శ్రీలంకతో జరిగిన తొలి టెస్టులో విజయం సాధించిన రోహిత్ సేన, రెండో విజయం కోసం బెంగళూరుకు చేరుకున్నారు. అయితే, ఈ మ్యాచ్‌లో రోహిత్ శర్మ(Rohit Sharma) మైదానంలోకి దిగగానే, అతని పేరు మీద ఒక భారీ రికార్డు చేరనుంది. అయితే, రోహిత్ ఈ ఘనత సాధించిన 9వ భారతీయుడు, ప్రపంచంలో 35వ ఆటగాడిగా మారనున్నాడు. ప్రస్తుత టీమ్‌లో ఈ ఘనత నమోదు చేసిన రెండో ఆటగాడు కానున్నాడు. ఇది రోహిత్ శర్మ 400వ అంతర్జాతీయ మ్యాచ్ కానుంది. శ్రీలంకతో(Ind vs Sl 2nd Test)జరిగే పింక్ బాల్ టెస్టు(Pink Ball Test)లో రోహిత్ శర్మకు 400వ అంతర్జాతీయ మ్యాచ్ కానుంది. ఇంతకు ముందు ఆడిన 399 అంతర్జాతీయ మ్యాచ్‌ల్లో 41 సెంచరీలతో 43.65 సగటుతో 15672 పరుగులు చేశాడు.
400 అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడిన 9వ భారత ఆటగాడిగా రోహిత్ శర్మ నిలవనున్నాడు. రోహిత్ కంటే ముందు అంతకంటే ఎక్కువ మ్యాచ్‌లు ఆడిన మిగిలిన 8 మంది భారతీయులు ఎవరో ఇప్పుడు చూద్దాం. సచిన్ టెండూల్కర్ (662 మ్యాచ్‌లు), ఎంఎస్ ధోని (538 మ్యాచ్‌లు), రాహుల్ ద్రవిడ్ (509 మ్యాచ్‌లు), విరాట్ కోహ్లీ (457 మ్యాచ్‌లు), అజారుద్దీన్ (433 మ్యాచ్‌లు), సౌరవ్ గంగూలీ ( 424 మ్యాచ్‌లు), అనిల్ కుంబ్లే (403 మ్యాచ్‌లు), యువరాజ్ సింగ్ (402 మ్యాచ్‌లు) ఈ లిస్టులో ఉన్నారు.
ఇప్పటి వరకు 399 అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడిన రోహిత్ శర్మ శ్రీలంకతో 70 మ్యాచ్‌లు ఆడాడు. అంటే బెంగళూరులో శ్రీలంకతో రోహిత్ తన 71వ అంతర్జాతీయ మ్యాచ్ ఆడనున్నాడు. గత 70 అంతర్జాతీయ మ్యాచ్‌లలో, రోహిత్ శ్రీలంకపై 8 సెంచరీలతో సహా 40.86 సగటుతో 2456 పరుగులు చేశాడు. ఈ సమయంలో రోహిత్ 6 టెస్టుల్లో 56 బ్యాటింగ్ సగటును కలిగి ఉన్నాడు.
రోహిత్ శర్మ ఇప్పటి వరకు ఆడిన 399 అంతర్జాతీయ మ్యాచ్‌లలో 42 మ్యాచులకు కెప్టెన్‌గా వ్యవహరించాడు. ఇందులో 36 సార్లు భారత్‌ను గెలిపించాడు. అదే సమయంలో రోహిత్ కెప్టెన్సీలో 6 మ్యాచ్‌ల్లో భారత్ ఓడిపోయింది.
Also Read: IND vs WI: ముందుకు సాగాలంటే గెలవాల్సిందే.. వెస్టిండీస్‌తో కీలక పోరుకు సిద్ధమైన టీమిండియా..