
ICC World Cup Match Report, India vs Sri Lanka, 33rd Match: అద్భుతమైన ఫామ్‌లో ఉన్న టీమిండియా గురువారం జరిగిన ప్రపంచకప్‌లో శ్రీలంకపై 302 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ప్రపంచకప్ చరిత్రలో భారత్‌కు ఇదే అతిపెద్ద విజయంగా నిలిచింది. 16 ఏళ్ల నాటి రికార్డును భారత్ బద్దలు కొట్టింది. 2007లో ఆ జట్టు 257 పరుగుల తేడాతో బెర్ముడాను ఓడించింది. ఈ ప్రపంచకప్‌లో భారత్ వరుసగా 7వ మ్యాచ్‌లో విజయం సాధించి సెమీఫైనల్‌లో మొదటి స్థానాన్ని ఖాయం చేసుకుంది. 7 మ్యాచ్‌లు ఆడిన భారత్ 14 పాయింట్లతో టోర్నీలో అజేయంగా ఉంది.
ముంబైలోని వాంఖడే స్టేడియంలో తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ 8 వికెట్లకు 357 పరుగులు చేసింది. రెండో ఇన్నింగ్స్‌లో భారత బౌలర్లు శ్రీలంకను 19.4 ఓవర్లలో 55 పరుగులకే ఆలౌట్ చేశారు.
టీమిండియా తరపున మహ్మద్ షమీ 5 వికెట్లు, మహ్మద్ సిరాజ్ 3 వికెట్లు, జస్ప్రీత్ బుమ్రా 1 వికెట్ తీశారు. స్పిన్నర్ రవీంద్ర జడేజాకు ఒక వికెట్ దక్కింది. దీనికి ముందు శుభ్‌మన్ గిల్ (92 బంతుల్లో 92 పరుగులు), విరాట్ కోహ్లి (94 బంతుల్లో 88 పరుగులు), శ్రేయాస్ అయ్యర్ (56 బంతుల్లో 82 పరుగులు) సెంచరీ చేయడంలో మిస్సయ్యారు.
భారత్: రోహిత్ శర్మ (కెప్టెన్), కెఎల్ రాహుల్ (వికెట్ కీపర్), విరాట్ కోహ్లీ, శుభ్‌మన్ గిల్, శ్రేయాస్ అయ్యర్, సూర్యకుమార్ యాదవ్, రవీంద్ర జడేజా, జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ షమీ, మహ్మద్ సిరాజ్, కుల్దీప్ యాదవ్.
శ్రీలంక: కుసాల్ మెండిస్ (కెప్టెన్ & వికెట్ కీపర్), దిముత్ కరుణరత్నే, ఏంజెలో మాథ్యూస్, చరిత్ అసలంక, పాతుమ్ నిస్సంక, దుషన్ హేమంత, సదీర సమరవిక్రమ, మహేశ్ తీక్షన, దిల్షన్ మధుశంక, దుష్మంత చమీర.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..