండో ఓవర్‌లో గాయపడ్డాడు. రన్‌అప్‌లో పరుగెత్తుతున్న సమయంలో కాలి కండరాలు నొప్పితో అతను మైదానాన్ని వీడాడు. ప్రస్తుతం చాహర్ పరిస్థితిపై బోర్డ్ ఆఫ్ కంట్రోల్ ఫర్ క్రికెట్ ఇన్ ఇండియా(BCCI) ఎటువంటి అప్‌డేట్ ఇవ్వలేదు.

సిరీస్‌లోని చివరి మ్యాచ్‌లో భారత్ ఘన విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన భారత జట్టు 184 పరుగులకు ఆలౌటైంది. లక్ష్య ఛేదనకు బరిలోకి దిగిని వెస్టిండీస్​ను దీపక్ ఆదిలోనే దెబ్బ కొట్టాడు. తన తొలి ఓవర్‌లోనే కైల్ మేయర్స్ వికెట్ తీశాడు. ఆ తర్వాత మూడో ఓవర్‌లో పునరాగమనం చేసిన చాహర్, షీ హోప్‌ను కూడా ఔట్ చేసి టీమ్ ఇండియాకు అద్భుతమైన ఆరంభాన్ని అందించాడు. అయితే హోప్ వికెట్ తీసిన తర్వాత గాయపడ్డాడు.

మూడో ఓవర్‌లో, చివరి బంతికి రన్-అప్‌పై పరిగెత్తిన వెంటనే, అతని కాలికి కొంత దెబ్బ తగిలి, అతను మధ్యలో ఆగి, రన్-అప్ పూర్తి చేయకుండా పక్కకు వెళ్లిపోయాడు. చాహర్ నొప్పితో మూలుగుతూ కనిపించాడు. అతను తన కుడి కాలు పట్టుకున్నాడు. అటువంటి పరిస్థితిలో, వెంటనే భారత జట్టు ఫిజియో నితిన్ పటేల్ మైదానానికి చేరుకుని, అతను చాహర్‌ను పరీక్షించాడు. అతను మరింత బౌలింగ్ చేయలేనని భారత బౌలర్ సూచించడంతో, అతను మైదానం నుండి బయటకు వెళ్లాడు.

వెంకటేష్ అయ్యర్ తన ఓవర్ పూర్తి చేశాడు. మైదానం వీడే ముందు దీపక్ 1.5 ఓవర్లు వేసిన 15 పరుగులిచ్చి 2 వికెట్లు పడగొట్టాడు. అయితే, చాహర్ గాయం ఎంత తీవ్రంగా ఉందో బీసీసీఐ ఇంకా ఎలాంటి అప్‌డేట్ ఇవ్వలేదు. శ్రీలంకతో ఫిబ్రవరి 24 నుంచి ప్రారంభం కానున్న టీ20 సిరీస్‌కు అతడు అందుబాటులో ఉంటాడా లేదా అన్నదే ఇప్పుడు అందరూ ఎదురుచూస్తున్న విషయం.

Read Also.. IND vs WI: హిట్ మ్యాన్ హ్యాట్రిక్.. మ్యాచ్​లే కాదు.. సిరీస్​లు కూడా.. విండీస్​ని వైట్ వాష్ చేసిన భారత్..

ఇక చాయ్‌, సమోసాతో అమెరికాలో ముచ్చట్లు హోటళ్ల మెనూలో కొత్తగా..!
ఇక చాయ్‌, సమోసాతో అమెరికాలో ముచ్చట్లు హోటళ్ల మెనూలో కొత్తగా..!
ఉబర్ క్యాబ్‌ను వాట్సాప్ ద్వారా కూడా బుక్ చేసుకోవచ్చు.. ఎలాగంటే..
ఉబర్ క్యాబ్‌ను వాట్సాప్ ద్వారా కూడా బుక్ చేసుకోవచ్చు.. ఎలాగంటే..
ఆసుపత్రిలో చేరిన బాలీవుడ్ బ్యూటీ.. క్లారిటీ ఇచ్చిన టీం.
ఆసుపత్రిలో చేరిన బాలీవుడ్ బ్యూటీ.. క్లారిటీ ఇచ్చిన టీం.
సంక్రాంతికి వేళ ప్రయాణికులకు గుడ్‌ న్యూస్‌
సంక్రాంతికి వేళ ప్రయాణికులకు గుడ్‌ న్యూస్‌
జక్కన్న మాస్టర్ ప్లాన్.. అందుకే రహస్యంగా మహేష్ గెటప్..
జక్కన్న మాస్టర్ ప్లాన్.. అందుకే రహస్యంగా మహేష్ గెటప్..
తప్పతాగడం ఎందుకు ?? ఇలా రోడ్లపై సోలడం ఎందుకు ??
తప్పతాగడం ఎందుకు ?? ఇలా రోడ్లపై సోలడం ఎందుకు ??
వీడికి ఒంటరిగా కనబడితే చెంపలు పగలగొట్టేస్తున్నాడు.. జాగ్రత్త
వీడికి ఒంటరిగా కనబడితే చెంపలు పగలగొట్టేస్తున్నాడు.. జాగ్రత్త
భార్య ఫొటోలు డిలీట్ చేసిన చాహల్.. విడాకులపై హింట్ ఇచ్చాడా?
భార్య ఫొటోలు డిలీట్ చేసిన చాహల్.. విడాకులపై హింట్ ఇచ్చాడా?
రెనాల్ట్ కార్లపై లక్ష కిలోమీటర్ల వారంటీ.. కస్టమర్లకు ఇక పండగే..!
రెనాల్ట్ కార్లపై లక్ష కిలోమీటర్ల వారంటీ.. కస్టమర్లకు ఇక పండగే..!
వావ్ !! ఆటోవాలా ఐడియా అదుర్స్.. ప్రయాణికుల కోసం భలే ఫ్లాన్ చేశాడు
వావ్ !! ఆటోవాలా ఐడియా అదుర్స్.. ప్రయాణికుల కోసం భలే ఫ్లాన్ చేశాడు