AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IND vs SL: లంక లాగేసుకుంది.. రెండో టెస్టులో ఊహించని ఫలితం?

కొలంబోలో భారత్, శ్రీలంక మధ్య రెండో టెస్టు ఉత్కంఠగా సాగుతోంది. 509 పరుగుల భారీ స్కోర్‌ చేసిన భారత్‌, శ్రీలంకను 290 పరుగులకు ఆలౌట్‌ చేసి ఫాలోఆన్‌ ఇచ్చింది. అయితే రెండో ఇన్నింగ్స్‌లో లంక బ్యాటర్లు అద్భుతంగా పోరాడుతున్నారు. సోనల్‌ దినూష 76 పరుగులతో క్రీజులో నిలిచాడు.

IND vs SL: లంక లాగేసుకుంది.. రెండో టెస్టులో ఊహించని ఫలితం?
Ind Vs Sl
SN Pasha
|

Updated on: Aug 27, 2026 | 1:32 PM

Share

భారత్, శ్రీలంక మధ్య కొలంబో వేదికగా జరుగుతున్న రెండో టెస్టులో ఊహించని ఫలితం వచ్చేలా కనిపిస్తోంది. కచ్చితంగా ఇన్నింగ్స్ తేడాతో గెలుస్తాం అనుకున్న మ్యాచ్‌లో శ్రీలంక నుంచి గట్టి పోటీ ఎదురైంది. ఫాలో ఆన్ ఆడుతూ కూడా లంక బ్యాటర్లు రెండో ఇన్నింగ్స్‌లో టీమిండియా బౌలర్లకు షాక్ ఇచ్చారు. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా తొలి ఇన్నింగ్స్‌లో 509 పరుగులు చేసి 9 వికెట్లు కోల్పోయి ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేసింది.

దేవదత్ పడిక్కల్, ధృవ్ జురెల్ అద్భుతమైన సెంచరీలు, రిషభ్ పంత్ హాఫ్ సెంచరీతో భారత్ భారీ స్కోర్ చేసింది. ఇక ఆ తర్వాత తొలి ఇన్నింగ్స్‌లో బ్యాటింగ్‌కు దిగిన శ్రీలంకను భారత బౌలర్లు కేవలం 290 పరుగులకే ఆలౌట్ చేయడంతో.. కెప్టెన్ శుబ్‌మన్ గిల్ లంకను ఫాలో ఆన్ ఆడమని ఆహ్వానించాడు. 214 పరుగుల లోపలే లంకను ఆలౌట్ చేసినా లేదా తక్కువ టార్గెట్‌‌తో టీమిండియా రెండో ఇన్నింగ్స్ ఆడినా గెలుపు ఖాయం అనుకున్నారు అంతా. కానీ ఇప్పుడు పరిస్థితి రివర్స్ అయ్యేలా ఉంది. మ్యాచ్ డ్రా దిశగా సాగుతోంది. ఆట చివరి రోజు శ్రీలంక అద్భుతంగా బ్యాటింగ్ చేస్తోంది. సోనల్ దినూష లంక బ్యాటింగ్‌కు వెన్నుముకలా మారాడు. 76 పరుగులతో క్రీజ్‌లో పాతుకుపోయాడు.

ప్రస్తుతం ఆట చివరి రోజు రెండో సెషన్ జరుగుతోంది. లంక 139 పరుగుల లీడ్‌లో ఉంది. చితిలో మరో మూడు వికెట్లు ఉన్నాయి. చివరి సెషన్ లోపు మరికొన్ని పరుగులు జోడించి ఆలౌట్ అయినా.. మ్యాచ్ ఫలితం ఏదైనా కావొచ్చు. టీమిండియా బ్యాటర్లు టీ20 స్టైల్‌లో బ్యాటింగ్ చేసిన 200 లోపు టార్గెట్‌ను అయినా కొట్టాలి, లేదా లంక బౌలర్లు భారత్‌ను ఆలౌట్ అయినా చేయాలి? లేదా డ్రా అయినా అవ్వొచ్చు. విజయం తప్ప ఏ ఫలితం వచ్చినా.. అది భారత్‌కు ఎదురుదెబ్బే అవుతుంది. ఎందుకంటే కచ్చితంగా గెలవాల్సిన మ్యాచ్‌ డ్రా అయితే అది భారత్‌కు ఓటమితో సమానం.

మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us
ఉత్తర భారతాన్ని వణికించిన భూకంపం.. ఢిల్లీలో ప్రకంపనలతో జనం..
ఉత్తర భారతాన్ని వణికించిన భూకంపం.. ఢిల్లీలో ప్రకంపనలతో జనం..
పగిలిన మడమలు సాఫ్ట్‌గా అవుతాయ్.. జస్ట్ ఈ చిట్కాలు పాటిస్తే చాలు..
పగిలిన మడమలు సాఫ్ట్‌గా అవుతాయ్.. జస్ట్ ఈ చిట్కాలు పాటిస్తే చాలు..
అమ్మాయిలను హత్య చేసే ఆటోడ్రైవర్.. OTTలో రియల్ సైకో కిల్లర్ స్టోరీ
అమ్మాయిలను హత్య చేసే ఆటోడ్రైవర్.. OTTలో రియల్ సైకో కిల్లర్ స్టోరీ
శ్రేయాస్ సూపర్ ఇన్నింగ్స్.. తొలి టీ20లో భారత్ ఘన విజయం..
శ్రేయాస్ సూపర్ ఇన్నింగ్స్.. తొలి టీ20లో భారత్ ఘన విజయం..
ఏం క్యాచ్ రా ఛోటా ప్యాకెట్.. బౌండరీ లైన్‌లో అదుర్స్ అంతే..!
ఏం క్యాచ్ రా ఛోటా ప్యాకెట్.. బౌండరీ లైన్‌లో అదుర్స్ అంతే..!
విపక్ష ఎంపీల నిరసనపై ఎన్నికల సంఘం క్లారిటీ..
విపక్ష ఎంపీల నిరసనపై ఎన్నికల సంఘం క్లారిటీ..
దేశమంతటా ఫామ్‌-సిక్స్ రచ్చ.. ‘గో జ్ఞానూ గో’..!
దేశమంతటా ఫామ్‌-సిక్స్ రచ్చ.. ‘గో జ్ఞానూ గో’..!
పండగ వేళ రైలు ప్రయాణికులకు గుడ్‌న్యూస్‌..ఈ రూట్లో ప్రత్యేక రైళ్లు
పండగ వేళ రైలు ప్రయాణికులకు గుడ్‌న్యూస్‌..ఈ రూట్లో ప్రత్యేక రైళ్లు
న్యూజిలాండ్ టూర్‌కు టీమిండియా.. స్క్వాడ్‌లో వైభవ్‌కి చోటు..!
న్యూజిలాండ్ టూర్‌కు టీమిండియా.. స్క్వాడ్‌లో వైభవ్‌కి చోటు..!
మాధురి రాథోడ్ ఈజ్ బ్యాక్.. మరో ఫోక్ సాంగ్‌తో అదరగొట్టేసిందిగా..
మాధురి రాథోడ్ ఈజ్ బ్యాక్.. మరో ఫోక్ సాంగ్‌తో అదరగొట్టేసిందిగా..