రవీంద్ర జడేజా(Ravindra Jadeja) తన ఎడమ చేతితో శ్రీలంకను చిత్తు చేశాడు. ముందుగా బ్యాట్‌తో దంచికొట్టి, ఆ తర్వాత బంతితో చుక్కలు చూపించాడు. గత 60 ఏళ్లలో శ్రీలంక (Sri Lanka)పై గొప్ప స్క్రిప్ట్ రాసిన తొలి భారతీయ క్రికెటర్‌గా నిలిచాడు. మొహాలీ టెస్టు (Mohali Test)తొలి ఇన్నింగ్స్‌లో జడేజా అద్భుత ప్రదర్శన కారణంగా శ్రీలంక ఫాలోఆన్ ఆడాల్సి వచ్చింది. అంటే భారత్ భారీ విజయం దిశగా పయనిస్తున్నట్లు కనిపిస్తోంది. రవీంద్ర జడేజా చేసిన అద్భుతం ఏమిటో ఇప్పుడు తెలుసుకోండి.
నిజానికి మొహాలీ టెస్టులో రవీంద్ర జడేజా మ్యాజిక్ చేశాడు. శ్రీలంకపై తొలుత బ్యాటింగ్‌లో భారీ ఇన్నింగ్స్ ఆడిన జడేజా.. ఆ తర్వాత బంతితో విధ్వంసం సృష్టించాడు. ఇలా చేస్తూనే జడేజా రికార్డు కూడా సృష్టించాడు.
బిషన్ సింగ్ బేడీతో సమానంగా నిలిచిన జడేజా..
శ్రీలంకతో మొహాలీ టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో రవీంద్ర జడేజా తొలుత బ్యాటింగ్‌తో 175 పరుగులు చేశాడు. తర్వాత బంతితో 41 పరుగులకే 5 వికెట్లు తీశాడు. టెస్టు క్రికెట్‌లో జడేజాకి ఇది రెండో సెంచరీ. కాగా, బంతితో 10వ సారి 5 వికెట్లు పడగొట్టాడు. సొంతగడ్డపై 8వ సారి 5 వికెట్లు పడగొట్టి లెఫ్టార్మ్ బౌలర్ అద్భుత ప్రదర్శన చేశాడు. ఈ విషయంలో బిషన్ సింగ్ బేడీ పేరిట ఉన్న భారత రికార్డును సమం చేశాడు.
60 ఏళ్ల తర్వాత భారత క్రికెట్‌లో..
60 ఏళ్ల భారత క్రికెట్ చరిత్రలో తొలిసారిగా, ఒక ఆటగాడు టెస్ట్ క్రికెట్‌లో ఒకే ఇన్నింగ్స్‌లో 150 కంటే ఎక్కువ పరుగులు చేయడంతోపాటు 5 లేదా అంతకంటే ఎక్కువ వికెట్లు తీశాడు. ఓవరాల్‌గా ఈ ఘనత సాధించిన మూడో భారతీయుడిగా జడేజా నిలిచాడు. భారత క్రికెట్‌లో తొలిసారిగా 1952లో లార్డ్స్‌లో జరిగిన టెస్టులో వినూ మన్కడ్ ఈ ఘనత సాధించాడు. ఆ తర్వాత 1962 సంవత్సరంలో, పాలీ ఉమ్రిగర్ ఆ ఫీట్‌ను పునరావృతం చేసిన రెండవ ఆటగాడిగా నిలిచాడు. ఇక, 60 ఏళ్ల తర్వాత జడేజా ఈ జాబితాలో మూడో ఆటగాడిగా చేరాడు.
సొంతగడ్డపై బిషన్ సింగ్ బేడీ రికార్డును బంతితో సమం చేసిన జడేజా..
మొహాలీలో బ్యాట్‌తో కపిల్ దేవ్ రికార్డును బద్దలు కొట్టాడు. ప్రస్తుతం టెస్టుల్లో 7వ ర్యాంక్‌లో అత్యధిక స్కోరు సాధించిన భారత ఆటగాడిగా నిలిచిన జడేజా.. టెస్టు క్రికెట్‌లో 36.46 సగటును కలిగి ఉన్నాడు. బౌలింగ్‌లో అతని సగటు 24.50గా నిలిచింది. ఈ రెండు గణాంకాలు జడేజాను గొప్ప ఆల్ రౌండర్‌గా మార్చడానికి సరిపోతాయనడంలో సందేహం లేదు.