వరుస విజయాలతో టీమిండియా ఫుల్‌జోష్‌లో ఉంది. బ్యాటింగ్‌లోనూ, బౌలింగ్‌లోనూ భారత ఆటగాళ్లు సత్తాచాటడంతో ప్రత్యర్థి జట్లు ఏమాత్రం ప్రతిఘటన చూపకుండానే చేతులెత్తేస్తున్నాయి. ఇప్పటికే కరేబియన్ జట్టుతో జరిగిన సిరీస్ లను క్లీన్ స్వీప్ చేసిన భారతజట్టు.. శ్రీలంక (India vs Sri Lanka) తో జరిగిన మూడు టీ20 మ్యాచ్ ల సిరీస్ ను కూడా వైట్‌వాష్ చేసింది. ఆతర్వాత మొహాలీ వేదికగా లంకేయులతో జరిగిన మొదటి టెస్టులోనూ ఇన్నింగ్స్ విజయం సాధించి సిరీస్‌లో ఆధిక్యం సంపాదించింది. ఇక తాజాగా బెంగళూరు వేదికగా ప్రారంభమైన పింక్‌బాల్ టెస్టును రెండో రోజే పూర్తిగా తన ఆధీనంలోకి తెచ్చుకుంది. దీంతో మరో భారీ విజయానికి చక్కగా బాటలు వేసుకుంది రోహిత్ సేన.
పంత్, అయ్యర్ మరోసారి..
శ్రీలంకతో జరుగుతున్న టెస్టు సిరీస్‌ను క్లీన్‌స్వీప్ చేసే దిశగా టీమిండియా మరో అడుగేసింది. లంక ముందు భారీ టార్గెట్ ఉండడంతోపాటు.. పిచ్ క్రమంగా బౌలర్లకు అనుకూలిస్తుండడంతో మూడోరోజే మ్యాచ్ ముగిసిపోవచ్చని క్రికెట్ పండితులు చెబుతున్నారు. ఇక రెండో రోజు ఆట చూస్తే.. టీమిండియా బౌలర్ల ధాటికి లంక తొలి ఇన్నింగ్స్‌లో 109 పరుగులకే కుప్పకూలింది. బుమ్రా ఐదు వికెట్లు తీస్తే.. అశ్విన్, షమీ చెరి రెండు వికెట్లు, అక్షర్ ఓ వికెట్ తీశారు. ఇక రెండో ఇన్నింగ్స్ బరిలోకి దిగిన భారత్‌కు శుభారంభమే లభించింది. రోహిత్ 46 రన్స్‌చేసి హాఫ్ సెంచరీ ముందు ఔటయ్యాడు. మయాంక్ 22, విహారి 35 పరుగులు చేశారు. ఇక కోహ్లీ మరోసారి నిరాశపరచాడు. కేవలం13 రన్స్ చేసి పెవిలియన్ చేరాడు. అయితే రిషభ్ పంత్, అయ్యర్ మరోసారి మెరిశారు. అర్ధసెంచరీలు చేసి టీమిండియాకు మెరుగైన స్కోరు అందించారు. ముఖ్యంగా కేవలం 28 బంతుల్లో అర్ధ సెంచరీ చేసిన పంత్.. టెస్టుల్లో టీమిండియా తరఫున ఫాస్టెస్ట్ ఫిఫ్టీ కొట్టిన ఆటగాడిగా రికార్డుల్లోకెక్కాడు. మొదటి ఇన్నింగ్స్‌లో త్రుటిలో కోల్పోయిన శ్రేయస్ అయ్యర్ (67) రెండో ఇన్నింగ్స్ లోనూ టాప్ స్కోరర్‌గా నిలిచాడు. వీరిద్దరి చలవతో రెండో రోజు భారత్ తన రెండో ఇన్నింగ్స్‌ను 303/ 9 వద్ద డిక్లేర్ చేసి శ్రీలంక ముందు 447 పరుగుల భారీ విజయ లక్ష్యాన్ని నిర్దేశించింది. కాగా భారీ లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో శ్రీలంక మళ్లీ తడబడింది. తొలి ఓవర్లోనే ఓపెనర్ తిరిమానే వికెట్‌ను కోల్పోయింది. కాగా రెండో రోజు ఆట ముగిసే సమయానికి వికెట్ నష్టానికి 28 పరుగులు చేసిన లంకేయులు గెలవాలంటే ఇంకా 419 రన్స్ చేయాల్సి ఉంది. అయితే టీమిండియా బౌలర్ల జోరు చూస్తుంటే ఈ టార్గెట్‌ను ఛేదించడం అసాధ్యమే.
Also Read:Corona: ప్రపంచం మీద కరోనా మరోసారి దాడి చేయబోతోందా..? అక్కడ లాక్‌డౌన్ దేనికి సంకేతాం..!
Vehicles Auction: సీజ్చేసిన వాహనాలకు వేలం.. ఖజానాకు భారీ లాభం.. వచ్చిందెంతంటే..
Earthquake: ఆ రెండు దేశాల్లో భారీ భూకంపం.. భయాందోళనలో అక్కడి ప్రజలు..