ఏ క్రికెటర్‌కైనా తన దేశం కోసం టెస్ట్ మ్యాచ్ ఆడడం చాలా పెద్ద విషయంగా భావిస్తాడు. అయితే ఒకటి కంటే ఎక్కువ టెస్టులు ఆడే అవకాశం వస్తే, వారు ఎంతో అదృష్టవంతులుగా మారతారనడంలో సందేహం లేదు. అలాగే చాలా అరుదుగా 100 టెస్టులు ఆడేవారు కనిపిస్తారు. 90 ఏళ్ల భారత టెస్టు క్రికెట్ చరిత్రలో కేవలం 11 మంది క్రికెటర్లు మాత్రమే ఈ ఘనత సాధించగలిగారు. తాజాగా ఈ లిస్టులో 12వ పేరు చేరబోతోంది. అయనే టీమిండియా మాజీ సారథి విరాట్ కోహ్లీ (Virat Kohli). భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్, ప్రస్తుత కాలంలోని అత్యుత్తమ బ్యాట్స్‌మెన్‌లలో ఒకరైన విరాట్ కోహ్లీ 100 టెస్టులు(Virat Kohli’s 100th Test) ఆడుతున్న క్రికెటర్ల క్లబ్‌లో చేరబోతున్నాడు. మొహాలీలో భారత్-శ్రీలంక టెస్టు (India vs Sri Lanka Mohali Test)ఈ చరిత్రకు సాక్ష్యమివ్వనుంది. వేలాది మంది అభిమానులు సాక్షులుగా ఉంటారు. ఈ టెస్టుపై అభిమానుల్లో అత్యుత్సాహం నెలకొని ఉంది.
తన 100వ టెస్టుకు ముందు విరాట్ కోహ్లీ బీసీసీఐకి ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. అభిమానుల రాక కారణంగా ఈ మ్యాచ్ చాలా ప్రత్యేకమైనదని, అయితే తాను కూడా కొంచెం రెస్ట్‌లెస్‌గా ఉన్నాడని చెప్పుకొచ్చాడు. కోహ్లి మాట్లాడుతూ, “ప్రేక్షకులను లోపలికి అనుమతించారని నేను విన్నాను. ఇది ప్రత్యేక ఉదయం అవుతుంది. భారత్ తరపున ఆఖరి మ్యాచ్ ఆడే వరకు ఈ ప్రయాణం కొనసాగుతుంది” అని పేర్కొన్నాడు.
ఆస్ట్రేలియాలో ఆ సెంచరీ చాలా ప్రత్యేకం..
జూన్ 2011లో వెస్టిండీస్‌తో జరిగిన కింగ్‌స్టన్ టెస్టులో అరంగేట్రం చేసిన విరాట్ కోహ్లి, తొలి టెస్టు మ్యాచ్‌లలో విజయం సాధించలేకపోయాడు. అయితే కోహ్లీ ఆస్ట్రేలియాపై అడిలైడ్‌లో సెంచరీ సాధించినప్పుడు, అక్కడ నుంచి వెనుదిరిగి చూడలేదు. ఆ సెంచరీని గుర్తు చేసుకుంటూ కోహ్లీ మాట్లాడుతూ.. ‘నా తొలి టెస్టు సెంచరీ నాకు ఇంకా గుర్తుంది. అది ఎల్లప్పుడూ నాకు ప్రత్యేకంగా ఉంటుంది. ఆస్ట్రేలియాలో అది పూర్తి చేయడం మరింత ప్రత్యేకమైనది’ అంటూ చెప్పుకొచ్చాడు.
టెస్టు క్రికెట్‌లో 8,000 పరుగుల మార్క్‌కు దగ్గరగా ఉన్న కోహ్లీ, “నేను చాలా అదృష్టవంతుడిని, ఎందుకంటే క్రికెటర్లకు అలాంటి అవకాశం చాలా అరుదుగా లభిస్తుంది. నేను దానిని పొందాను. నేను ఈ ఫార్మాట్‌కు నా సర్వస్వం ఇచ్చాను. నా శక్తి మేరకు బాధ్యతను నిర్వర్తించాను’’ అని అన్నాడు.
2015 నుంచి 2020 వరకు అత్యంత ప్రత్యేక సమయం..
బాధ్యత గురించి మాట్లాడితే, కోహ్లీ వరుసగా 7 సంవత్సరాలు భారత టెస్ట్ జట్టుకు నాయకత్వం వహించాడు. కోహ్లి టెస్ట్ కెప్టెన్ అయినప్పుడు, భారతదేశం ICC ర్యాంకింగ్స్‌లో ఏడవ స్థానంలో ఉంది. అతను తప్పుకునే సమయంలో వరుసగా ఐదేళ్లపాటు నంబర్ వన్ టెస్ట్ జట్టుగా ఉంది. దీని గురించి మాజీ కెప్టెన్ మాట్లాడుతూ.. ‘నేను టెస్టు కెప్టెన్సీని చేపట్టినప్పుడు నాకు బాగా గుర్తుంది. జట్టు పట్ల నాకు ఒక విజన్ ఉంది. మేం వరుసగా ఐదేళ్లు నంబర్ వన్‌గా ఉన్నాం. నేను దాని గురించి గర్వపడుతున్నాను. 2015, 2020 మధ్య మేం ఆడిన క్రికెట్ రకం దానికదే ప్రత్యేకమైనది. మేం కొన్ని కఠినమైన మ్యాచ్‌లలో ఓడిపోయాం. కొన్నింటిలో తిరిగి పుంజుకున్నాం. ఈ మొత్తం రౌండ్‌కి నేను గర్వపడుతున్నాను’ అని పేర్కొన్నాడు.
? ??????? ??????? ????? ?
We get up, close and personal with @imVkohli as he is all set to play his 1⃣0⃣0⃣th Test tomorrow at Mohali. ? ? #TeamIndia | #VK100 | #INDvSL | @Paytm
Watch the full interview ? ?https://t.co/IwTW6nZ1ds pic.twitter.com/p6F7ltviCW
— BCCI (@BCCI) March 3, 2022
Yuvaraj Viral Video: తల్లి పై ప్రాంక్ చేసిన యువరాజ్.. ఆమె రియాక్షన్ ఎంత ఇన్నోసెంట్‌గా ఉందో..