Virat Kohli: భారత్, వెస్టిండీస్ జట్ల మధ్య జరుగుతున్న తొలి టెస్ట్ మ్యాచ్ మూడో రోజు ఆటలో విరాట్ కోహ్లీ బౌండరీ సెలెబ్రేషన్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఆ బౌండరీకి అలాంటి ప్రత్యేకత ఉంది మరి. మూడో రోజు ఆటలో శుభమాన్ గిల్(6) పెవిలియన్ చేరిన తర్వాత కింగ్ కోహ్లీ క్రీజులోకి వచ్చాడు. అయితే కోహ్లీ తన ఇన్నింగ్స్‌లో తొలి బౌండరీ కొట్టడానికి ఏకంగా 80 బంతులు తీసుకున్నాడు. టైట్ బౌలింగ్‌తో కోహ్లీని కట్టడి చేసే ప్రయత్నంలో కరేబియన్ బౌలర్లు ఉన్నారు. అప్పటికే కోహ్లీ 25 పరుగులు చేసినప్పటికీ.. అందులో బౌండరీ లేదు. అయితే జోమెల్ వారికన్ వేసిన 109వ ఓవర్‌లో తన ట్రేడ్‌మార్క్ కవర్ డ్రైవ్‌తో బంతిని బౌండరీ బాట పట్టించాడు కోహ్లీ. అంతే.. 81వ బంతికి బౌండరీ నమోదు చేసిన సందర్భంగా కోహ్లీ సెలెబ్రేషన్స్ చేసుకున్నాడు. అందుకు సంబంధించిన వీడియో కూడా ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
Calling it a night! That celebration by @imVkohli after hitting his first boundary on the 81st ball.
.
.#INDvWIonFanCode #WIvIND pic.twitter.com/4SjNLZCMhx ఇవి కూడా చదవండి— FanCode (@FanCode) July 13, 2023
ఇదిలా ఉండగా.. మూడో రోజు ఆట ముగిసే సమయానికి టీమిండియా 2 వికెట్ల నష్టానికి 312 పరుగులు చేసింది. అలాగే తొలి ఇన్నింగ్స్‌లో 150 పరుగులకే కుప్పకూలిన విండీస్ ప్లేయర్లపై 162 పరుగుల ఆధిక్యంతో కొనసాగుతోంది. మూడో రోజు ఆటను ప్రారంభించిన రోహిత్ శర్మ(103) సెంచరీ నమోదు చేసుకుని పెవిలియన్ చేరాడు. అనంతరం క్రీజులోకి వచ్చిన శుభమాన్ గిల్(6) మరోసారి నిరాశపరిచాడు. అనంతరం క్రీజులోకి వచ్చిన కోహ్లీ(36) పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. రోహిత్‌తో కలిసి భారత్ ఇన్నింగ్స్ ప్రారంభించిన యశస్వీ జైస్వాల్(143, నాటౌట్) తొలి టెస్ట్, అంతర్జాతీయ సెంచరీ నమోదు చేసుకోవడంతో పాటు డబుల్ సెంచరీ దిశగా అడుగులు వేస్తున్నాడు.
మరిన్ని క్రీడా వార్తల కోసం క్లిక్ చేయండి..